టేకు కుటుంబము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టేకు కుటుంబము

టేకు చెట్టు

టేకుచెట్టు ఎనుబది మొదలు నూటయేబది యడుగుల వరకు బెరుగు పెద్ద వృక్షము.

ఆకులు : - అభిముఖచేరిక. లఘుపత్రములు సమాంచలము అడుగున మెత్తని రోమములు గలవు. కొన సన్నము.

పుష్పమంజరి : - కొమ్మల చివరలనుండి ద్వివృంత మధ్యారంభమంజరులగు పెద్దరెమ్మ గెలలు. ప్రతి పుష్పమువద్దను చిన్న చేటిక గలదు.

పుష్పకోశము : - సంయుక్తము గొట్టమువలె నుండును. అయిదో, ఆరో, తమ్మెలుండును. నీచము. అదికాయనంటిపెట్టుకొని దానితోగూడ బెద్దదగును.

దళవలయము : - సంయుక్తము గొట్టము పొట్టి తమ్మె లైదో, ఆరో యుండును. తమ్మెలన్నియు -సమముగా నే యుండును.

బొమ్మ
టేకు చెట్టు

కింజల్కములు: దళవలయపు తమ్మెలన్ని యున్నవి. కాడలు దళ వలయమును నంటి యున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు అవి నిడివి చౌక పాకారము.

అండ కోశము: అండాశయము ఉచ్చము. నాలుగు గదులు. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క అగింజ గలదు. కీలము సన్నము కీలాగ్రము రెండు చీలికలలో పెంకు కాయ.

మడ చెట్టు: సముద్ర తీరములను గాలువల వద్దను మొలచును.

ఆకులు అభిముఖ చేరిక అధశ్చిర అండాకారము తొడిమ పొట్టి సమాంచలము. కొన గుండ్రము.
పుష్పమంజరి
కొమ్మల చివరలనుండి మధ్యారంభమంజరులు పువ్వులు చిన్నవి. చాలయుండును పసుపు రంగు అసరాళము సంపూర్ణము ఉప వృంతముల వద్దను పుష్ప కోశముల వద్దను చేటికలు గలవు.
పుష్పకోశము
సంయుక్తము అయిదు తమ్మెలుగ చీలి యున్నది. ఇది కాయ నంటి పెట్టుకొని పెద్దది కాదు. నీచము.
దళవలయము
సంయుక్తము అసరాళము ఓష్టాకారము గొట్టము పొట్టి తెమ్మెలు అయిదో నాలుగో యుండును.
కింజల్కములు
నాలుగు కాడలు దళవలయము నంటు కొని యున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.

అండ కోశము: అండాశయము ఉచ్చము. నాలుగు గదులు ఈ గదులు పూర్తిగా వేరు వేరుగ లేవు. ఒక్కొక్క దాని యందొక్కక్క అండము వ్రేలాడు చుండును. కీలము కింజల్కము అంత పొడుగు కీలాఅగ్రము రెండు సన్నని చీలిక.

గుమ్మడి
చెట్లు మన దేశములో విరివిగా పెరుగు చున్నవి. మ్రాను నిడివిగా నుండి కొమ్మలు నలుదశలా వ్యాపించి యుండును.
ఆకులు
అభిముఖ చేరిల లఘు పత్రములు, హృదయాకారము పది అంగుళముల పొడగు కూడా నుండును. సమాంచలము విషమ రేఖ పత్రము. అడుగు ప్రక్కన రోమములు గలల్వు. పత్రముతో దొడిమ కలియు చోట రెండో మూడో పెద్ద గ్రంథి కోశములు గలవు.
పుష్ప మంజరి
కొమ్మల చివరల నుండి మధ్యారంభ మంజరులగు రెమ్మ గెలలు పుష్పముల వద్ద చేటికలు గలవు. ఇవి త్వరగా రాలి పోవును. పువ్వులు అసరాళము.
పుష్పకోశము
చిన్నది సంయుక్తము అయిదు దంతములు గలవు. నీచము.
దళవలయము
సంయుక్తము అసరాళము నాలుగు తమ్మెలు అడుగున నున్న తమ్మె పెద్దది.
కింజల్కములు
నాలుగు రెండు పెద్దవి. రెండు చిన్నవి. పొడుగా నున్నవి లోపలకు వంగి యుండును.
అండకోశము
అండాశయము ఉచ్చము నాలుగు గదులు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వ్రేలాడు చుండును. కీలము కింజల్కము లంత పొడుగు. కీలాగ్రము రెండు చీలికలు. ఒక చీలిక పెద్దది. కాయ చిన్నది పండి వచ్చగానుండును.

