Jump to content

ట్రాప్ ఫర్ ది సెవెన్ ఇటలీ సినిమా

వికీపీడియా నుండి

"ట్రాప్ ఫర్ ది సెవెన్ స్పయిస్ " Trap for Seven Spies ఇటలీ,స్పెయిన్ దేశాల సంయుక్త నిర్మాణం ఈ సినిమా. Mario Amendola దర్శకత్వంలో 1966లో ఇటలీ, స్పెయిన్ భాషల్లో తీసిన సినిమా ఈ పేరుతో ఇంగ్లీషులోకి డబ్ చేశారు. అభిమానులు రహస్యంగా ఉంటూ యుద్ధంలో జర్మనీ ఓటమికి సహకరించిన ప్రజల మీద, కార్యకర్తలమీద ప్రతీకారం తీర్చుకోడానికి ప్రయత్నం చేయడమే ఈ సినిమా ఇతివృత్తం. ఒక మాజీ నాజీ కల్నల్, ధనికుడు తన మాజీ నాజీ అనుచరులతో కలిసి ఒక ఫ్రెంచ్ castleలో ఉంటూ, పూర్వం మిత్రరాజ్యాల పక్షంలో పనిచేసిన అయిదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు,మొత్తం ఏడుమందిని బంధించి, అందరినీ తానే నాజీల తరఫున విచారించి అందరికీ మరణశిక్ష విధిస్తాడు. రోజుకొకరి చొప్పున మరణశిక్ష అమలుచేయడానికి తీర్మానిస్తాడు. ఆ బందీలు బ్రతుకుకోసం పోరాటంచేస్తారుగానీ, చివరకు ఇద్దరు మాత్రమే ఆ నాజీ నరహంతకుడిని చంపి, తప్పించుకొంటారు, మిగతవారు మరణిస్తారు. కథ ఆరంభంలోనే ఆ బందీలలో ఒకరు ముళ్ల కంచె లోపల నిలబడి, వెలుపలికి చూస్తున్నపుడే అతడు బందీ అని, చిక్కుపడ్డాడనీ మనం గ్రహిస్తాము. ఈ సినిమాలో దర్శకుడు జూమ్ లెన్సును ఉపయోగించి అద్భుతమయిన ఫలితాలు సాధించాడు. బందీ మెడమీద చేపట్టుగొడ వద్ద నిలబడి క్రిందకు చూస్తాడు. అతని ముఖ్యం నుంచి లాంగ్ షాట్ కు జూమ్ చేస్తాడు. మెడ పయన, చివర ఎంత ఎత్తున ప్రమాదకరంగా నిలబడిఉన్నాడో ప్రేక్షకులు గ్రహిస్తారు. ఆల్ఫ్రెడ్ హిచ్. కాక్ జూమ్ శిల్పాన్ని Strangers on train లో కుడా అద్భుతంగా ఉపయోగిస్తాడు. ఈ సినిమా దర్శకుడు అమెండోలా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు కూడా. దాదాపు 30 సినిమాలు తీశాడు.