Jump to content

జీవని సంస్థ

వికీపీడియా నుండి
అనాధశ్రమం - ప్రతీకాత్మక చిత్రం


జీవని సంస్థ అనంతపురం నుండి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి మెరుగయిన విద్య అందించడమే ఈ సంస్థ లక్ష్యం.

స్థాపన

[మార్చు]

జూన్ 2009లో ఎస్వీ ప్రసాద్ అనే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి ద్వారా ఇది నెలకొల్పబడింది. అనంతపురంలోని శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు ప్రాథమికంగా ఈ సంస్థ ఏర్పాటులో చేయూతనిచ్చారు.

లక్ష్యం

[మార్చు]

అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారికి ఆశ్రయం కల్పించి నాణ్యమయిన విద్యను అందించడంతోపా టుగా ఇంటి వద్ద ఉండే కుటుంబం లాంటి పరిసరాలను అందించడమే ఈ సంస్థ లక్ష్యం.

ప్రస్తుత గణాంకాలు

[మార్చు]

ప్రస్తుతం జీవని సంస్థలో దాదాపుగా 50 మంది పిల్లలు ఉన్నారు. హాస్టల్ ప్రాంగణంలోనే 2013 మొదలు ప్రాథమిక విద్యాలయం కూడా ఉంది. ఇక్కడ ఇతర విద్యార్థులకూ, జీవని విద్యార్థులకు కలిపి పాఠాలు చెబుతారు.

వనరులు

[మార్చు]

సంస్థను నడిపేందుకు కావాల్సిన వనరులు చాలా వరకూ ఎసారైటీ యాజమాన్యం సమకూర్చుతుంది. ఇతర ఖర్చుల కోసం తెలుగు బ్లాగరులు, అంతర్జాలంలో జీవని జాలగూడు, బ్లాగు చూసిన వ్యక్తులు సహాయం చేస్తూ ఉంటారు.

హాస్టల్ ప్రాంగణం

[మార్చు]

అనంతపురం నుండి తాడిపత్రి వెళ్ళే మార్గంలో బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో హాస్టల్ ఉంది. ఇది 2012లో ప్రారంభమయింది. ఈ ప్రాంగణం లేక ముందు పిల్లలు ప్రయివేట్ హాస్టల్ లో ఉండేవారు. హాస్టళ్ళు, తరగతి గదులు, వంటగది, ఆట స్థలం, మొదలగునవి ఈ ప్రాంగణంలో ఉన్నాయి.

బయటి లంకెలు

[మార్చు]

జీవని జాలగూడు