జూనియర్ బాలయ్య
జూనియర్ బాలయ్య | |
---|---|
జననం | రఘు బాలయ్య[1] 1953 జూన్ 28 [2] మద్రాస్, మద్రాస్ రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుత చెన్నై) |
మరణం | 2023 నవంబరు 2[3] | (వయసు 70)
వృత్తి | నటుడు, నాటక కళాకారుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1975–2023 |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | నివేదిత రోహిత్ |
తల్లిదండ్రులు | టి.ఎస్.బాలయ్య |
కుటుంబం | మనోచిత్ర (సోదరి) |
రఘు బాలయ్య (1953 జూన్ 28 - 2023 నవంబరు 2) తమిళ సినిమారంగానికి భారతీయ నటుడు. జూనియర్ బాలయ్యగా ప్రసిద్ధి చెందిన ఆయన సీనియర్ నటుడు టి.ఎస్.బాలయ్య కుమారుడు.[4]
బాల్యం
[మార్చు]చెన్నైలో 1953 జూన్ 28న రఘు బాలయ్య జన్మించాడు. ఆయన నటుడు టి. ఎస్. బాలయ్య మూడవ కుమారుడు.
కెరీర్
[మార్చు]1975లో వచ్చిన మేల్‌నాట్టు మరుమగల్ సినిమాతో తమిళతెరకు రఘు బాలయ్య పరిచయమైయ్యాడు, జూనియర్ బాలయ్యగా ప్రసిద్ధిచెందాడు. ఆయన గోపుర వాసలిలే, కరగాట్టకారన్, చిన్నతాయి, సంగమం, విన్నర్, నెర్కొండపార్వై వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.
చిత్తి, చిన్న పాపా పెరియ పాపా వంటి పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించిన ఆయన 2011లో విడుదలైన ఎన్నాంగ సర్ ఉంగ చట్టం చిత్రంలో చివరిసారి కనిపించాడు.
జీ5 ఒరిజినల్ కోసం నిర్మించబడిన భారతీయ తమిళ భాష క్రైమ్ థ్రిల్లర్ మినిసిరీస్ ముగిలన్ (2020)లో కూడా ఆయన నటించాడు.[5]
మరణం
[మార్చు]ఆయన తన 70వ ఏట 2023 నవంబరు 2న శ్వాస సంబంధిత సమస్యల కారణంగా మరణించాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Celebs and Valentine's Day - 1 - ChennaiLiveNews.com". Archived from the original on 25 January 2018. Retrieved 11 July 2022.
- ↑ "Junior Balaiya". Nadigar Sangam. Retrieved 2 July 2023.
- ↑ "Junior Balaiah Death News: Actor Junior Balaiah passes away". The Times of India. 2 Nov 2023. Retrieved 2 Nov 2023.
- ↑ Guy, Randor (16 August 2014). "Darling of the masses". The Hindu.
- ↑ "Mugilan review: Karthik Raj and Ramya Pandian's gangster-drama explores the gritty journey of an underworld kingpin". zee5.com.
- ↑ "Junior Balaiah: జూనియర్ బాలయ్య ఇకలేరు | Tamil Actor Junior Balaiah Dies At His Chennai Home KBK". web.archive.org. 2023-11-05. Archived from the original on 2023-11-05. Retrieved 2023-11-05.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)