Jump to content

జిట్టా బాలకృష్ణ రెడ్డి

వికీపీడియా నుండి
జిట్టా బాలకృష్ణ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 14 డిసెంబర్ 1972
బొమ్మాయిపల్లి గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 2024 సెప్టెంబరు 6(2024-09-06) (వయసు 51)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు యువ తెలంగాణ పార్టీ
భారతీయ జనతా పార్టీ
కాంగ్రెస్
తల్లిదండ్రులు జిట్టా బాలరెడ్డి, రాధమ్మ
జీవిత భాగస్వామి సునీత
సంతానం వివేకానందా రెడ్డి, జిట్టా ఝాన్సీ

జిట్టా బాలకృష్ణ రెడ్డి (1972 డిసెంబరు 14 - 2024 సెప్టెంబరు 6) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని 2009లో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) వీడి ఇపుడు తిరిగి 2023 అక్టోబర్ 20న బీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

జిట్టా బాలకృష్ణ రెడ్డి 14 డిసెంబర్ 1972న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1987లో బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 1993లో LB నగర్ నుండి డివీఎం డిగ్రీ & పీజీ కళాశాల నుండి డిగ్రీ (బి.కామ్)తో గ్రాడ్యుయేషన్‌లో పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జిట్టా బాలకృష్ణ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పని చేసిన ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో బాగంగా టీడీపీకి ఆ స్థానం దక్కడంతో ఆయన ఆ పార్టీని విడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు. వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి వైఎస్ జగన్ లోక్‌సభలో తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో ఆ పార్టీని విడి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించాడు

మరణం

[మార్చు]

ఆయన 51 ఏళ్ల వయసులో హైదరాబాదులో 2024 సెప్టెంబర్ 6న మరణించాడు.[2] మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నెలరోజులుగా సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (20 October 2023). "బీఆర్ఎస్లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  2. "Jitta Balakrishna Reddy: భారాస నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత | brs-leader-jitta-balakrishna-reddy-passed-away". web.archive.org. 2024-09-06. Archived from the original on 2024-09-06. Retrieved 2024-09-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Andhrajyothy (6 September 2024). "బీఆర్ఎస్‌లో విషాదం.. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా కన్నుమూత". Archived from the original on 6 September 2024. Retrieved 6 September 2024.