Jump to content

టు సోల్స్

వికీపీడియా నుండి
టు సోల్స్
దర్శకత్వంశ్రావణ్ కుమార్
రచనశ్రావణ్ కుమార్
నిర్మాతవిజయలక్ష్మి వేలూరి
తారాగణం
  • త్రినాథ్ వర్మ
  • భావన సాగి
  • రవితేజ మహదాస్యం
  • మౌమిక రెడ్డి
ఛాయాగ్రహణంశశాంక్ శ్రీరామ్
కూర్పుసత్య గిడుతూరి
సంగీతంప్రతీక్ అభయంకర్
ఆనంద్ నంబియార్
పాటలుకృష్ణ చైతన్య, రాకేందు మౌళి, నిఖత్ ఖాన్
నిర్మాణ
సంస్థ
పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్
విడుదల తేదీ
21 ఏప్రిల్ 2023 (2023-04-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

టు సోల్స్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయలక్ష్మి వేలూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రావణ్ దర్శకత్వం వహించాడు. త్రినాథ్ వర్మ, భావన సాగి, రవితేజ మహదాస్యం, మౌమిక రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 ఏప్రిల్ 17న విడుదల చేసి[1], సినిమాను 2023 ఏప్రిల్ 21న విడుదల చేశారు.[2]

అఖిల్ (త్రినాథ్ వర్మ) తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రితో విభేదించి సిక్కింలో ఒంటరిగా జీవిస్తూ డ్రగ్స్ కు బానిస అవుతాడు. అఖిల్ ప్రియా అనే అమ్మయిని ప్రేమిస్తాడు. ఆ విషయం తనతో చెప్పడానికి వెళ్లిన అతడికి ప్రియా మరో అబ్బాయితో కలిసి కనిపిస్తుంది. దీంతో తాను మోసపోయానని తెలుసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత లేచి చూస్తే తన బాడీ ఆసుపత్రి బెడ్ పై అపస్మారక స్థితిలో ఉంటుంది. తాను ఉన్నది ఆత్మ అని గ్రహించి బయటకు వస్తే తన లాగే యాక్సిడెంట్‌ అయిన ప్రియా (భావన సాగి) ఆత్మ బయట కూర్చొని ఉంటుంది. వీరిద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకొని తాము జీవితంలో ఏమి చేయలేక పోయామో అవి చేయాలని నిర్ణయించుకొని ఇద్దరు ప్రేమలో పడతారు. అఖిల్ తన ప్రేమకు గురించి ప్రియకు చెప్పే సమయంలో ఆమె ఆత్మ విడిపోతుంది. ఆ తరువాత రెండు ఆత్మలు నిజ జీవితంలో కలిశాయా? లేదా? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]
  • త్రినాథ్ వర్మ
  • భావన సాగి
  • రవితేజ మహదాస్యం
  • మౌమిక రెడ్డి
  • ప్రవీణ్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్
  • నిర్మాత: విజయలక్ష్మి వేలూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రావణ్ కుమార్
  • సంగీతం: ప్రతీక్ అభయంకర్
    ఆనంద్ నంబియార్
  • సినిమాటోగ్రఫీ: శశాంక్ శ్రీరామ్

మూలాలు

[మార్చు]
  1. 26 April 2023 (20 April 2023). "టూ సోల్స్ ట్రైలర్.. ఆసక్తికరంగా రెండు ఆత్మల కథ". Archived from the original on 26 April 2023. Retrieved 26 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. 10TV Telugu (20 April 2023). "ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్.. మరో చిన్న సినిమా 'టూ సోల్స్'.. ఏప్రిల్ 21న విడుదల". Archived from the original on 27 April 2023. Retrieved 27 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (22 April 2023). "'టు సోల్స్‌'మూవీ రివ్యూ". Archived from the original on 27 April 2023. Retrieved 27 April 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=టు_సోల్స్&oldid=3921746" నుండి వెలికితీశారు