Jump to content

జాన్ స్టూవర్ట్ మిల్

వికీపీడియా నుండి

జాన్ స్టూవర్ట్ మిల్ బ్రిటన్‌కు చెందిన తత్వవేత్త. ఇతడు 1806, మే 20న జన్మించాడు. అనేక రాజనీతి సిద్ధాంతాలు రచించిన జె.ఎస్.మిల్ పార్లమెంటు సభ్యుడుగానూ వ్యవహరించాడు. ఉపయోగితా వాదం గురించి ప్రముఖంగా ఇతని పేరు చెప్పబడుతుంది. 1873, మే 8న మరణించాడు.[1][2]


జె.ఎస్.మిల్ యొక్క ముఖ్య ప్రవచనాలు

[మార్చు]

జె.ఎస్.మిల్ రచనలలో ఎక్కువుగా వ్యక్తి స్వేచ్ఛావాదం (ఇండివిడ్యువలిజమ్) కనిపిస్తుంది. ఇతని " ఆన్ లిబర్టీ" వ్యక్తి స్వేచ్చను వివరించుటలో, సమర్ధించటంలో ఈనాటికీ ఒక ప్రామాణిక గంధంగా కనపడుతుంది. స్వేచ్చ ప్రతి వ్యక్తి అవసరమని, వ్యక్తి నుంచి అది విడదీయరాదని, సామాజిక జీవనంలో భిన్నత్వాన్ని పెంపొందించటానికి, నైతిక, మానసిక, భౌతిక రంగాలలో స్వేచ్చ చాలా అవసరమని మిల్ ధృఢ విశ్వాసము. వ్యక్తి స్వేచ్చను సమర్దించటంలో మిల్, వోల్టర్, మిల్టన్, రూసో, ధామస్ మొదలైన సుప్రసిద్ధుల కోవకు చెందినవాడు. మిల్ అభిప్రాయంలో సమాజంలో జీవించే వ్యక్తుల అనేక అభిప్రాయాలు, ఆసక్తులు కలిగి ఉంటారు. విభిన్నమైన ఆసక్తులు, వాటి గుర్తింపు సమాజ వికాసానికి అవసరము. అంతే కాక సామాన్యంగా ఒక వ్యక్తి చర్యను అతని ఆలోచన నిర్దేశిస్తుంది. ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను యధేచ్చగా వ్యక్తం చేయటానికి, అతని చర్యలలో ఇతరుల జోక్యం లేకుండా ఉండడానికి తగిన పరిస్థితులను రాజ్యం కల్పించాలి. వ్యక్తి స్వేచ్చను సమాజ జోక్యం నుంచే కాక ప్రభుత్వ నియంత్రణ నుంచి సంరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మిల్ గ్రహించాడు. ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువుగా ఉంటే వ్యక్తికి అంత ఎక్కువ స్వేచ్చ లభిస్తుందని మిల్ భావిస్తాడు.[3][4]

వ్యక్తి స్వేచ్చను కేవలం రాజకీయాధికారంనుంచి పరిరక్షించటంతోనే మిల్ తృప్తి పడలేదు. సమాజ జోక్యం, సమాజ నియంత్రణ వ్యక్తి స్వేచ్చపై ఉండరాదని వాదిస్తాడు. సమాజ సంప్రదాయాలు, కట్టుబాట్లను ఉల్లంఘించే వ్యక్తులపై సమాజం విధించే శిక్షలు, నియంత్రణలు వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోటానికి ప్రతి బంధకాలుగా తయారయి చివరికి అవి తన వ్యతిరేకాభిప్రాయం, అసమ్మతి భావాలను, వొదులుకొని కేవలం యంత్రంలో ఒక భాగంగా మిగిలిపోయే ప్రమాదం సంభవిస్తుంది అంటాడు మిల్.

మిల్ అభిప్రాయంలో స్వేచ్చ సమగ్రమైనది. ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పెంపొందుంచు కోటానికి అభిప్రాయ ప్రకటనకు, ఆంతరంగిక వ్యవహారాలలో స్వేఛ్ఛ అవసరము. ప్రతి వ్యక్తి చర్యలను మిల్ రెండు రకాలుగా విభజిస్తాడు- వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన చర్యలు అతనికి మాత్రమే (Self Recording) సంబంధించినవి వీటిలో ఇతరుల జోక్యం అనవసరం. రెండవది ఇతరులకు సంబంధించిన చర్యలు (Other Recording), ఇది ప్రయోజనాలకు సంబంధించిన చర్యలు. ఒక వ్యక్తి యొక్క చర్య వలన ఇతరులకు హాని కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే సమాజం అతనిని నిరోధించవచ్చును. దొంగతనము, హత్య మొదలైనవి. ప్రతి వ్యక్తికి తన శరీరము, ఆలోచన, ఆత్మలపై సార్యభౌముడు. మిల్ సాంప్రదాయిక వ్యక్తి స్వేచ్చావాది.అతని కాలంలో ఉన్న రాజకీయ, సాంఘిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అతను తన అభిప్రాయాలను వ్యక్తం చేసాడు. అపరిమిత స్వేచ్చ అవాంచమైనప్పటికీ స్వేచ్చ కంటే స్వేచ్చపై విధించవలసిన ఆంక్షలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పుడు స్వేచ్చాభావం నశించిపోతుంది.

రచనలు:

[మార్చు]
  • System of Logic (1843)
  • Principles of Political Economy (1848)
  • On Liberty (1859)
  • Representative Government
  • Utilitarianism (1861)

మూలములు

[మార్చు]
  1. Thouverez, Emile. 1908. Stuart Mill (4th ed.) Paris: Bloud & Cie. p. 23.
  2. "John Stuart Mill's On Liberty". victorianweb. Retrieved 23 July 2009. On Liberty is a rational justification of the freedom of the individual in opposition to the claims of the state to impose unlimited control and is thus a defense of the rights of the individual against the state.
  3. 1980 భారతి మాసపత్రిక. వ్యాసము:జాన్ స్టూవర్ట్ మిల్ ప్రజాస్వామ్య వాదము. వ్యాసకర్త: శ్రీ వి.కృష్ణారావు.
  4. Halevy, Elie (1966). The Growth of Philosophic Radicalism. Beacon Press. pp. 282–284. ISBN 978-0191010200.