జానీ వాక్టర్
జానీ వాక్టర్ | |
---|---|
జననం | జాన్ డబ్ల్యు. వాక్టర్ III 1986 ఆగస్టు 31 చార్లెస్టన్, సౌత్ కరోలినా, అమెరికా |
మరణం | 2024 మే 25 లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా, అమెరికా | (వయసు 37)
వృత్తి | నటుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 2007–2024 |
Notable work(s) | జనరల్ హాస్పిటల్ సైబీరియా (టెలివిజన్ సిరీస్) |
జానీ వాక్టర్ (ఆంగ్లం: Johnny Wactor; 1986 ఆగష్టు 31 - 2024 మే 25) ఒక అమెరికన్ నటుడు. జనరల్ హాస్పిటల్ సిరీస్ లో బ్రాండో కార్బిన్, సైబీరియా సిరీస్ లో జానీ పాత్రలకు ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయన ఆర్మీ వైవ్స్ సిరీస్, యుఎస్ఎస్ ఇండియానాపోలిస్ః మెన్ ఆఫ్ కరేజ్, సూపర్సెల్ చిత్రాలలో కూడా పాత్రలు పోషించాడు.
కెరీర్
[మార్చు]2007లో వచ్చిన లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ ఆర్మీ వైవ్స్ అనే టెలివిజన్ షోతో జానీ వాక్టర్ అరంగేట్రం చేసాడు. ఆ తరువాత, ఆయన వెస్ట్‌వరల్డ్, ది ఓ, స్టేషన్ 19, క్రిమినల్ మైండ్స్, హాలీవుడ్ గర్ల్ వంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లు, పలు టీవీ షోలలో నటించాడు.
అయితే, జనరల్ హాస్పిటల్ లో తన పాత్రకు ఎనలేని గుర్తింపు వచ్చింది. 1963లో ప్రారంభమైన ఈ ధారావాహికలో 2020 నుంచి 2022 వరకు దాదాపు 200 ఎపిసోడ్స్‌లలో జానీ వాక్టర్ నటించాడు.
మరణం
[మార్చు]లాస్ ఏంజిల్స్లో 2024 మే 25న ఆయన ప్రయాణిస్తున్న కారులో దోపిడీ చేస్తూ అగంతకులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించాడు.[1] ఆయన వయస్సు 37 సంవత్సరాలు.[2][3][4][5] ఆగస్ట్ 15, 2024న, వాక్టర్ హత్యకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు.[6] నాలుగు రోజుల తర్వాత, సౌత్ లాస్ ఏంజెల్స్ స్ట్రీట్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులపై ప్రాసిక్యూటర్లు హత్య కేసు పెట్టారు; ఇద్దరు ఇతర వ్యక్తులపై తక్కువ ఛార్జీలు విధించబడ్డాయి.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Johnny Wactor: అమెరికాలో దారుణం.. ప్రముఖ హాలీవుడ్ నటుడు కాల్చివేత | General Hospital Actor Johnny Wactor Killed In USA ktr". web.archive.org (in ఇంగ్లీష్). 2024-05-27. Archived from the original on 2024-05-27. Retrieved 2024-05-27.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Johnny Wactor Dies: 'General Hospital' & 'Siberia Actor' Was 37". Deadline (in ఇంగ్లీష్). 2024-05-26. Retrieved 2024-05-26.
- ↑ "Johnny Wactor, 'General Hospital' Actor, Shot and Killed During Suspected Theft Attempt". Variety (in ఇంగ్లీష్). 2024-05-26. Retrieved 2024-05-26.
- ↑ "'General Hospital's' Johnny Wactor killed in catalytic converter heist in downtown L.A., police say". Los Angeles Times (in ఇంగ్లీష్). 2024-05-26. Retrieved 2024-05-26.
- ↑ "Johnny Wactor of 'General Hospital' shot and killed in downtown Los Angeles". KTLA (in ఇంగ్లీష్). 2024-05-26. Archived from the original on 2024-05-26. Retrieved 2024-05-26.
- ↑ Coleman, Ryan (2024-08-15). "4 arrested in killing of General Hospital star Johnny Wactor" (in ఇంగ్లీష్). Entertainment Weekly. Retrieved 2024-08-16.
- ↑ Winton, Richard (2024-08-19). "Men charged with murder in Johnny Wactor's death implicated themselves in jailhouse talk, sources say". Los Angeles Times (in ఇంగ్లీష్). Archived from the original on 2024-08-19. Retrieved 2024-08-19.