Coordinates: 16°06′24″N 80°51′05″E / 16.106785°N 80.851469°E / 16.106785; 80.851469

జువ్వలపాలెం (కొల్లూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జువ్వలపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
జువ్వలపాలెం is located in Andhra Pradesh
జువ్వలపాలెం
జువ్వలపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°06′24″N 80°51′05″E / 16.106785°N 80.851469°E / 16.106785; 80.851469
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కొల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి యార్లగడ్డ శారద
పిన్ కోడ్ 522301
ఎస్.టి.డి కోడ్

జువ్వలపాలెం బాపట్ల జిల్లా కొల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

  • కొల్లూరు మండల పరిధిలోని జువ్వలపాలెం గ్రామ జనాభా=2,391. ఓటర్లు=1758. ఈ గ్రామం ప్రగతిపథంలో పయనిస్తున్నది. ఇసుకరీచ్ ద్వారా పంచాయతీకి ఏటా రు. 40 లక్షల ఆదాయం వస్తున్నది. ఈ నిధులతో గ్రామం అభివృద్ధి బాట పట్టింది. దళితవాడలో సిమెంటు రహదారులు, మురుగు కాలువలు నిర్మించారు. ఏడు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్లు కొనుగోలుచేసి, లోవోల్టేజ్ సమస్య పరిష్కరించారు. మంచినీటి పథకానికి విద్యుత్తు సమస్య పరిష్కరించారు. ప్రతి ఇంటికీ కుళాయి అందించాలని పైపులైన్లు విస్తరింపజేశారు. పైపులైనుకోసం దరఖాస్తు చేసుకున్నవారికి కనెక్షను మంజూరు చేస్తున్నారు. త్వరలో వచ్చే నిధులతో, మిగిలిన రహదారులు, సమస్యలు పరిష్కరించెదరట.[2]
  • యార్లగడ్డ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో యార్లగడ్డ శారద, సర్పంచిగా ఎన్నికైనారు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
  2. ఈనాడు గుంటూరు రూరల్,జులై-15,2013.8వ పేజీ.