జావాస్క్రిప్టు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జావాస్క్రిప్టు (JS) అనేది ఒక గతిక కంప్యూటరు కార్యలేఖన భాష (object oriented programming language). జాల విహారిణులలో భాగంగా, సంకర్షక స్పందన (interactive effect) చూపించడానికి దీనిని చాలా విస్తృతంగా వినియోగిస్తారు. అనగా, దీనిని అమలు చెయ్యడం వలన క్లయింటు తరుపు స్క్రిప్టులను వాడుకరితో సంభాషించుటకు, విహారిణిని నియంత్రించుటకు మరియు పత్ర విషయాలను మార్చడానికి అనుమతిస్తుంది. దీనిని సేవకము వైపు కార్యలేఖనంలో, ఆటల వికాసంలో మరియు డెస్కుటాపు మరియు మొబైల్ అనువర్తనాలను సృష్టించుటలో కూడా వినియోగించవచ్చు. ఇది లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగు సిస్టంలో పని చేస్తుంది. ఇది బహుళ ఆపరేటింగు సిస్టంలో పని చేస్తుంది.