Jump to content

జే. కే. రౌలింగ్

వికీపీడియా నుండి
జే. కే. రౌలింగ్

2010లో వైట్ హౌస్ లో జే. కే. రౌలింగ్
2010లో వైట్ హౌస్ లో జే. కే. రౌలింగ్
Bornజోన్నే రౌలింగ్
(1965-07-31) 31 జూలై 1965 (age 59)
యేట్, గ్లౌసెస్టర్‌షైర్, ఇంగ్లాండ్
Pen name
  • జె. కె. రౌలింగ్
  • రాబర్ట్ గాల్‌బ్రైత్
Occupation
  • రచయిత
  • పరోపకారి
Alma mater
  • యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్
  • మోరే హౌస్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్
Periodసమకాలీన సాహిత్యం
Genres
  • ఫాంటసీ
  • డ్రామా
  • యువ వయోజన కల్పన
  • క్రైమ్ ఫిక్షన్
Years active1997–ప్రస్తుతం
Spouse
  • జార్జ్ అరంటెస్
    (m. 1992; div. 1995)
  • నీల్ ముర్రే
    (m. 2001)
Children3
Signature

జె. కె. రౌలింగ్ గా పేరు గాంచిన జోయాన్నే రౌలింగ్ (జననం 31 జూలై 1965), ఒక బ్రిటిష్ నవలా రచయిత, సినిమా, టెలివిజన్ నిర్మాత, రచయిత, పరోపకారి. ఈమె 1997 నుంచి 2007 వరకు ఏడు పుస్తకాలుగా ప్రచురితమైన హ్యారీ పోటర్ ఫాంటసీ సిరీస్ రచయిత. ఈ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ కాపీలు పైగా అమ్ముడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 84 భాషల్లోకి అనువాదం అయ్యాయి. దీని ఆధారంగా పలు చలనచిత్రాలు, వీడియో గేమ్స్ వచ్చాయి. 2012 లో వచ్చిన ద క్యాజువల్ వేకన్సీ ఆమె పెద్దల కోసం రాసిన మొదటి రచన.

ఇంగ్లాండు లోని గ్లూసెస్టర్‌షైర్, యేట్ లో జన్మించిన ఈమె 1990 లో ఒక పరిశోధకురాలిగా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో ద్విభాషా కార్యదర్శిగా పనిచేస్తుండేది. ఆ సమయంలో ఆమెకు హ్యారీ పాటర్ ధారావాహిక గురించిన ఆలోచన వచ్చింది. తర్వాత ఏడేళ్ళలో ఆమె తల్లి మరణం, మొదటి శిశువు జననం, మొదటి భర్త నుంచి విడాకులు తత్ఫలితంగా పేదరికం సంభవించాయి. 1997 లో ఆమె మొదటి నవల హ్యారీపాటరీ అండ్ ద ఫిలాసఫర్స్ స్టోన్ విడుదలైంది. దీని తర్వాత ఆరు భాగాలు విడుదలయ్యాయి. ఆఖరి భాగం హ్యారీపాటరీ అండ్ ది డెత్లీ హాలోస్ 2007 లో విడుదలైంది. 2008 లో ఫోర్బ్స్ ఆమెను అత్యధిక పారితోషికం అందుకునే రచయిత్రిగా గుర్తించింది.

ఈ నవలలో హ్యారీ పాటర్ అనే అబ్బాయి మాంత్రికుల కోసం ఉద్దేశించిన హోగ్వార్ట్స్ పాఠశాలలో చేరతాడు. లార్డ్ వోల్డర్‌మార్ట్ తో పోరాడతాడు. మరణం, మంచి చెడుల మధ్య పోరాటం ఈ నవల ప్రధాన ఇతివృత్తం. ఈ నవల మీద కమింగ్ ఆఫ్ ఏజ్ శైలి (కథానాయకుడిలో చిన్నతనం నుంచి సంభవించే మానసిక, నైతిక మార్పుల వివరణ), పాఠశాల కథలు, జానపథ కథలు, క్రిస్టియన్ అలెగొరీ ప్రభావం ఉంది.

జీవితం

[మార్చు]

రౌలింగ్ జులై 31, 1965 న ఇంగ్లాండు, గ్లూసెస్టర్‌షైర్ లోని యేట్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.[1] ఈమె తండ్రి పీటర్ జేమ్స్ రౌలింగ్, తల్లి యానీ. వీరిద్దరూ రాయల్ నేవీ ఉద్యోగస్తులు.

మూలాలు

[మార్చు]
  1. "About". JK Rowling. Retrieved 19 July 2024.