ఇది యొక పెద్ద కుటుంబము. ఈ కుటుంబపు మొక్కలు మన దేసములో చాలనే యున్నవి. ఆకులు అభిముఖ చేరిక, లఘు పత్రములు. సమాంచలము. పుష్పములు అసరాళములు. కింజల్కములు దళ వలయపు తమ్మెల కంటే తక్కువ యుండును. అండ కోశము నాలుగు గదులు, ఒక్కొక్క గదియందొక్కొక యండము గలదు. ఈ కుటుంబము కొంచెము అడ్డసరము కుటుంబమును బోలి యుండును. ఈ కుటుంబమును పెద్ద చెట్లో తీగెలో, గుబురు మొక్కలో, పుష్ప మంజరి యెట్టిదో అండాశయమున నొక గదియో, ఎక్కువయున్నవో, కాయ కండ కాయయో, ఎండు కాయయో వీనిని బట్టి జాతులుగను తెగలుగను విభజించి యున్నారు.

టేకు చెట్లు హిందు దేశమునందు పలు తావుల బెరుగుచున్నవి. కాని మన తెలుగు దేశమునందు తక్కువ. ఇప్పుడిప్పుడు మన్యములందును, అడవుల్లోను నాటి పెంచు చున్నారు. అవి అన్ని మంచి నేలలోను పెరుగ గలవు గాని ఒండ్రు మట్టి భూములందు బాగుగ పెరుగును. వానికి సమమగు శీతోష్ణ స్థితులు చేకూరక ఏది విస్తారముగ నుండినను నేపుగా పెరుగ లేవు. గింజలను నాతి రెండు మూడడుగులు పెరిగిన తరువాత ఆ చిన్న మొక్కలను దీసి దూర దూరముగ పాతెదరు. పెద్ద చెట్లను వేరు చోట్ల బాతుచో తల్లి వేరు విరిగి పోవుట తటస్థించును. కావున చిన్నవిగా నున్నప్పుడే తీసి పాత వలెను. కొన్ని చోట్ల గింజలను మొదటనే దూర దూరముగ పాతుదురు. అడవులలో టేకు చెట్లు మొలచు చోట వెదురు కూడా మొలచును. వెదురు మొక్కలు మిక్కిలి దట్టముగా నున్న యెడల చిన్న టేకు మొక్కలు ఎండయు, వెలుతురు తగులక చచ్చి పోవును కాన వెదురును నిర్మూలన చేయుటకు అడవులను తగుల బెట్టు చుందురు. ఒక్కొక్కప్పుడు కొన్ని పక్షులు ఏవో గింజలను ఈ చెట్లమీద రాల్చును. ఈ గింజలు మొక్కలు మొలచిన యెడల టేకు చెట్ల సారము లాగి వేయు చుండును. గాన వాని నెదుగ నీయ కుండ చూచు చుండ వలెను. టేకు చెట్లను, భూమి మీద నుండి 5, 6 అడుగు లెత్తుగా నున్న చోట ఆరేడడుగులు చుట్టుకొలత యున్నప్పుడే నరుకుట మంచిది. సాధారణంగా నెకరమునకు 50 చెట్లుండును. అది మంచి నేల యైనా 300 అడుగుల కలప వచ్చును. కలపలో టేకు కలపయే మిక్కిలి శ్రేష్టమైనది. ఇది నీటిలో చిరకాలము చీకి పోకుండ యుండును. పడవలు చేసినపుడు దీని మీదనుండెడు మేకులకు కూడా త్రుప్పు పట్ట నీయదు. కలపను దొలిచెడు పురుగులు కూడా దీనినంతగా దొలువ లేవు. ఈ కలప అన్ని చెక్కడపు పనులకు, బీరువాలకు, బల్లలకు, మేడ మెట్లు గట్టుటకు రైలు బండ్లకు, ఓడలకు, అన్నిటికి పనికి వచ్చును.

ఈ కలపను కాగులో వేసి కాల్చిన యెడల తారు వచ్చును. దీని నుండి చమురు తీసి దానిని ఔషదములలో వాడు చున్నారు. దీని అకుల దిని నొకవిధమగు పట్టు పురుగు బ్రతుక గలదు. టేకు వ్యాపారము మన దేశమున కంటే బర్మా దేశమున ఎక్కువ గలదు. టేకు కలప మన దేశమునుండి యొక్కువగా ఇంగ్లాండునకే పోవు చున్నది.

