జేడ్ మొక్క
జేడ్ మొక్క (ఆగ్లం: Jade plant) ఇది ఇంటి లోపల పెంచుకునే మొక్క.. ఇది వాస్తు పరంగానూ మంచిదని శాస్త్ర పండితులు చెబుతున్నారు.
అత్యంత ప్రజాదరణ పొందిన ఇండోర్ ప్లాంట్లలో జేడ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 40 రకాలకు పైగా జేడ్ మొక్కలు ఉన్నాయి. వీటిలో సాధారణంగా బ్లూ బర్డ్ జేడ్, గొల్లమ్, సిల్వర్ డాలర్ జేడ్, హార్బర్ లైట్స్, లేడీ ఫింగర్స్ జేడ్, హాబిట్, పింక్ జేడ్ విరివిగా అందుబాట్లో ఉంటాయి.
ప్రాముఖ్యత
[మార్చు]అలోవెరా, మనీ ప్లాంట్, లక్కీ బాంబూ, స్నేక్ ప్లాంట్, అరెకా పామ్, జేడ్ ప్లాంట్.. ఇలాంటి ఇండోర్ మొక్కలు ఫెంగ్ షుయ్ (Feng Shui) ప్రకారం నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపించడమేకాక అందం, ఆనందం, ఆరోగ్యం కలిగిస్తాయి.[1] సాధారణంగా జేడ్ ప్లాంట్, లక్కీ ప్లాంట్, మనీ ప్లాంట్ అని పిలుచుకునే ఈ మొక్క శాస్త్రీయనామం క్రాసులా ఒవాటా (Crassula ovata). ఈ మొక్కను సిల్వర్ డాలర్ ప్లాంట్, ఫార్చ్యూన్ ట్రీ అని కూడా అంటారు. ఇది దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్, తూర్పు కేప్ ప్రావిన్సులు, మొజాంబిక్‌కు చెందినది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంట్లో పెరిగే మొక్కగా జేడ్ సాధారణమైంది. ఇది ఎక్కువ జనాదరణ పొందడానికి ప్రధానకారణం తక్కువ స్థాయి సంరక్షణ కావచ్చు. జేడ్ మొక్కకు తక్కువ నీరు అవసరం. అలాగే ఎలాంటి వాతావరణ పరిస్థితులలోనైనా జీవించగలదు.[2] ఇది సానుకూల శక్తిని ఇనుడింపచేసి అదృష్టాన్ని కలిగిస్తుందని నమ్మకం.[3]
పెంపకం
[మార్చు]కలబంద(Aloe Vera) మొక్కల మాదిరిగానే, జేడ్ మొక్కకు కూడా కొన్న నీళ్లు మాత్రమే అవసరం ఉంటుంది. ఇది మెట్ట నేలల్లో కూడా బాగా పెరుగుతుంది. దాని మందపాటి ఆకులు అవపాతం ద్వారా ఎక్కువ నీటిని కోల్పోకుండా చూసుకుంటాయి. దీన్ని నేరుగా సూర్యకాంతి కింద ఉంచవద్దు. అలాగే ఎక్కువ నీరు పెట్టవద్దు ఎందుకంటే ఈ మొక్క పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది.
ప్రయోజనాలు
[మార్చు]తక్కువ శ్రమతో గుబురుగా పెరిగే జేడ్ ప్లాంట్ ఇంటికి చక్కని శోభనిస్తుంది. క్రాసులేసియన్ యాసిడ్ మెటబాలిజం (CAM)ని అనుసరించే ఈ మొక్క రాత్రిపూట దాని చిన్న రంధ్రాలను తెరుస్తుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించేలా చేస్తుంది. తద్వారా పరిసరాల్లో గాలిని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా ఈ జేడ్ మొక్కలో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Ten houseplants that are easy to maintain - The Hindu". web.archive.org. 2022-05-22. Archived from the original on 2022-05-22. Retrieved 2022-05-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Urs Eggli (ed.): Succulent Encyclopedia. Crassulaceae (thick-leafed plants) . Eugen Ulmer, Stuttgart 2003, ISBN 3-8001-3998-7 , p 66 .
- ↑ "Ten houseplants that are easy to maintain - The Hindu". web.archive.org. 2022-05-22. Archived from the original on 2022-05-22. Retrieved 2022-05-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)