Jump to content

జాన్ గోల్డ్‌విన్

వికీపీడియా నుండి
జాన్ గోల్డ్‌విన్
67వ వార్షిక పీబాడీ అవార్డ్స్ లంచ్ జాన్ గోల్డ్‌విన్, సారా కొల్లెటన్, జెఫ్ లిండ్సే, జోనాథన్ ఎస్ట్రిన్ (వాల్డోర్ఫ్ ఆస్టోరియా హోటల్ న్యూయార్క్)
జననం
జాన్ హోవార్డ్ గోల్డ్‌విన్

(1958-08-10) 1958 ఆగస్టు 10 (వయసు 66)
విద్యాసంస్థస్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం
వృత్తినిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1985–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
కొలీన్ క్యాంప్
(m. 1986; div. 2001)
జెఫ్రీ మైఖేల్ క్లైన్
(m. 2011)
పిల్లలు1
తల్లిదండ్రులు
బంధువులు

జాన్ హోవార్డ్ గోల్డ్‌విన్ అమెరికన్ సినిమా నిర్మాత.

జననం

[మార్చు]

జాన్ గోల్డ్‌విన్ 1958, ఆగస్టు 10న నిర్మాత శామ్యూల్ గోల్డ్‌విన్ జూనియర్ - సినిమా, రంగస్థల నటి జెన్నిఫర్ హోవార్డ్‌ దంపతులకు కాలిఫోర్నియా లోని లాస్ ఏంజిల్స్ లో జన్మించాడు. ఇతనికి ఇద్దరు సోదరులు (దర్శకనటుడు టోనీ గోల్డ్‌విన్, ఫ్రాన్సిస్ గోల్డ్‌విన్) ఉన్నారు.

కుటుంబం

[మార్చు]

తండ్రి తరఫు తాతలు ఆస్కార్ విజేత నిర్మాత శామ్యూల్ గోల్డ్‌విన్ కాగా, నటి ఫ్రాన్సిస్ హోవార్డ్. తల్లి తరపు వాళ్ళు సిడ్నీ హోవార్డ్ గాన్ విత్ ది విండ్ వంటి 70 ఇతర సినిమాలకు స్క్రీన్ ప్లే రచయిత కాగా, క్లేర్ ఈమ్స్ నటి. గోల్డ్‌విన్, అతని మాజీ భార్య కొలీన్ క్యాంప్‌కు ఎమిలీ గోల్డ్‌విన్ అనే ఒక కుమార్తె ఉంది. ఈమె 2005లో వచ్చిన ఎలిజబెత్‌టౌన్‌లో స్టార్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా నటించింది.

సినిమారంగం

[మార్చు]

గోల్డ్‌విన్ డిస్కవరీ ఛానెల్‌లో స్క్రిప్ట్ కంటెంట్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్/కన్సల్టెంట్ గా పనిచేశాడు.[1] 2016 సెప్టెంబరులో డిస్కవరీ రా యుకెతో కలిసి గోల్డ్‌విన్ నిర్మించిన హార్లే & ది డేవిడ్‌సన్స్‌ అనే సిరీస్ ప్రసారం చేసింది. డిస్కవరీ మాస్టర్ క్రిమినల్ ఆంథాలజీ సిరీస్‌లో మొదటి దశలో మాన్‌హంట్: అన్‌బాంబర్‌ని నిర్మించాడు. 2017లో లయన్స్‌గేట్‌తో ఫస్ట్ లుక్ ఒప్పందంపై సంతకం చేశాడు.[2]

సినిమాలు

[మార్చు]

అన్ని సినిమాలకు నిర్మాతగా ఉన్నాడు

సినిమా

[మార్చు]
సంవత్సరం సినిమా క్రెడిట్
1985 పోలీస్ అకాడమీ 2: దెయిర్ ఫస్ట్ అసైన్‌మెంట్ కార్యనిర్వాహక నిర్మత
2007 ఐయామ్ నాట్ దేర్
హాట్ రాడ్
2008 బేబీ మామ్మ
2010 మాక్‌గ్రూబెర్
2012 ది గిల్టి ట్రిప్
2013 ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టి
2015 స్టేటెన్ ఐలాండ్ సమ్మర్
2016 మాస్టర్ మైండ్స్

కృతజ్ఞతలు

సంవత్సరం సినిమా పాత్ర
2001 ఎన్ అమెరికన్ రాప్సోడీ నిర్మాతలు, దర్శకులు కృతజ్ఞతలు తెలిపారు
2019 ఎబో సస్పీసియన్ ప్రత్యేక కృతజ్ఞతలు

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం శీర్షిక క్రెడిట్
2008 యుసిబి కామెడీ ఒరిజినల్స్
2006-13 డెక్స్టర్ కార్యనిర్వాహక నిర్మత
2014 గ్రేస్‌పాయింట్ కార్యనిర్వాహక నిర్మత
2016 హార్లే అండ్ ది డేవిడ్సన్స్ కార్యనిర్వాహక నిర్మత
2017-20 మ్యాన్ హంట్ కార్యనిర్వాహక నిర్మత
2021 డోప్సిక్ కార్యనిర్వాహక నిర్మత
2021 మాక్‌గ్రూబెర్ కార్యనిర్వాహక నిర్మత
2021-22 డెక్స్టర్: న్యూ బ్గడ్ కార్యనిర్వాహక నిర్మత

మూలాలు

[మార్చు]
  1. "Discovery Channel Enlists John Goldwyn As Exec Producer For Scripted Programming". Deadline. January 7, 2015. Retrieved 2023-06-06.
  2. Holloway, Daniel (2017-10-25). "John Goldwyn Signs First-Look Deal With Lionsgate". Variety. Retrieved 2023-06-06.

బయటి లింకులు

[మార్చు]