టిక్ టాక్ యాప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోగో

టిక్ టాక్ యాప్‌, చరవాణిలో వాడే ఒకయాప్.15 సెకన్ల వీడియోను సృష్టించడానికి ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు.ఈ యాప్‌ ద్వారా జోక్స్‌ క్లిప్స్‌, వీడియో సాంగ్స్‌, సినిమా డైలాగ్స్‌కు తగ్గట్లుగా లిప్‌ మూమెంట్‌, బాడీ మూమెంట్స్‌ ఇవ్వడం, డ్యాన్స్‌ చేయడం వంటివి దీనిలో చాలా సులభంగా చేస్తుంటారు.టిక్ టాక్ యాప్ 38 భాషలు భాషల్లో అందుబాటులో ఉంది.

రూపకల్పన

[మార్చు]

చైనీస్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీ కంపెనీ 'బైటీ డ్యాన్స్‌' టిక్‌టాక్‌ను రూపొందించింది. 2016 లో డౌయిన్‌ పేరుతో ఇది చైనాలో విడుదలైంది. ఆ తర్వాత ఏడాదికి 'టిక్‌టాక్‌' పేరుతో అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ యాప్‌ విడుదలచేశారు.2018 జూలైలో ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా వినియోగదారులను ఉన్నారు. భారతదేశంలో ఫిబ్రవరి-2019 నాటికి 24 కోట్ల మంది ఈ టిక్‌టాక్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.ప్రతి రోజూ కోటికి

పైగా వీడియోలను వీక్షింస్తారు.

డౌన్ లోడ్ సంఖ్య

[మార్చు]

2018 లో టిక్

టాక్ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ వినియోగదారులు ఉన్నారు.2019 లో భారత దేశం మొదటి స్థానంలో ఉంది.

విమర్శలు, సమస్యలు, నిషేధాలు

[మార్చు]

టిక్ టాక్ వ్యసనం కావటంతో, వినియోగదారులు యాప్ ఉపయోగించడాన్ని ఆపడానికి కష్టంగా మారింది .

యాప్ నిషేధం

[మార్చు]

ఇండోనేషియా ప్రభుత్వం

టిక్ టాక్ యాప్ ను నిషేధించారు. అశ్లీలత, దైవదూషణ గురించి ప్రచారం వంటివి జరగడంతో 2018 జూలై 3న ఇండోనేషియాలో టిక్ టాక్ నిషేధించారు. కొద్దికాలం తర్వాత, ఇండోనేషియాలో టిక్ టాక్ వీడియోలు సెన్సార్ చేయడంతో 2018 జులై 11న నిషేధం ఎత్తివేయబడింది.

భారతదేశంలో టిక్ టాక్ యాప్ నిషేదం

[మార్చు]

భారతదేశంలో టిక్ టాక్ యాప్ నిషేధించాలంటూ 2019 ఏప్రిల్ 3న, మద్రాస్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.టిక్ టాక్ యాప్ లో "అశ్లీలతను ప్రోత్సహిస్తుంది" అని పేర్కొంటూ, భారత ప్రభుత్వం ఈ యాప్‌ నిషేధించమని కోరింది. ఏప్రిల్ 17, గూగుల్, ఆపిల్, గూగుల్ ప్లే యాప్ స్టోర్ నుండి టిక్ టాక్ ను తొలగించారు. కోర్టు నిషేధాన్ని పునఃపరిశీలించటానికి నిరాకరించినట్లుగా, సంస్థ డౌన్లోడ్లు బ్లాక్ చేయబడినప్పటికీ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు వారు విశ్వసించారు. వారి కంటెంట్ విధానం, మార్గదర్శకాలను ఉల్లంఘించిన 6 మిలియన్ల వీడియోలను వారు తీసివేసిందని కూడా వారు ఆరోపించారు. ఈ విషయం ఏప్రిల్ 22 న గ్రహించటానికి నిర్ణయించబడింది.[1]

టిక్ టాక్‌ నిషేధం ఎత్తివేసిన మద్రాస్ హైకోర్ట్

[మార్చు]

టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. మదురై బెంచ్ తీర్పు బైట్ డాన్స్ కంపెనీకి ఊరటనిచ్చింది.పోర్న్ కంటెంట్‌ను అడ్డుకునేలా తగిన నియంత్రణ చర్యలు తీసుకుంటామని చైనీస్ కంపెనీ బైట్‌డాన్స్ అఫిడవిట్‌లో పేర్కొనడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.న్యాయస్థానం తాజా తీర్పుతో ఇక నుంచి ఈ యాప్‌ను ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది.

భారత్ పూర్తిగా నిషేధం

[మార్చు]

లడఖ్‌లో సైనిక ఘర్షణ తరువాత దేశ సార్వభౌమత్వానికి , భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ 29 జూన్ 2020 న టిక్‌టాక్‌తో పాటు 58 ఇతర చైనా యాప్‌లను నిషేధించింది.[2] [3]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-09. Retrieved 2020-04-09.
  2. "TikTok, UC Browser among 59 Chinese apps blocked as threat to sovereignty". The Times of India.
  3. "India bans TikTok after Himalayan border clash with Chinese troops". The Guardian.

వెలుపలి లంకెలు

[మార్చు]