జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్
J.J.R. Macleod ca. 1928
జననం(1876-09-06)1876 సెప్టెంబరు 6
Clunie, Perthshire, స్కాట్లాండ్
మరణం1935 మార్చి 16(1935-03-16) (వయసు 58)
Aberdeen, స్కాట్లాండ్
పౌరసత్వంయునైటెడ్ కింగ్డమ్
జాతీయతScottish
రంగములువైద్యశాస్త్రం
వృత్తిసంస్థలుCase Western Reserve University
చదువుకున్న సంస్థలుUniversity of Aberdeen
ప్రసిద్ధిఇన్సులిన్
ముఖ్యమైన పురస్కారాలునోబెల్ బహుమతి (1923)

జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియోడ్ (ఆంగ్లం: John James Rickard Macleod) FRS[1] (1876 సెప్టెంబరు 6 – 1935 మార్చి 16) స్కాట్లాండ్కు చెందిన వైద్యుడు. మధుమేహంలో కీలకపాత్ర పోషించే ఇన్సులిన్ కనుగొన్నందుకు గాను నోబెల్ బహుమతిని ఫ్రెడరిక్ బాంటింగ్‌తో పంచుకున్నాడు.[2][3]

జీవితసంగ్రహం

[మార్చు]
మెక్లియాడ్ దంపతుల సమాధి.

మెక్లియాడ్ స్కాట్లాండ్ లో రాబర్ట్ మెక్లియాడ్ దంపతులకు జన్మించాడు. ఇతడు 1898 లో ఎబర్డీన్ విశ్వవిద్యాలయం నుండి వైద్యశాస్త్రంలో పట్టాపొందారు. తర్వాత లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో కొంతకాలం పనిచేశారు. 1899 లో ఫిజియాలజీలో బోధకునిగా లండన్ హాస్పిటల్ వైద్య పాఠశాలలో చేరి 1902 లో లెక్చరర్ గా పదవీ వున్నతి పొందారు. తర్వాత ఫిజియాలజీ శాఖ ప్రొఫెసర్ గా కేస్ వెస్టర్న్ రిజర్వ్ విశ్వవిద్యాలయంలో 1903లో చేరారు. టొరాంటో విశ్వవిద్యాలయంలో 1918 లో ప్రొఫెసర్ గా ఎన్నికకాబడ్డాడు. 1928 లో తిరిగి ఎబర్డీన్ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చి మరణానంతం వరకు అక్కడే పనిచేశారు.

మెక్లియాడ్ ప్రధానంగా కార్బోహైడ్రేట్ల జీవక్రియ మీద పనిచేశాడు. ఇతడు ఫ్రెడెరిక్ బాంటింగ్, చార్లెస్ బెస్ట్ తో కలిసి ఇన్సులిన్ ను కనుగొన్నారు. ఆ కాలంలో మధుమేహానికి ఇదొక్కటే వైద్యం. ఇందుకు గాను బాంటింగ్, మెక్లియాడ్లకు సంయుక్తంగా 1923లో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. ఆవిష్కారానికి సంబంధించినంతవరకు మెక్లియోడ్ పాత్ర పెద్దగా ఎమీ లేదని ఫెడరిక్ బాంటింగ్ చెప్పడంతో ఇది వివాదాస్పదమైంది. కొన్ని దశాబ్దాల తరువాత జరిగిన ఒక స్వతంత్ర సమీక్షతో అతడి పాత్ర మొదట భావించిన దాని కంటే చాలా ఎక్కువ ఉందని తేలింది.

మెక్లియాడ్ సుమారు 11 పుస్తకాలు రచించాడు:

  1. Recent Advances in Physiology (1905)
  2. Diabetes: its Pathological Physiology (1925)
  3. Carbohydrate Metabolism and Insulin (1926).

టొరంటో విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియం ఇతని జ్ఞాపకార్ధం నామకరణం చేయబడింది.

మూలాలు

[మార్చు]
  1. doi:10.1098/rsbm.1935.0023
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  2. doi:10.1080/08035250600930328
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand
  3. doi:10.4065/81.8.1006
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.