టోనర్ కార్ట్రిడ్జ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక హ్యూలెట్ ప్యాకర్డ్ లేజర్ టోనర్ కార్ట్రిడ్జ్

టోనర్ కార్‌ట్రిడ్జ్ (Toner cartridge, లేదా లేజర్ టోనర్ - laser toner) అనేది లేజర్ ప్రింటర్ లో వినియోగించే అంతర్భాగం. టోనర్ కార్ట్రిడ్జ్‌లు టోనర్ పొడిని కలిగి ఉంటాయి, ఈ పొడి కార్బన్ పౌడర్, ఐరన్ ఆక్సైడ్ ల యొక్క మిశ్రమము. ఈ పొడి నలుపు లేదా ఇతర రంగులలో ఉంటాయి. ఈ పొడి మిశ్రమం టెక్స్ట్‌గా, చిత్రాలుగా కాగితంపై ముద్రితమవుతుంది. ప్రింటర్‌లో టోనర్ కార్ట్రిడ్జ్ నుంచి ఎలెక్ట్రోస్టాటికల్ చార్జ్డ్ డ్రమ్ యూనిట్ ద్వారా టోనర్ (పొడి) కాగితంపై తాత్కాలికంగా అంటుకుంటుంది, తరువాత ప్రింటర్‌లో ఉండే ఫ్యూజర్ యొక్క వేడికి టోనర్ కరిగి కాగితానికి గట్టిగా అతుక్కుపోతుంది. సాధారణంగా బ్లాక్ లేజర్ ప్రింటర్‌లో నలుపు రంగు టోనర్ కలిగిన టోనర్ కార్ట్రిడ్జ్ మాత్రమే ఉంటుంది. సాధారణంగా కలర్ లేజర్ ప్రింటర్‌లో నలుపు రంగు టోనర్ కలిగిన టోనర్ కార్ట్రిడ్జ్‌తో పాటు ముదురు నీలం (cyan), ఎరుపు-నీలం (Magenta), పసుపు (Yellow) రంగు టోనర్‌లు కలిగిన నాలుగు టోనర్ కార్ట్రిడ్జ్‌లు ఉంటాయి. సాధారణంగా టోనర్ కార్ట్రిడ్జ్‌ను రీఫిల్ చేసుకోవచ్చు, ఎక్కువ సార్లు దీనిని రీఫిల్ చేస్తే ప్రింటింగ్‌లో నాణ్యత తగ్గే అవకాశముంది, అలాగే ఇది చెడి పోయే అవకాశం వుంది, అందువలన ఎక్కువగా టోనర్ కార్ట్రిడ్జ్‌లను కొత్తవి కొని వేసుకుంటారు. టోనర్ కార్ట్రిడ్జ్‌లను తరచుగా ఉపయోగిస్తుండాలి, లేనిచో దీని లోని టోనర్ పాడైపోయే అవకాశముంది.

మార్చి 28, 1989 న, ఫ్రెడ్ కీన్‌కు "రీఫిల్ చేయదగిన టోనర్ కార్ట్రిడ్జ్" కోసం యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ లభించింది.[1]

మూలాలు[మార్చు]