జిజిఫస్ నుమ్ములేరియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జిజిఫస్ నుమ్ములేరియా
Scientific classification Edit this classification
Kingdom: Plantae
Clade: Tracheophytes
Clade: పుష్పించే మొక్కలు
Clade: Eudicots
Clade: Rosids
Order: Rosales
Family: Rhamnaceae
Genus: Ziziphus
Species:
Z. nummularia
Binomial name
Ziziphus nummularia
Synonyms[1]

Ziziphus rotundifolia

జిజిఫస్ నమ్ములారియా అనేది పశ్చిమ భారతదేశంలోని థార్ ఎడారికి, ఆగ్నేయ పాకిస్తాన్, దక్షిణ ఇరాన్‌కు చెందిన జిజిఫస్ జాతిరకం ముళ్లమొక్క జిజిఫస్ నమ్ములారియా అనేది 3 మీటర్లు (9.8 అడుగులు) లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉండే పొద, ఒక కొమ్మను కలిగివుంటుంది. ఆకులు జిజిఫస్ జుజుబా మాదిరిగా మన ప్రాంతపు పరిక చెట్లు రేగు చెట్టు ఆకుల్లా గుండ్రంగా ఉంటాయి, మొక్క సాధారణంగా మెట్ట పొలాల్లో కనిపిస్తుంది. ఈ జాతి పెర్షియన్ గల్ఫ్ ప్రాంతాలలోనూ, ముఖ్యంగా ఖతార్కు చెందినది, ఇక్కడ ఇది సహజ మాంద్యాలలో పెరుగుతుంటుంది.

ఉపయోగాలు

[మార్చు]
  • ఆహారంగా
  • పశువుల మేతగా
  • వంటచెరకుగా ఇంధనంగా
  • వైద్యానికి
  • అంతరపంటగా
  • నేలకోరివేత నివారణిగా
  • కంపమొక్కగా
  • పునరుద్ధారకంగా

చెట్ల నిర్వహణ

[మార్చు]

ఇది కేవలం వర్షం ద్వారా వచ్చే తక్కువ నీటితో బ్రతకగలుగుతుంది. మరే ఇతర నీటి ఏర్పాట్లు లేకపోయినప్పటికీ తట్టుకుంటుంది. బాగా గుబురు పొదలా పెరిగి అనేక కొమ్మలు రెమ్మలను ఉత్పత్తి చేస్తుంది.

విత్తన నిర్వహణ

[మార్చు]

విత్తన నిల్వ పద్దతులు సాంప్రదాయకమైనవి ఒక్క కిలో బరువుకి 1800 నుంచి 2000 విత్తనాలు తూగుతాయి.

పురుగు మందులు, వ్యాధులు

[మార్చు]

కొన్ని రకాల గొంగళి పురుగులు ఈ ముళ్ల కంప చెట్టు ఆకులను ఇష్టంగా తిని దాని కొమ్మలలో దారపు గూడు కట్టుకుని సుప్తావస్తలోకి వెళతాయి. వీటినుంచి తర్వాత సీతాకోక చిలుకలు వెలువడతాయి.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ziziphus nummularia". Germplasm Resources Information Network (GRIN). Agricultural Research Service (ARS), United States Department of Agriculture (USDA). Retrieved 16 January 2018.

బయటి లంకెలు

[మార్చు]
  • "Ziziphus nummularia". Germplasm Resources Information Network (GRIN). Agricultural Research Service (ARS), United States Department of Agriculture (USDA). Retrieved 16 January 2018.
  • avasthi, kapil; kuldeep (2013-05-13). "synthesis of nanoparticle from zazipus nummularia". synthesis of nanoparticles from ziziphus nummularia. 2010-2012 (jib): 50.