టర్రిటోప్సిస్ నూట్రికోలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టర్రిటోప్సిస్ నూట్రికోలా
Not evaluated
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
T. nutricula
Binomial name
Turritopsis nutricula
McCrady,1857[1]

టర్రిటోప్సిస్ నూట్రికోలా చావు లేని జీవి ఒక జలచరం!. దాన్ని 'అమర జీవి' లేదా ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్ అని కూడా పిలుస్తారు.

విశేశాలు

[మార్చు]
  • ఇది ఒక జెల్లీఫిష్. తనను తాను సృష్టించుకుంటుంది. తనలాంటి వాళ్లను కూడా పుట్టిస్తుంది. అలా చావు లేకుండా తప్పించుకుంటోంది. అందుకే దీనిని 'ఇమ్మోర్టల్ జెల్లీఫిష్' అని పిలుస్తున్నారు.
  • గాజు గొడుగులా ఉండే జెల్లీఫిష్‌ లు ఒక రకమైన చేపలు. మెదడు, ఊపిరితిత్తులు, కళ్లు లేని ఈ జలచరాల్లో 350 జాతులున్నాయి. వీటిలో ఒకటే 'చావు' లేనిది! ఒక్క జెల్లీఫిష్‌ల్లోనే కాదు, భూమ్మీద ఏ జీవికీ ఈ లక్షణం లేదు! ఏ శత్రుజీవో తినేస్తే తప్ప, దానంతట అది ముసిలిదైపోయి చనిపోదన్నమాట.
  • కేవలం ఐదు మిల్లీమీటర్లకు మించి ఎదగని ఇవి, వయసు పెరగగానే తిరిగి బాల్య దశకు వచ్చేస్తాయి! తిరిగి పెరిగి జెల్లీఫిష్‌లాగా మారిపోతాయి.ఇలా మారడాన్ని 'ట్రాన్స్‌డిఫరెన్సియేషన్' అంటారు.
  • మిగతా జెల్లీఫిష్ జాతుల్లోలాగే వీటిలో కూడా ఆడవి, మగవి జతకట్టవు. మగవి నీటిలోకి వదిలే బీజ కణాలు, ఆడవాటికి అతుక్కుని ఉండే గుడ్లను తాకినప్పుడు ఫలదీకరణం చెందుతాయి. కొన్నాళ్లకు వాటి నుంచి పిల్లలు వచ్చి తల్లి నుంచి విడిపోయి సొంతంగా ఈదడం మొదలు పెడతాయి.
  • ఈ చిన్న జెల్లీపిల్లలు నీటిలో తేలియాడే ప్లాంక్టన్ అనే సూక్ష్మమైన ఆహారపు కణాలను తీసుకుంటూ బతుకుతాయి. ఇంతవరకు అన్ని జెల్లీఫిష్‌ల కథా ఒక్కటే. కానీ మిగతావి కొంతకాలానికి చనిపోతే ఇమ్మోర్టల్ జాతివి మాత్రం మరో అవతారం ఎత్తుతాయి.
  • ఇమ్మోర్టల్ జెల్లీఫిష్‌ల్లో పిల్లలు కొంత కాలం తర్వాత బండరాళ్లలాంటి గట్టి ప్రదేశాన్ని చేరుకుని అక్కడ అతుక్కుపోతాయి. ఈ దశలో వీటిని 'పాలిప్స్' అంటారు. అవన్నీ ఒకదానికి ఒకటి ఒకే కాలనీలోని ఇళ్లలాగా దగ్గరదగ్గరగా ఉంటూ నీటిలో కదలాడే సూక్ష్మ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి.
  • ఇలా కొన్నేళ్లు గడిచాక తిరిగి ఒకోటీ ఒకో జెల్లీఫిష్‌లాగా మారిపోతాయి. వీటి ద్వారా తిరిగి పిల్లలు ఏర్పడడం, అవి తిరిగి పాలిప్స్‌గా మారడం నిరంతరం జరుగుతూ ఉంటుంది.
  • పాలిప్ దశలో ఇవి తమ శరీరాల్లోని కణాలతో వేలాది పాలిప్స్‌ను సృష్టించగలవు.
  • లక్షలాది జలచరాలు వీటిని ఎప్పటికప్పుడు భోంచేస్తూ ఉంటాయి. కావున వీటి సంఖ్య పరిమితం గానే ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. Turritopsis nutricula McCrady 1857 - Encyclopedia of Life

ఇతర లింకులు

[మార్చు]