జైని మల్లయ్య గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జైని మల్లయ్య గుప్తా, నల్గొండ జిల్లాకు చెందిన సాయుధ పోరాటయోధుడు.[1]

తెలంగాణ సాయుధ పోరాటం[మార్చు]

భువనగిరి ప్రాంతానికి చెందిన జైనిమల్లయ్య 1943లో ఆరుట్ల లక్ష్మీనరసింహా రెడ్డి సారథ్యంలో మిత్రమండలి ప్రారంభించారు. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభ ద్వారా కమ్యూనిస్టుల వైపు మరలి రావి నారాయణ రెడ్డి లాంటి యోధులతో తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. 1946 అక్టోబరులో నిజాం ప్రభుత్వం జనిమల్లయ్యతో పాటు మిత్రమండలి సభ్యులను అరెస్టు చేయగా ఇతను కొంతకాలానికే చాకచక్యంగా తప్పించుకొని అజ్ఞాతంలో ఉండి పోరాటం కొనసాగించారు. తెలంగాణ విమోచనం అనంతరం రాజకీయాలలో చేరి 1962లో భువనగిరి పురపాలక సంఘానికి తొలి వైస్‌చైర్మెన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, ప్రధాన వార్తలు (17 September 2019). "సామాన్యులే సాయుధులై". www.eenadu.net. Archived from the original on 17 సెప్టెంబరు 2019. Retrieved 21 September 2019.