జిమ్మీ బఫెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జిమ్మీ బఫెట్
జననంజిమ్మీ బఫెట్
1946 డిసెంబర్ 25
న్యూ యార్క్ అమెరికా
మరణం2023 సెప్టెంబర్1
న్యూ యార్క్ అమెరికా
విద్యన్యూ యార్క్ విశ్వవిద్యాలయం
వృత్తిసంగీత దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు1964 నుంచి 2023వరకు
భార్య / భర్తఆస్కా
పిల్లలు3

జిమ్మీ బఫెట్(డిసెంబర్ 25, 1946 - సెప్టెంబర్ 1, 2023) ఒక అమెరికన్ సంగీతకారుడు గాయకుడు-పాటల రచయిత. [1]

బాల్యం

[మార్చు]

జిమ్మీ బఫ్ఫెట్ డిసెంబర్ 25, 1946న పాస్కాగౌలా, మిస్సిస్సిప్పిలో [2] జన్మించాడు . జిమ్మీ బఫెట్ తల్లితండ్రులు 2003లో ఒకే సంవత్సరం వ్యవధిలో మరణించారు. జిమ్మీ బఫెట్ కు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు, లారీ (జననం 1948) లూసీ (జననం 1953). [3] [4]

జిమ్మీ బఫెట్ తాత న్యూజిలాండ్ దేశానికి చెందినవాడు. జిమ్మీ బఫెట్ తండ్రి ఇంజనీర్గా పనిచేస్తూ ఉండేవాడు.

1961లో, మిస్సిస్సిప్పిలోని బిలోక్సీలో ఒక జానపద సంగీత బృందం ప్రదర్శనను చూసిన జిమ్మీ బఫెట్ తను కూడా సంగీత కళాకారుడు కావాలని నిశ్చయించుకున్నాడు. జిమ్మీ బఫెట్ గిటార్ ద్వారా సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు.

జిమ్మీ బఫెట్ స్కూల్లో కూడా గిటార్ వాయించేవాడు.

సంగీత జీవితం

[మార్చు]

1969లో జిమ్మీ బఫెట్ సంగీత శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు. జిమ్మీ బఫెట్ కు అదృష్టం కలిసి రాక శిక్షణా నిర్వాహకులు సంగీత శిక్షణ ఇవ్వలేదు. దీంతో జిమ్మీ బఫెట్ నిరాశకు లోనయ్యాడు.కానీ అతనికి పత్రికలో సంపాదకునిగా ఉద్యోగం వచ్చింది.

కానీ జిమ్మీ బఫెట్ కు ఉద్యోగం చేయడం నచ్చలేదు. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తానే సొంతంగా సంగీతం నేర్చుకోవాలి అనుకున్నాడు. జిమ్మీ బఫెట్ కు తల్లితండ్రులు సంగీతంలో తమ సహాయాన్ని అందించేవారు. ఉపాధ్యాయులు కూడా జిమ్మీ బఫెట్ కు సంగీత పరికరాలు కొనిచ్చేవారు.

1971 చివరలో, జమ్మి బఫెట్ ప్రతిభను ఒక అమెరికా సినీ దర్శకుడు గుర్తించాడు. తన సినిమాలో జిమ్మీ బఫెట్ కు సంగీత దర్శకుడిగా అవకాశం కల్పించాడు. అలా జిమ్మీ బఫెట్ సినీ సంగీత ప్రస్థానం మొదలైంది. దాదాపు జిమ్మీ బఫెట్ 150 అమెరికన్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

జనవరి 2008లో జిమ్మీ బఫ్ఫెట్ సంగీత ప్రదర్శన

మరణం

[మార్చు]

జిమ్మీ బఫెట్ 2023 సెప్టెంబర్1న మరణించాడు. ఇతని మరణానికి పలువురు సంగీత ప్రముఖులు సంతాపం తెలిపారు.

మూలాలు

[మార్చు]
  1. Dowd, Maureen (September 9, 2023). "Living and Dying in ¾ Time". The New York Times. Archived from the original on September 9, 2023. Retrieved September 9, 2023.
  2. Otis, Brittany (September 12, 2015). "Jimmy Buffett's hometown of Pascagoula, Miss., is naming a bridge for him". Associated Press.
  3. Friskics-Warren, Bill (September 2, 2023). "Jimmy Buffett, Roguish Bard of Island Escapism, Is Dead at 76". The New York Times. ISSN 0362-4331. Archived from the original on September 2, 2023. Retrieved September 2, 2023.
  4. Entrekin, Allison (March 25, 2019). "Why Love Lucy: A look into the life of Lucy Buffett". Atlanta. Retrieved 2023-09-02.