టీఎస్‌ఆర్టీసీ హాస్పిటల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఆసుపత్రి హైదరాబాద్‌లోని తార్నాకలో ఉంది. ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ ఆసుపత్రి ఉంది.[1][2]

తార్నాకలోని టీఎస్‌ఆర్టీసీ హాస్పిటల్

నిర్వహణ[మార్చు]

హైదరాబాద్‌లోని తార్నాకలో ఉమ్మడి రాష్ట్రంలో లక్ష మంది ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వైద్యాన్ని అందించేందుకు విశాలమైన ప్రాంగణంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 49 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్యానికి ఈ ఆసుపత్రిని కార్పొరేట్‌ తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్టీసీ ఆసుపత్రిలో ఇదివరకు కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే వైద్యం అందిస్తోంది. కానీ దీనిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించి సాధారణ ప్రజలకూ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకరానున్నారు.[3] దీనిలో భాగంగా భవనాన్ని విస్తరించి అదనంగా బెడ్లను పెంచి ల్యాబ్‌ను, డయాలసిస్‌ కేంద్రాన్ని, ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి ల్యాబ్‌లో పరీక్షలు 24 గంటలూ నిర్వహించటం, మందుల కౌంటర్‌ను నిర్విరామంగా తెరిచి ఉంచటం లాంటి వాటిని ప్రారంభించారు.[4][5]

తార్నాకలోని టీఎస్‌ఆర్టీసీ హాస్పిటల్ లోని బయటి రోగుల విభాగం బిల్డింగ్


సిబ్బంది[మార్చు]

ఆర్టీసీ ఆసుపత్రిలో 28 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 16 మందే సేవలందిస్తున్నారు. దీంతో నలుగురిని కొత్తగా నియమించి, మరో ఐదుగురు ప్రైవేటు వైద్యుల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆసుపత్రిలో 60 మంది సహాయ సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నర్సులు, డయాలిసిస్‌ టెక్నీషియన్లు, మల్టీ పర్పస్‌ వర్కర్ల పోస్టుల కోసం నియమించనున్నారు.[6][7]

మూలాలు[మార్చు]

  1. Sakshi (30 December 2021). "అందరికీ 'ఆర్టీసీ' వైద్యం!". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  2. 10TV (1 November 2021). "సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తార్నాక ఆసుపత్రి" (in telugu). Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. NTV (1 November 2021). "సూపర్ స్పెషాలిటీ స్థాయికి తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  4. Eenadu (2 January 2022). "ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్య నిపుణుల సేవలు ప్రారంభం". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  5. TNews Telugu (5 September 2021). "ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తాం". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  6. Sakshi (5 September 2021). "'సామాజిక బాధ్యత'తో కార్పొరేట్‌ లుక్‌". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  7. The Hindu (1 November 2021). "ICU and ER facilities inaugurated at Tarnaka RTC hospital" (in Indian English). Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.