జెర్రీ మాక్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
జెరాల్డిన్ "జెర్రీ" ఫ్రెడ్‌రిట్జ్ మాక్ (1925 నవంబరు 22 - 2014 సెప్టెంబరు 30) 1964 లో ఒంటరిగా వాయుమార్గం ద్వారా భూగోళం చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ. ఈమె "స్పిరిట్ ఆఫ్ కొలంబస్" నామకరణం, "చార్లీ" మారుపేరున్న సింగిల్ ఇంజిన్ సెస్నా 180 (రిజిస్టర్డ్ N1538C) లో పయనించింది. ఈ యాత్ర 1964 మార్చి 19 న కొలంబస్, ఒహియోలో ప్రారంభమైంది, కొలంబస్, ఒహియోలో 1964 ఏప్రిల్ 17 న ముగిసినది, ఈ యాత్రకు 21 మజిలీలతో 29 రోజులు పట్టింది, ప్రయాణించిన దూరం దాదాపు 22,860 మైళ్లు (36,790 కిమీ). జెర్రీ మాక్ తరువాత 1965 లో ఫెడెరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ నుండి లూయిస్ బ్లేరియోట్ పతకాన్ని పొందింది. 1970 లో ఈమె ప్రచురించిన త్రీ-ఎయిట్ చార్లీ బుక్ లో ఈమె భూగోళం చుట్టివచ్చిన విమాన కథను వివరించింది. 50 వ వార్షికోత్సవ ఎడిషన్ తరువాత ప్రచురించబడిన వాటిలో పటాలు, వాతావరణ ఛార్టులు, ఫోటోలు సహా ప్రచురించారు.