మడ చెట్లు కొన్ని చోట్ల పెద్ద చెట్టూగా కూడా పెరుగుచున్నవి. పెద్ద చెట్ల కలప గానుగలు మొదలగునవి చేయుటలో నచ్చటచ్చట వాడు చున్నారు గాని అది పెళుసుగా నుండుటచే వంట చెరుకుగానె విశేషముగా ఉపయోగించు చున్నారు. దీని బెరడుతో తోలు బాగు చేయ వచ్చును. దీని కాయలు వెన్నతో ఉడకపెట్టి పట్టించినచో కొన్ని పుండ్లు పోవును.

గుమ్మడి చెట్టు కలప కూడా మంచిదియె. టేకు తరువాత దీనినే చెప్పవలెను. ఇదియు నీళ్ళలో చీకి పోకుండ చాల కాలముండును. దీనిని ఓడలకు పడవలకు ఉపయోగింప వచ్చును.

చిన్న గుమ్మడి సాధారణంగా అన్ని బీడు నేలలందు పెరుగ గలదు. దీనికి ఆకుల వద్ద ముండ్లు గలవు. పువ్వులు పెద్దవి. పచ్చగా నుండును. ఇది వంట చెరుకుగా అతప్ప మరెందులకు పనికి రాదు. చిరుగుమ్మడి అడవులలో నుండును. పై దాని వలెనే యుండును గాని యంతకంటె చిన్నది. అకులు చిన్నవియొ. దీని కెక్కువ ముండ్లు గలవు.

ఆకులను నీళ్ళలో నాన వేసినచో అవి చిక్కబడును. వీనిని మూత్ర వ్యాధులకు ఉపయోగింతురు. కలప వంట చెరుగుగా ఉపయోగించు చున్నారు.

పెద్ద నెల్లికూర. చిన్న చెట్టు. కొమ్మలు వ్యాపించియుండును. దీని పువ్వులు పచ్చగా నుండును. ఆకులను కొందరు కూర వండుకొనెదరు. కలప తెల్లగా నుండును. దీనిని చాల పనులకు ఉపయోగించు చున్నారు.

నౌరు చెట్టు. కొండలమీద బెరుగును. దీని ఆకుల అడుగున తెల్లని రోమములు గలవు. పువ్వులుచిన్నవి ఆకు పచ్చగాను, పసుపు పచ్చగను వుండును.

వావిలి పెద్ద. గుబురు మొక్క. ఆకులు చీలి యున్నవి. చిట్టి ఆకులు మూడో అయిదో యుండును. దీని ఘాటగువాసన గలదు. పువ్వులు నీలము ఊదారంగు కలిసి యుండును. ఆకుల కషాయము తల నొప్పిని పోగొట్టు నందురు.

బొక్కుడు చెట్టు పొడుగుగానె పెరుగును. ఆకులు అండాకారము. తెల్లని పూవులు పూయును.

నెమలి అడుగు చెట్టు కొండలమీద పెద్దదిగా పెరుగును. ఆకులు మిశ్రమ పత్రములు. పువ్వులు చిన్నవి. దీని కలప కొంచెమెర్రగా నుండును. ఇది పెట్టెలు బీరువాలు చేయుటకు పనికి వచ్చును.

బ్రాహ్మిణి చెట్టు గుబురుగా పెరుగు చిన్న మొక్క. ఆకులొక్కొకచోట మూడో నాలుగో యుండును. పువ్వులు మొదట తెల్లగా నుండును. కాని క్రమముగా ఎర్రబారును.
తులసి మొక్క మన దేశము నందంతటను పెరుగు చున్నది.
ప్రకాండము
నాలుగు పలకలుగా నున్నది. దీని మీద రోమములు గలవు.
ఆకులు
లఘు పత్రములు. అభిముఖ చేరిక. తొడిమ గలదు. కణుపు పుచ్ఛములు లేవు. పత్రము అండాకారము. విషమ రేఖ పత్రము. అంచున రంపపు పండ్లు గలవు. కొన సన్నము. దీని మీదస్ను రోమములు గలవు. దీని కొక విధమగు వాసన గలదు.
పుష్ప మంజరి
కొమ్మల చివర ప్రతి కణుపు నందును మధ్యారంభ మంజరులుగ నున్నవి. వీనికి చేటికలు గలవు. పువ్వులు చిన్నవి. అసరాళము. సంపూర్ణము ఓష్టారకారము
పుష్ప కోశము
సంయుక్తము. 5 దంతములు గలవు. నీచము స్థిరము కాయతో గూడ బెరుగును. కాయ కంటే నిది పెద్దది.

మూలం: https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95:VrukshaSastramu.djvu