జాతీయ విద్యా దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాతీయ విద్యా దినోత్సవంను భారతదేశంలో ప్రతి సంవత్సరం ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి అయిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పుట్టినరోజైన నవంబరు 11 న జరుపుకుంటారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్[మార్చు]

భారత స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ దంపతులకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు. ఇతను ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు.