Jump to content

జెండర్ డిస్ఫోరియా

వికీపీడియా నుండి
జెండర్ డిస్ఫోరియా
ఇతర పేర్లులింగ డిస్ఫోరియా[1]
ప్రత్యేకతమనోరోగచికిత్స, మానసిక శాస్త్రం Edit this on Wikidata
లక్షణాలుపుట్టినపుడు గుర్తించిన లింగం వలన అనుభవించే వేదన [2][3][4]
సంక్లిష్టతలుఆహారపు డిసార్డర్లు, ఆత్మహత్య, డిప్రెషన్, ఏంగ్జైటీ, సామాజిక ఐసొలేషన్[5]
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిఎటువంటి వేదనా లేకుండా జెండర్ ఐడెంటిటీలో లేదా వ్యక్తీకరణలో వైవిధ్యత[2][4]
చికిత్సజెండర్ ట్రాన్సిషన్, సైకోథెరపీ[3][4]
ఔషధంహార్మోన్లు (e.g.,[[:en:Testosterone|టెస్టోస్టెరాన్]] వంటి ఆండ్రోజన్లు, యాంటీ-ఆండ్రోజన్లు, ఎస్ట్రోజన్లు)

ఒక వ్యక్తి జెండర్ ఐడెంటిటీ, తను పుట్టినపుడు గుర్తించిన లింగంతో సరిపోలక పోవడం వలన అనుభవించే వేదనని వైద్యపరిభాషలో జెండర్ డిస్ఫోరియా లేదా లింగ డిస్ఫోరియా అని అంటారు.[1] సాధారణంగా ట్రాన్స్ జెండర్ వ్యక్తులు జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతుంటారు.[6]

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే పుట్టినపుడు గుర్తించిన లింగానికి అనుగుణంగా వ్యవహరించకపోవడం జెండర్ డిస్ఫోరియా కాదు.[7] అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ చెప్పే దాని ప్రకారం ఒక వ్యక్తి వైద్యపరంగా ముఖ్యమైన వేదనని దీనివలన అనుభవించినపుడు మాత్రమే అది జెండర్ డిస్ఫోరియాగా పరిగణించబడుతుంది.[2]

కవలలపై జరిపిన అధ్యయనాల ప్రకారం తెలియవస్తున్నది ఏమంటే జెండర్ డిస్ఫోరియాకి పుట్టిపెరిగిన వాతావరణంతో పాటు జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి.[8][9]

ఈ రుగ్మత ఉన్న వ్యక్తులకు చికిత్సగా వాళ్ళ మనసు చెప్పే జెండర్ ని అవలంభించేందుకు కావాల్సిన ఆసరాని కల్పించడం లాంటివి చెయ్యవచ్చు. హార్మోన్ థెరపీ, కొన్ని సర్జరీలను ఈ చికిత్సలో భాగంగా ఉపయోగించవచ్చు. [3][4] ఇవే కాకుండా కౌన్సిలింగ్, సైకోథెరపీ కూడా ఈ చికిత్సలో భాగంగా ఉండవచ్చు.[4]

గుర్తులూ లక్షణాలూ

[మార్చు]

పుట్టినపుడు మగ శిశువుగా గుర్తించిన వారికి వచ్చే జెండర్ డిస్ఫోరియాని సాధారణంగా రెండు వర్గాలుగా వర్గీకరించవచ్చు, ఒకటి చిన్నతనంలో వచ్చేది, రెండోది కౌమారంలో వచ్చేది. చిన్నతనంలో మొదలయ్యే జెండర్ డిస్ఫోరియా, సాధారణంగా ఆ పిల్లల నడవడికలో స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు సాధారణంగా మగవాళ్ళకి లైంగికంగా ఆకర్షితులు అవుతారు. అయితే కౌమార్యంలో మొదలయ్యే జెండర్ డిస్ఫోరియా గుర్తులు మాత్రం సాధారణంగా చిన్నతనంలో కనిపించవు కానీ ఇతర లింగానికి చెందిన వారిలా ఉండాలి అనే కోరికలు రహస్యంగా చిన్నతనంలో ఉన్నట్టు కొంతమంది అంటుంటారు. వీళ్ళు సాధారణంగా ఆడవాళ్ళకి లైంగికంగా ఆకర్షితులౌతారు. పుట్టినపుడు ఆడ శిశువుగా గుర్తించిన వారికి వచ్చే జెండర్ డిస్ఫోరియా మాత్రం సాధారణంగా చిన్నతనంలోనే మొదలౌతుంది. వీళ్ళు కూడా సాధారణంగా ఆడవారికి లైంగికంగా ఆకర్షితులౌతారు.[10][11]

ఇతర లింగానికి చెందిన పిల్లలు మామూలుగా ఆడుకునే బొమ్మలు, ఆటలు ఆడాలనుకోవడం, వారి స్వంత జననాంగాలపై విపరీతమైన ద్వేషం ఉండటం లాంటివి చిన్నపిల్లలలో జెండర్ డిస్ఫోరియా లక్షణాలు.[12] ఈ సమస్య ఉన్న కొంతమంది పిల్లలను ఇతర పిల్లలు దూరం పెట్టడం, ఒంటరితనం, డిప్రెషన్ లాంటివి మానసికంగా కృంగదీయవచ్చు.[5] అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం ట్రాన్స్ జెండర్ పిల్లలు వాళ్ళు చదువుకునే స్కూల్లు, ఇతర ప్రదేశాలలో విపరీతమైన వివక్ష, వేధింపులు, హింసని ఎదుర్కోవాల్సి వస్తోంది.[13]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "స్త్రీలింగ శస్త్రచికిత్స – మీరు తెలుసుకోవలసినది".
  2. 2.0 2.1 2.2 "Gender Dysphoria" (PDF). American Psychiatric Publishing. Retrieved December 24, 2016.
  3. 3.0 3.1 3.2 Maddux JE, Winstead BA (2015). Psychopathology: Foundations for a Contemporary Understanding. Routledge. pp. 464–465. ISBN 978-1317697992.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 Coleman E (2011). "Standards of Care for the Health of Transsexual, Transgender, and Gender-Nonconforming People, Version 7" (PDF). International Journal of Transgenderism. 13 (4). Routledge Taylor & Francis Group: 165–232. doi:10.1080/15532739.2011.700873. Archived from the original (PDF) on August 2, 2014. Retrieved August 30, 2014.
  5. 5.0 5.1 Davidson, Michelle R. (2012). A Nurse's Guide to Women's Mental Health. Springer Publishing Company. p. 114. ISBN 978-0-8261-7113-9.
  6. Bryant, Karl (2018). "Gender Dysphoria". Encyclopædia Britannica Online. Retrieved August 16, 2018.
  7. Ranna Parekh. "What Is Gender Dysphoria?". American Psychiatric Publishing. Archived from the original on 2020-01-14. Retrieved November 20, 2018.
  8. Heylens G, De Cuypere G, Zucker KJ, Schelfaut C, Elaut E, Vanden Bossche H, De Baere E, T'Sjoen G (March 2012). "Gender identity disorder in twins: a review of the case report literature". The Journal of Sexual Medicine. 9 (3): 751–7. doi:10.1111/j.1743-6109.2011.02567.x. PMID 22146048. Of 23 monozygotic female and male twins, nine (39.1%) were concordant for GID; in contrast, none of the 21 same‐sex dizygotic female and male twins were concordant for GID, a statistically significant difference (P = 0.005)... These findings suggest a role for genetic factors in the development of GID.
  9. Diamond, Milton (2013). "Transsexuality Among Twins: Identity Concordance, Transition, Rearing, and Orientation". International Journal of Transgenderism. 14 (1): 24–38. doi:10.1080/15532739.2013.750222. Combining data from the present survey with those from past-published reports, 20% of all male and female monozygotic twin pairs were found concordant for transsexual identity... The responses of our twins relative to their rearing, along with our findings regarding some of their experiences during childhood and adolescence show their identity was much more influenced by their genetics than their rearing.
  10. Diagnostic and Statistical Manual of Mental Disorders (Fifth ed.). Arlington, VA: American Psychiatric Publishing. 2013. pp. 451–460. ISBN 978-0-89042-554-1.
  11. Guillamon A, Junque C, Gómez-Gil E (October 2016). "A Review of the Status of Brain Structure Research in Transsexualism". Archives of Sexual Behavior. 45 (7): 1615–48. doi:10.1007/s10508-016-0768-5. PMC 4987404. PMID 27255307.
  12. American Psychiatry Association (2013). Diagnostic and Statistical Manual of Mental Disorders (DSM-5) (5th ed.). Washington, DC and London: American Psychiatric Publishing. pp. 451–460. ISBN 978-0-89042-555-8.
  13. American Psychological Association (2008). "Resolution on transgender, gender identity, and gender expression non-discrimination" (PDF).