Jump to content

జోజి

వికీపీడియా నుండి
జోజి
దర్శకత్వందిలీశ్‌ పోతన్‌
రచనశ్యాం పుష్కరన్‌
నిర్మాతఫహాద్‌ ఫాజిల్
దిలీశ్‌ పోతన్‌
శ్యాం పుష్కరన్‌
తారాగణం
ఛాయాగ్రహణంషైజూ ఖలీద్‌
కూర్పుకిరణ్ దాస్
సంగీతంజస్టిన్‌ వర్గీస్‌
నిర్మాణ
సంస్థలు
భావన స్టూడియోస్
వర్కింగ్ క్లాస్ హీరో (ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ)
ఫహద్‌ ఫాజిల్ మిత్రులు
పంపిణీదార్లుఅమెజాన్‌ ప్రైమ్‌
విడుదల తేదీ
7 ఏప్రిల్ 2021 (2021-04-07)
సినిమా నిడివి
113 నిమిషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం

జోజి క్రైమ్ డ్రామా నేపథ్యంలో 2021లో విడుదలైన మలయాళం సినిమా. షేక్స్‌పియర్ రాసిన నాటకం ‘మెక్‌-బెత్‌’ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని భావన స్టూడియోస్ & వర్కింగ్ క్లాస్ హీరో వారు సంయుక్తంగా నిర్మించారు. జోజి చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో 2021, ఏప్రిల్ 7న విడుదలైంది.[1]

సినిమా కధ

[మార్చు]

కేరళలోని మారుమూల ప్రాంతంలో ఓ సంపన్న కుటుంబం ఉంటుంది. దీనికి కుట్టప్పన్‌ యజమాని. అతనికి ముగ్గురు కుమారులు. తండ్రి అంటే అందరికీ హడల్‌. జోజి ముగ్గురిలో చిన్నవాడు. బీటెక్‌ మధ్యలోనే వదిలేసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఓ రోజు తండ్రి హఠాత్తుగా అనారోగ్యం పాలవుతాడు. తండ్రి ఉండగా ఆస్తిని స్వేచ్ఛగా అనుభవించే అవకాశం దొరకదని వారంతా భావిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో తండ్రిని అడ్డుతొలగించుకొని ఆస్తిని చేజిక్కించుకోవాలనుకుంటాడు జోజి. తనకొచ్చిన వాటాతో విదేశాల్లో స్థిరపడాలని కలకంటుంటాడు. మరి జోజి ఏం చేశాడు? తన పథకం ప్రకారమే అంతా జరిగిందా? ఈ కుట్ర ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా కథ.[2][3]

నటీనటులు - సినిమాలో పాత్ర పేరు

[మార్చు]
  • ఫహాద్‌ ఫాజిల్ - జోజి పానచెల్
  • బాబురాజ్ - జొమోన్ పానచెల్
  • జోజి ముండకాయం - జైసాన్ పానచెల్
  • సన్నీపీ.ఎన్ - కుత్తప్పన్ పీకే పానచెల్
  • ఉన్నిమయ ప్రసాద్- బిన్సీ
  • షమ్మీ తిలకన్ - డా.ఫెలిక్స్
  • అలిస్టర్ అలెక్స్ - పాపీ
  • బేసిల్ జోసెఫ్ - కెవిన్
  • రేంజిత్ రాజన్ - గిరీష్
  • దనీష్ ఏ బాలన్ - తొట్ట సుది
  • రేంజిత్ గోపాలి - సురేష్

మూలాలు

[మార్చు]
  1. The News Minute (31 March 2021). "Fahadh Faasil and Dileesh Pothan's 'Joji' to release on OTT". Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
  2. Eenadu (3 May 2021). "'జోజి' ఎలా ఉందంటే? - fahadh faasil joji is now streaming on amazon prime india". www.eenadu.net. Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
  3. "Joji Review: Dysfunctional characters, but a tepid story". 7 April 2021. Archived from the original on 4 మే 2021. Retrieved 4 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=జోజి&oldid=4339816" నుండి వెలికితీశారు