జామతోటల్లో ఈగ పురుగు నిర్మూలన
జామతోటల్లో ఫెరోమోన్ ఎరలతో పండు ఈగ పురుగు నిర్మూలన
[మార్చు]ఐపీఎమ్ ప్రయోగ విధానంతో...రైతులను భాగస్వామ్యులను చేయడంద్వారా జామతోటల్లో ఫెరోమోన్ ఎరలను ఉపయోగించడాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. [1]
ఇథనాల్, మిథైల్ యూజెనాల్, మలాథియాన్ లను 6:4:1 నిష్పత్తిలో కలపడంద్వారా ఫెరోమోన్ ద్రావకాన్ని తయారుచేస్తారు. 2”x2” పరిమాణంలో, నీటిని పీల్చుకునే ప్లైవుడ్ చెక్కముక్కలను తీసుకుని పై ద్రావకంలో ముంచి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో(1వ బొమ్మ) అమర్చారు. ఆ డబ్బాకు పైభాగాన ఎదురెదురుగా 1.5సెం.మీ. వ్యాసంతో నాలుగు రంధ్రాలు చేసి తోటలో ఎకరానికి ఒకటి చొప్పున పెట్టారు.
మొదటి పంట సమయంలో 50-60శాతం ఉండే పండు ఈగ ఇప్పుడు పదిశాతానికి తగ్గింది. ఈ పురుగుకోసం రైతులు గతంలో వినియోగించే పురుగుమందుల పరిమాణం కూడా 80-90శాతం తగ్గింది.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వారి కృషి వలన అబోహర్ ప్రాంతంలోని సుమారు 1500 హెక్టార్లలో ఈ శాస్త్రీయ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. జామ తోటల్లో పండుఈగ నియంత్రణకు ఈ విధానం ఒక మంచి పరిష్కారంగా రుజువయింది.