జూన్ 2009
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
జూన్ 22: మావోయిస్టు పార్టీ పై కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిషేధం విధించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ జిల్లా లాల్ ఘడ్ ప్రాంతాన్ని మావోయిస్టు పార్టీ నాయకత్వంలో స్థానిక గిరిజన ప్రజలు పోలీసుల వేధింపుల వ్యతిరేక కమిటీగా ఏర్పడి తమ అధీనంలోనికి గత 8 నెలలుగా ఆక్రమించుకుని పోరాడుతున్న క్రమంలో గత వారం ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో దానిని సాకుగా తీసుకొని ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు రాజకీయంగా ఎదుర్కొన లేక నిషేధం విధించింది. దీనిని ప్రముఖ బెంగాలీ రచయిత్రి, మేగ్ సేసె అవార్డ్ గ్రహీత మహాశ్వేతా దేవి వ్యతిరేకించారు. లాల్ ఘడ్ ప్రాంతం పై అమలు జరుతున్న నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిచారు. మావోయిస్టు పార్టీ నిర్మాణం రహస్య పార్టీ నిర్మాణం. నిషేధం ఉన్నా లేకపోయినా దాని పని పద్ధతుల్లో మార్పు వుండదు. కాని నిషేధం పేరుతో పోలీసు జులుం ఎక్కువై ప్రజల పై తీవ్ర నిర్బంధం అమలు జరుగుతుంది. అందుచేత ప్రజాస్వామిక వాదులు దీనిని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(ఆంధ్ర జ్యోతి దినపత్రిక తేదీ 23-06-09 వార్త ఆధారంగా)