Jump to content

టూరింగ్ టాకీస్

వికీపీడియా నుండి

టూరింగ్‌ టాకీస్‌ సినిమాలను ప్రదర్శించే ఒక సంస్థ. గత కాలంలో సినిమాలను ప్రదర్శించే సినిమా హాళ్ళూ (సినిమా ప్రదర్శన కేంద్రాలు) ఎక్కువగా లేని కాలములో సినిమాలను ప్రదర్శించడానికి తాత్కాలికంగా ఒక డేరాను ఏర్పాటుచేసి అందులో సినిమాలను ప్రదర్శించేవారు. ఇవి కేవలము పల్లెటూర్లల్లో మాత్రమే ఏర్పాటు చేసేవారు. పట్టణాలలో ఆడిని సినిమాలను ఇందులో ప్రద్ర్శించే వారు. వీటిని ఒక ప్రాతంనుండి మరొక ప్రాంతానికి తరలించడానికి అనుకూలంగా వుండేవి. అందుకే వాటిని టూరింగు టాకీసులు అనేవారు. ఇందులో ప్రతి సినిమా సుమారుగా ఒక వారము మాత్రమే ప్రదర్శించేవారు. వారాంతములో అనగా చివరి రోజున ఆ తర్వాత ఆడబోయే సినిమాని, ప్రస్తుతము ఆడుతున్న సినిమాని కలిపి రాబోయే సినిమాని కూడా ఒకే టికెట్టు పై చూపే వారు. ఆ విదంగా ప్రేక్షకులు ఒక టికెట్టుతో రెండు సినిమాలు చేసే అవకాశము లభించేది. వీరి సినిమా ప్రచారానికి చిన్నపాటి టౌన్లు అయితే రిక్షాలు, పల్లెటూరులైతే ఎడ్ల బండితో ప్రచారము నిర్వహించేవారు. ఆ రోజుల్లో చిన్న పిల్లలకు సినిమా బండి వచ్చిందంటే సినిమా చూసినంత సంబరము. మరొక్క విషయమేమంటే....... ఆ రోజుల్లో పల్లె ప్రజలు ఎడ్ల బండిమీద ఊరి వారందరు ( అనగా సుమారు 10 మంది) కలిసి నిసిమాకు వెళ్ళేవారు. అలా ఎడ్ల బండి తోలుకొచ్చిన వానికి సినిమా టికెట్టు ఉచితము. ఈ విధంగా వుండేవి టూరింగు టాకీసులు. చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం లోని కొత్త పేట గ్రామంలో గతంలో ఒక టూరింగు సినిమా టాకీసు వుండేది. అందులో ఒకే ఒక్క ప్రొజెక్టరు వుండేది. ఒక రీలు పూర్తి కాగానే రీలు మార్చడానికి సుమారు ఐదు నిముషాలు పట్టేది. ఇలా సినిమా పూర్తయ్యేలోపల సుమారు ఐదుసారు మధ్య మధ్యలో విరామము. ఈ మధ్యలో రీలు తెగిపోతే..... దానిని ఆతికించి తిరిగి ప్రారంభించడానికి మరో అయిదు నిముషాలు అధనము.

దీనికి మూలాలు ఏమి లేవు. గతంలో ఏ టూరింగు టాకీసుకైనా ఇదే పరిస్థితి. మూలాలు లేవని వ్యాసాన్ని తొలిగించ దలచుకుంటే నిరభ్యరంతంగా తొలిగించుకోవచ్చు.