Jump to content

జీ.శ్రీదేవి

వికీపీడియా నుండి
జీ.శ్రీదేవి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
15 మే 2019 - ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం (1960-10-10) 1960 అక్టోబరు 10 (వయసు 64)
విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు జి.విశ్వేశ్వర రావు , శాంతా
పూర్వ విద్యార్థి సంబల్‌పుర్ యూనివర్సిటీ

గండికోట శ్రీదేవి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమె తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా 2019 మే 15న ప్రమాణ స్వీకారం చేసింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

జీ.శ్రీదేవి 1960 అక్టోబరు 10లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విజయనగరంలో జి.విశ్వేశ్వర రావు, శాంతా దంపతులకు జన్మించింది. ఆమె సంబల్‌పుర్ యూనివర్సిటీ, రూర్కెలా లా కాలేజీలో 1986లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకుంది.[2]

వృత్తి జీవితం

[మార్చు]

జీ.శ్రీదేవి 986లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని ఒడిశా సబార్డినేట్ కోర్టుతో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేసింది. జీ.శ్రీదేవి ఆలిండియా జ్యుడీషియల్‌‌ సర్వీసెస్‌‌ ద్వారా ఉత్తరప్రదేశ్ కేడర్‌‌కి ఎంపికై వివిధహోదాల్లో పనిచేసి ఘజియాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా ఉండగా 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందాక, తెలంగాణకు బదిలీ చేయాలని కోరింది.

జీ.శ్రీదేవి అభ్యర్థనను సుప్రీంకోర్టు కొలీజియం అంగీకారం తెలపడంతో రాష్ట్రపతి ఆమోదంతో ఆమె తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ అయ్యింది. అదనపు న్యాయమూర్తిగా ఉన్న ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశాడు. ఆమె తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా 2019 మే 15న ప్రమాణ స్వీకారం చేసింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Telangana High Court (2019). "HONOURABLE JUSTICE G. SRI DEVI". Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.
  2. Eenadu (15 May 2019). "జస్టిస్‌ శ్రీదేవి ప్రమాణం". EENADU. Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.
  3. Sakshi (15 May 2019). "జస్టిస్‌ శ్రీదేవి ప్రమాణ స్వీకారం". Sakshi. Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.
  4. V6 Velugu (16 May 2019). "హైకోర్టు తొలి మహిళా జడ్జిగా శ్రీదేవి" (in ఇంగ్లీష్). Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)