జీ - 20 శిఖరాగ్ర సదస్సు - 2023
జీ - 20 ( గ్రూప్ ఆఫ్ 20) దేశాధినేతల 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సు - 2023 సెప్టెంబర్ 9-10 తేదీల్లో భారత రాజధాని న్యూఢిల్లీ ప్రగతి మైదానంలో గల భరత్ మండపంలో జరిగింది.[1] భారతదేశంలో ఈ సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి. వసుదైక కుటుంబం పేరుతో ' ఓకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు ' అనే ఇతివృత్తం ( థీమ్) తో 2023 ఏడాది జీ - 20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు.[2] భారత్ అధ్యక్షతన రెండు రోజులు పాటు జరిగిన ఈ జీ - 20 సభ్య దేశాల అధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు, దేశల అధినేతలు, అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.[3] భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ సదస్సు జరిగింది. జీ - 20 శిఖరాగ్ర సదస్సును భారత ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఇండియాకు బదులుగా ' భారత్ ' అనే నేమ్ బోర్డ్ ఉంచారు.[4] వసుదైక కుటుంబం స్ఫూర్తితో అభివృద్ధిని స్థిరీకరించడానికి, సమ్మేళిత వృద్ధి సాధించడానికి సాంకేతికతను వారధిగా వినియోగించుకుందామని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
జీ - 20 కూటమి నేపథ్యం
[మార్చు]. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సహకారం కోసం అంతర్జాతీయ వేదికగా జరిగే ముఖ్యమైన సదస్సుల్లో జీ - 20 ఒకటి. 1999 సంవత్సరంలో జీ - 20 దేశాల కోటని ఏర్పాటు చేశారు. 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి జీ - 20 కూటమిని ఏర్పాటు చేశాయి.
. ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య విధానం సహా కీలక అంశాలపై సభ్య దేశాల అధినేతలు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు చర్చలు జరుపుతారు.
. ఆఫ్రికన్ యూనియన్ ( ఏ యూ ) ను జీ - 20 కూటమి శాశ్వత సభ్యురాలుగా కొత్తగా చేర్చుకుంది. ఆఫ్రికన్ యూనియన్ చేరికతో 21 సభ్యులయ్యారు.
మూలాలు
[మార్చు]- ↑ "G20 Summit 2023: ఒకే వసుధ ఒకే కుటుంబం ఒక సదస్సు". Sakshi. 2023-09-05. Retrieved 2023-10-27.
- ↑ Chitturi, Sharath. "G20 summit in India : జీ20 సదస్సు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..!". Hindustantimes Telugu. Retrieved 2023-10-27.
- ↑ "G20 Summit 2023 Delhi : 'భారత మండపం'లో జీ20 సదస్సు.. దిల్లీకి అగ్రదేశాల నేతలు.. పోలీసులు ఫుల్ అలర్ట్". ETV Bharat News. Archived from the original on 2023-10-27. Retrieved 2023-10-27.
- ↑ "G20 Summit 2023: నేడు జీ20 సమ్మిట్.. ఈ మీటింగ్ నేపధ్యమేంటి, ఏయే దేశాలున్నాయి? ఏఏ అంశాలు చర్చిస్తారు?". News18 తెలుగు. 2023-03-28. Retrieved 2023-10-27.