Jump to content

జి ఎం డైట్

వికీపీడియా నుండి


వారంరోజుల పాటు మీరు తీసుకునే ఆహారం శరీరానికి ఏమాత్రం అదనపు కాలరీలను ఇవ్వకుండా మీ వంట్లో ఉన్న అదనపు నిల్వలను (కొవ్వు, ప్రొటీన్లను) కరిగించడానికి ఉద్దేశించిన డైట్‌ చార్టు ఇది .ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని "జాన్‌హప్‌కిన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌" రూపొందించింది. ప్రయోగాత్మకంగా నిరూపణ చేసిన పద్ధతి. ఇది అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డిఎ) ఆమోదం పొందింది. ఇది జనరల్ మొటార్స్ వారిచే సమర్పించబడినది . ఇది ఎడురోజుల ఆహార ప్రణాళిక. వారంరోజుల పాటు మీరు తీసుకునే ఆహారం శరీరానికి ఏమాత్రం అదనపు కాలరీలను ఇవ్వకుండా మీ వంట్లో ఉన్న అదనపు నిల్వలను (కొవ్వు, ప్రొటీన్లను) కరిగించడానికి ఉద్దేశించిన డైట్‌ చార్టు ఇది.

నేపద్యం

[మార్చు]

జనరల్ మొటార్స్ General Motors అను సంస్థ తన ఉద్యోగులలో ఉన్న అధిక బరువు తగ్గించి స్థూలకాయం నిర్మూలించడానికి ఏడు రోజుల ఆహార నియమాలను 1985వ సంవత్సరంలో రూపొందించి విజయం సాధించింది. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఈ ఆహార నియమాలను పాటించి స్థూలకాయాన్ని నియంత్రించుకున్నారు.[1]

సాధారణ నియమాలు

[మార్చు]

ఈ వారం రోజులు 20 నిమిషాలపాటు ఒక మోస్తరు వ్యాయామం అంటే నడక, సైక్లింగ్‌, ఎరోబిక్స్‌, స్విమ్మింగ్‌లాంటి వాటిలో ఏదో ఒకటి చెయ్యాలి. రోజూ 10 గ్లాసులకు తక్కువ కాకుండా నీళ్ళు తాగాలి. డయాబిటిస్‌ ఉన్నవాళ్ళు డాక్టరు సలహా తీసుకున్న తర్వాతే దీన్ని పాటించాలి. లేదంటే ప్రమాదం. ఈ ఏడు రోజులు మీరు మద్యపానానికి దూరముగా ఉండాలి.

ఇతర సూచనలు: కూరగాయలు సలాడ్ ల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఐతే సలాడ్ తయారు చెయునప్పుడు అందులో ఒక టీ స్పూను కంటే ఎక్కువ నూనెను వాడరాదు. వండర్ సూప్ లో మీకు క్యాబేజీ ఇష్టం లేకపోతె, మరే ఇతర కూరగాయలను వాడుకోవచ్చును.

మొదటిరోజు

[మార్చు]

అరటిపండు తప్ప అన్నిరకాల తాజా పళ్ళు: ఈ రోజు మీ ఆహారం. మీకు నచ్చిన అన్నిరకాల పండ్లను తినొచ్చు. అరటి పండు మాత్రం లేదు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కిరిణికాయలు (కడప దోసకాయలు) ఎక్కువ తింటే మంచిది. పరిమితి ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు. పళ్ళను ఆహారంగా తీసుకోవటం వల్ల రా బోయే ఆరు రోజులకు మీ శరీరాన్ని, జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారన్న మాట. మొదటి రోజు పుచ్చ, కర్బూజ వంటి (Melons) పండ్లు మాత్రమే తిన్నట్లయితే మీ బరువు బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది.

రెండవరోజు

[మార్చు]

అన్నిరకాల కూరగాయలు : ఈ రోజు మీ ఆహారం కేవలం కూరగాయలు మాత్రమే తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక పెద్ద బంగాళ దుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజును ప్రారంభించండి. తరువాత బంగాళా దుంప తినొద్దు. మిగతా కూరగాయలు పచ్చివి కాని, ఉడికించినవి కాని తినొచ్చు. ఉప్పు, కారం మీ ఇష్టం. నూనె మాత్రం వాడొద్దు. ఈ రోజు కూడా పరిమితి అంటూ ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు.ఆలుగడ్డలు తినడం వల్ల మీ శరీరానికి కార్బోహైడ్రేడ్లు అందుతాయి

మూడవరోజు

[మార్చు]

పళ్ళు, కూరగాయలు : పళ్లలో అరటి పండు, కూరగాయల్లో బంగాళా దుంప తప్ప మిగిలిన పళ్ళు, కూరగాయలు కలిపి తీసుకోండి. ఈ రోజు కూడా పరిమితి ఏమీ లేదు. అవసరం మేరకు తినొచ్చు. ఈ రోజు నుండి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగటం ప్రారంభిస్తాయి.

