Jump to content

టేప్ రికార్డర్

వికీపీడియా నుండి
Mariner 4 tape recorder

విద్యుదయస్కాంతం ద్వారా స్థిర విద్యుత్ ప్రవాహాన్ని పంపి ఉక్కు తీగ లేదా టేప్ పై శబ్ద తరంగాలను రికార్డు చేసి ఆ టేప్ నుండి సమాచారాన్ని మరలా గ్రహించుటకు వాడే పరికరాన్ని టేప్ రికార్డరు అంటారు. ఈ టేప్ రికార్డులో ఉపయోగించే టేప్ కలిగిన దీర్ఘచతురస్రాకార పరికరాన్ని క్యాసెట్టు అంటారు. టేప్ పై ధ్వనిని రికార్డు చేయవచ్చు, ఆ ధ్వనిని టేప్ రికార్డరులో ఉపయోగించు మరల వినవచ్చు. ఆ టేప్ పై సమాచారాన్ని తుడిచి మరల రికార్డు చేయవచ్చు.

చరిత్ర

[మార్చు]

దీనికి సంబంధించిన తొలి ప్రయోగాలు 1919 లో ప్రారంభమైనాయి. 1929 లో ఫ్లూమర్ అనే జర్మన్ శాస్త్రజ్ఞుడు అయస్కాంత పదార్థంతో టేప్ ని తయారుచేశాడు. దీనిపై జిగురు పదార్థం కలిసిన ఇనుప పొడితో పూత పూశాడు. మరో ఆరేళ్ళలో దీనిని మరింత మెరుగు పరచి మాగ్నటోఫోన్ అనే క్రొత్త పద్ధతిని తీర్చి దిద్దాడు. ఇందులో ఫెర్రస్ ఆక్సైడ్ పూసిన ప్లాస్టిక్ టేప్ ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందే జర్మన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ తన కార్యక్రమాల్ని ఈ పద్ధతి లోనే రికార్డు చేసి ప్రసారం చేసింది. అయితే ఈ యంత్రాలు పెద్దగా బరువుగా ఉండేవి. యుద్ధ సమయంల్ఫో జర్మన్ సైనికులకు సందేశాలను అందించటానికి తేలిక నమూనాలు తయారు చేయబడ్డాయి. అమెరికాలో కూడా 1940 తరువాత చికాగో ప్రయోగ శాలలో మార్విన్ కామ్రాన్ అనే ఇంజనీర్ యువకుడు కొత్త నమూనాల చిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నాడు. టేప్ ని తయారుచేయటానికి (Poly Vinyl Chloride) అనే క్రొత్త ప్లాస్టిక్ పదార్థాన్ని కనుక్కోవటంతో రికార్డింగ్ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం ప్రారంభమైనదని చెప్పవచ్చు.

వినియోగం

[మార్చు]

యుద్ధానంతరం ఇండ్లలోనూ, ఆఫీసుల్లోను ఉపయోగించటానికి వీలుగా చిన్న టేప్ రెకార్డర్లు బ్రిటన్, అమెరికా, జర్మనీ దేశాల్లో విస్తృతంగా తయారయ్యాయి. రేడియో ప్రసార కేంద్రాలల్లో, సినిమా, టెలివిజన్, గ్రామఫోన్, స్టుడియోల్లో పెద్ద నమూనా టేప్ రికార్డర్లు వాడకం ఎక్కువయింది. టేప్ లపై రికార్డు చేసిన కార్యక్రమాల్ని గ్రామఫోన్ రికార్డుకి, సినిమా రీల్ కి లేదా టేప్ లకీ మార్చడానికి వీలుండటం ఇందులోని ప్రధాన సౌలభ్యం. రికార్డు చేసిన తరువాత కూడా అనవసరమని తోచిన భాగాల్ని తీసివేసి, కావలసిన కార్యక్రమాల్ని మాత్రం ఏర్చి కూర్చవచ్చు. గ్రామఫోన్ లో రికార్డు చేసేటప్పుడుఏదైనా పొరపాటు దొర్లితే మళ్లీ మొదటినుండి అంతా పునరావృతం చేయాల్సి ఉంటుంది. టేప్ లో అలా కాకుండా, పొరపాటు దొర్లిన భాగం మాత్రం తుడిచి వేసి మళ్ళీ అక్కడి నుండి రికార్డు చేయవచ్చు. పైగా ప్రధాన కార్యక్రమములను వినేటప్పుడు అనవసరమైన శబ్దాలు గాని, నేపథ్యంలో అంతరాయాలు గానీ లేకుండా స్పష్టంగా ఉండాలి.

ఉపయోగాలు

[మార్చు]

రకరకాల పరిమాణాల్లో టేప్ రికార్డులు తయారయ్యాయి. రేడియో ప్రసార కేంద్రాల్లో కార్యక్రమాల్ని మొదట టేప్ రికార్డులలో రికార్డు చేసి, వాటి బాగోగుల్ని పరీక్షించాకనే ప్రసారం చేస్తారు. సంగీత కార్యక్రమాల్ని వినటానికి ఇంటింటా దీన్ని వాడటం అందరికీ తెలిసినదే. పత్రికా విలేకరులు వార్తలను సేకరించి, ప్రముఖ వ్యక్తుల సంభాషనల్ని రికార్డు చేయటంలో ఇది బాగా ఉపకరిస్తుంది. నటులు, గాయకులు, వక్తలు తమ కార్యక్రమాల్ని ముందుగా రికార్డు చేసుకొని, మళ్ళీ, మళ్ళీ వాటిని వింటూ లోటుపాట్లను సర్దుబాటు చేసుకోవటం, సంగీత శిక్షణ, విదేశీ భాషలు ఉచ్చారణ పద్ధతుల్ని నేర్చుకోవడం, మూగవాళ్ళను క్రమపద్ధతిలో మాటలు నేర్పడానికి ప్రయత్నించటం-- ఇలాంటి అనేక విషయాల్లో టేప్ రికార్డర్ ప్రధాన పాత్ర వహిస్తుంది. విమానాలు విమానాశ్రయంలో బయలు దేరినప్పటి నుంచీ గమ్యస్థానం చేరే వరకు పైలట్ అడిగే ప్రశ్నలకూ, కంట్రోల్ గది నుండి అతని కిచ్చే సమాధానములనూ, విమానంలో వినబడే ప్రేలుడు లాంటి ఇతర శబ్దాలను రికార్డు చేయటానికి ఓ టేప్ రికార్డర్ని వాడతారు. దీనిని బ్లాక్ బాక్స్ (Black Box) అనిపెరు. విమాన ప్రమాదాలు జరిగినప్పుడల్లా ఈ యంత్రం సహాయంతో ప్రమాద కారణాలను విశ్లేషించటానికి వీలవుతుంది.

ఇంతే కాకుండా టెలివిజన్ లోనూ, ఆటోమేషన్ లోనూ టేప్ రికార్డరు ఉపయోగిస్తారు.

యివి కూడా చూడండి

[మార్చు]