Jump to content

జాతీయ సమైక్యత

వికీపీడియా నుండి

పలు భాషలు

[మార్చు]

మన దేశము భారతదేశము, మనము భారతీయులము, మనము ఒకే జాతికి చెందిన వారము అయినను మన దేశములో పలు విధములైన భాషలవారుండుట చేత, భాషాభేదములు అనైక్యతకు దారితీయుచున్నవి, అనేక కులములవారు, అనేక మతముల వారుండుటచే కూడా అనైక్యత ఏర్పడుచున్నది.అన్యరాష్ట్రముల భాషా సాహిత్యముల వారి కందించిన యిరుగు పొరుగు నున్న సోదరులను గురించిన అవగాహన ఏర్పడును.

సమైక్యత

[మార్చు]

విద్యా విధానము ద్వారా, సాంస్కృతిక కార్యక్రమముల మూలమున ఉపాధి కల్పన వలన, వర్ణాంతర, రాష్ట్రాంతర వివాహములను ప్రోత్సహించుట వలన సమైక్యత కాపాడుకొనగలము.సంబంధ బాంధవ్యములు తరతరాలుగా నిలిచిపోతాయి.ఒక ప్రాంతము సంగీత నృత్య నాటక బృందముల వారు మరియొక ప్రాంతమునకు వెళ్ళి ప్రదర్మనలిచ్చిన సమైక్య భావము ఏర్పడుతుంది

ఉద్యోగం

[మార్చు]

అఖిల భారతస్థాయిలో కొన్ని ఉద్యోగములు గలవు.అదే ప్రాతిపదికపై అధిక సంఖ్యలో ఉపాధి కల్పించిన, ఉద్యోగుల మధ్య ప్రాంతీయ భేదములు సమసి సామరస్యభావము పెంపొందును.ఉద్యోగుల బదిలీలు కూడా అవగాహనకు తోడ్పడవలెనే గాని అపోహలకు తావీయరాదు.ప్రభుత్వమిట్టి విషయములలో విజ్ఘత ప్రదర్నించిన అధికారులకు ఉద్యోగులకు మధ్య కుల, మత, ప్రాంత భేదములకు బదులు అభిమానము, గౌరవము కలుగును.

కార్యక్రమములు

[మార్చు]

ఆకాశవాణి, టి.వీ. కార్యక్రమాల్లో మనము అన్ని బాణీలకు, అన్ని భాషలకు చెందిన సంగీత కచేరీలు, తదితర రూపకములు జాతీయ కార్యక్రమముల పేరిట వినుచున్నాము.ప్రభుత్వ సహకారముతో లలితకళా ఎకాడమీలు-సంగీత నాటక ఎకాడమీలు-పలు కార్యక్రమములు నిర్వహించి జాతి సమైక్యతకు తోడ్పడుచున్నవి.నేడు జాతిని సంఘటిత పరచుటలో చలన చిత్రములు ప్రముఖ పాత్ర వహించుచున్నవి.

కర్తవ్యము

[మార్చు]

సంకుచిత దృష్టి సమైక్యతకు గొడ్డలి పెట్టు.భిన్నత్వంలో ఏకత్వము మనదేశ ప్రత్యేకత.ఆ భావమును పునరుద్ధరించి సమైక్యతను కాపాడుటయే నేటితరము ప్రధాన కర్తవ్యము.