నాల్గవ రోజు

[మార్చు]

8 అరటిపళ్లు, మూడు గ్లాసుల పాలు : నాల్గవరోజు దాదాపు ఆకలి ఉండదు. రోజంతా హాయిగా గడచి పోవడం గమనిస్తారు. 8 అరటి పళ్ళు తినాల్సిన అవసరం రాక పోవచ్చు. తగ్గించగలిగితే తగ్గించండి. (ఒక గ్లాసు 200 మి.లీ.) పాలల్లో చక్కెర ఎక్కువ ఉండ కూడదు. ఇంకా అవసరం అనిపిస్తే 100 మి.లీ. వెజిటబుల్‌ సూప్‌ తాగవచ్చు. ఈ సూపును  ఒక లీటరు నీటిలో ఆరు ఉల్లిగడ్డలు, రెండు మిరియపు గింజలు, టమాటోలు, క్యాబేజీ వేసుకుని ఉడికించిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

ఐదవ రోజు

[మార్చు]

ఒక కప్పు అన్నం, 6 టమోటాలు : మీకిది విందు రోజు. మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దాని లోకి కూరగాయలు లేదా ఆకు కూరతో నూనె లేకుండా వండిన కూరతో తినండి. ఉదయం టిఫిన్‌గా రెండు టమోటాలు తీసుకోండి. మిగిలినవి అవసరం అయినప్పుడు తినండి. కప్పు అన్నం తినొచ్చు కదా ఏమవుతుందని ఇంకాస్త లాగించే పని చేయ వద్దు. వీలయితే కప్పు కన్నా కాస్త తక్కువే తినండి.ఈరోజు ఆహారం శరీరానికి కావలసిన మాంసక్రుత్తులు (proteins) అందించడానికి ఉద్దేశించబడింది

ఆరవ రోజు

[మార్చు]

ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం : రెండవ రోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు (బగాళ దుంప మినహా) తీసుకోండి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే. కూరగాయలకు లిమిట్‌ లేదు. అయినప్పటికి ఆకలి లేకపోవడం వల్ల రెండవ రోజు తిన్నంత అవసరం లేదు.

ఏడవ రోజు

[మార్చు]

ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం: ఆరవరోజులాగే తింటూ, అదనంగా కూరగాయలను కాస్త తగ్గించి, పళ్ళ రసం (చక్కెర లేకుండా) తీసుకోండి. మధ్యాహ్నం యథా విధిగా ఒక కప్పు లేదా అంత కంటే తక్కువ అన్నం తినండి. ఇక రేపటి కోసం ఎదురు చూడండి.

ఫలితాలు

[మార్చు]

ఈ పద్ధతి కచ్చితంగా పాటిస్తే, శరీరం అవసరం మేరకు తింటే, 4 నుండి 5 కేజీల బరువు తగ్గుతారు. వారం రోజుల పాటు ఈ పద్ధతిని పాటించడం వల్ల ఆ తరువాత కూడా మీకు పెద్దగా ఆకలి ఉండదు. అంటే ఆకలి స్థాయి తగ్గుతుంది. కాబట్టి ఇక నుండి మీ ఆహారపు అలవాట్లను పక్కాగా మార్చుకుని పరిమితంగా తింటూ వుంటే మీ బరువు అదుపులో ఉంటుంది. బరువు పెరగడం అనేది మనిషి తినే ప్రవర్తనకు సంబంధించిన సమస్య. తిండి విషయంలో మీ ప్రవర్తన మార్చుకోకుండా బరువు తగ్గాలనుకోవడం జరగని పని. సలహాల కోసం మీ కుటుంబ డాక్టరును లేదా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించండి.

జిఎం డైట్ పని చేసేవిధానం[2]

[మార్చు]
మొదటి రోజు
ఈ రోజు మీ శరీరం ఈ అహానియమాలకు సర్వ సన్నద్దం చేయబడుతుంది.ఈ రోజు మీ శరీరానికి కేవలం పండ్ల ద్వారా లభించే పోశక విలువలు అందుతాయి.
రెండవ రోజు
ఈ రోజు మీకు కావలసిన శక్తి కాంప్లెక్సు కార్బోహైడ్రేడ్ల చే అందుతుంది. మిగతా రెండు రోజులు కాలరీలు లేని పోశక విలువలు, ఫైబరు ఉన్న కూరగాయలు తీసుకుంటారు.
మూడవ రోజు
ఈ రోజు శరీరం లోని కొవ్వు కరగడం మోదలవుతుంది
నాలుగవ రోజు
గత మూడు రోజులుగా మీ శరీరం కోల్పోయిన పొటాషియం, సొడియాన్ని భర్తీ చేయుటకు ఈ రోజు పాలు, అరటి పండ్లు ఇవ్వబడతాయి. తీపి పదార్దాల పట్ల కోరిక సన్నగిల్లడం మీరే గమనిస్తారు. ఈ రోజు ఎంత ఆహ్లాదకరంగా గడుస్తుందో మీరే గమనిస్తారు.
ఐదవ రోజు
ఈరోజు మీకు కావలసిన మాంసక్రుత్తులు చికెన ద్వారా, ఫైబరు టొమాటోల ద్వారా అందుతాయి. (శాకహారులకు జున్నుద్వారా). అధిక మోతాదులో నీరు త్రాగడం వల్ల శరీరం లోని మలినాలన్ని మూత్రం ద్వారా బయటకు విసర్జించబడతాయి. వర్ణ రహితమైన తెల్లని మూత్రం వస్తుంది.
ఆరవ రోజు
ఈరోజు ఐదవ రోజు వలెనే ఉంటుంది. శరీరానికి కావలసిన ప్రొటీన్లు కోడి మంసం ద్వారా, విటమిన్లు కూరగాయల ద్వారా అందుతాయి. ఈ రోజు నుండి మీ శరీరం బరువు తగ్గడానికి అలవాటు పడుతుంది. మోదటి రోజు నుండి ఇప్పటికి మీ శరీరంలో తేడాను మీరు స్పష్టంగా గమనిస్తారు.
ఏడవ రోజు
మలినాలన్ని నిర్మూలించుకున్న శరీరం స్వచ్ఛంగా, తేలికగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది.

మూలములు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-08-02. Retrieved 2015-06-14.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-07-19. Retrieved 2015-06-14.