Jump to content

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్

వికీపీడియా నుండి
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్
కమిషన్ అవలోకనం
స్థాపనం 14 ఆగస్టు 1993; 31 సంవత్సరాల క్రితం (1993-08-14)
అధికార పరిధి భారత ప్రభుత్వం
ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ
Minister responsible వీరేంద్ర కుమార్ ఖతిక్, కేంద్ర సామాజిక న్యాయం , సాధికారిక శాఖ
కమిషన్ కార్యనిర్వాహకుడు/లు భగవాన్ లాల్ సాహ్ని , చైర్మన్, డా. లోకేష్ కుమార్ ప్రజాపతి , వైస్ చైర్మన్
కౌశలేంద్ర సింగ్ పటేల్, సభ్యుడు
సుధా యాదవ్, సభ్యుడు
ఆచార్య తల్లోజు, సభ్యుడు
వెబ్‌సైటు
http://www.ncbc.nic.in

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టం 1993 ప్రకారం 1993 ఆగస్టు14న ఏర్పడింది. 1953లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కాకాసాహెబ్ కాలేల్కర్ అధ్యక్షతన మొదటి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.ఇది 1955లో నివేదిక సమర్పించింది. 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సిఫారసులు చేసేందుకు బి.పి. మండలం అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 1980లో నివేదిక సమర్పించింది. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. 1979లో జనతాప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో మండలం కమిషన్ సిఫారసులు అమలుకాలేదు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వం మండలం కమిషన్ సిఫారసులను అమలుచేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 1993లో పార్లమెంట్ చట్టం ద్వారా శాశ్వత బీసీ కమిషన్‌ను 1993 ఆగస్టు14న ఏర్పాటు చేశారు. దేశంలో 2399 వెనుకబడిన కులాల ఉన్నాయి.

నిర్మాణం, నియామకం, పదవీ కాలం

[మార్చు]

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. ఈ కమిషన్ చైర్మన్, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరి పదవీ కాలం 3 సంవత్సరాలు. వీరిని ముందుగా తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది.[1]

విధులు

[మార్చు]
  1. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించే రక్షణలు, ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలు చేసేందుకు కృషి చేయడం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేయడం.
  2. వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేసి, వాటిని మెరుగుపరిచేందుకు సూచనలు చేయడం.
  3. బీసీ వర్గాల ప్రగతికోసం రూపొందించిన సిఫారసులను ఒక నివేదిక రూపంలో రాష్ట్రపతికి అందజేయడం, రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తారు.
  4. కమిషన్ తన విధులను నిర్వహించే విషయంలో సివిల్ కోర్టు అధికారాలను కలిగి ఉంటుంది.
  5. వెనుకబడిన కులాల కేంద్ర జాబితాలో మార్పులు, చేర్పులను సిఫారసు చేస్తుంది.
  6. బీసీల సంక్షేమానికి చేపట్టిన చర్యలను సమీక్షిస్తుంది.
  7. ఏ వ్యక్తినైనా విచారణకు కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తుంది.
  8. వార్షిక నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది.[2]

చైర్మన్లు

[మార్చు]
నెం పేరు పదవి చేపట్టిన తేదీ పదవి ముగిసిన తేదీ కమిషన్
1 జస్టిస్ ఆర్.ఎన్. ప్రసాద్ 1993 1996 మొదటి చైర్మన్
2 జస్టిస్ శ్యాంసుందర్ 1997 2000 2వ చైర్మన్
3 జస్టిస్ బి.ఎల్. మాధవ్ 2000 2002 3వ చైర్మన్
4 జస్టిస్ రామ్ సూరత్‌సింగ్ 2002 2005 4వ చైర్మన్
5 జస్టిస్ ఎస్.ఆర్. పాండ్యన్ 2006 2009 5వ చైర్మన్
6 జస్టిస్ ఎం. నారాయణరావు 2010 2013 6వ చైర్మన్
7 జస్టిస్ వంగాల ఈశ్వరయ్య [3] 2013 2016 7వ చైర్మన్

ప్రస్తుత సభ్యులు[4]

[మార్చు]
చైర్‌పర్సన్‌ హన్స్ రాజ్ గంగారాం అహిర్
వైస్ చైర్మన్ డా. లోకేష్ కుమార్ ప్రజాపతి
సభ్యురాలు సుధా యాదవ్
సభ్యుడు కౌశలేంద్ర సింగ్ పటేల్
సభ్యుడు తల్లోజు ఆచారి

మూలాలు

[మార్చు]
  1. Eenadu (2019). "జాతీయ, రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు". Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
  2. Sakshi (2015). "జాతీయ కమిషన్లు-విధులు" (in ఇంగ్లీష్). Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
  3. "Eswaraiah new chief of backward classes panel". Business Standard. 23 September 2013. Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
  4. http://www.ncbc.nic.in/User_Panel/UserView.aspx?TypeID=1179