Jump to content

డయోనియా

వికీపీడియా నుండి

డయోనియా
వీనస్ ఫ్లయ్ ఆకు
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
డయోనియా
Species:
D. muscipula
Binomial name
డియోనియా మస్సిపులా
Sol. ex Ellis (1768)
Venus Flytrap distribution
Synonyms
  • Dionaea corymbosa
    (Raf.) Steud. (1840)
  • Dionaea crinita
    Sol. (1990) nom.superfl.
  • Dionaea dentata
    D'Amato (1998) nom.nud.
  • Dionaea heterodoxa
    D'Amato (1998) nom.nud.
  • Dionaea muscicapa
    St.Hil. (1824) sphalm.typogr.
  • Dionaea sensitiva
    Salisb. (1796)
  • Dionaea sessiliflora
    (auct. non G.Don: Raf.) Steud. (1840)
  • Dionaea uniflora
    (auct. non Willd.: Raf.) Steud. (1840)
  • Drosera corymbosa
    Raf. (1833)
  • Drosera sessiliflora
    auct. non G.Don: Raf. (1833)
  • Drosera uniflora
    auct. non Willd.: Raf. (1833)

డయోనియా (Dionaea) ఒక రకమైన కీటకాహార మొక్క. వ్యావహారిక నామం - వీనస్ ఫ్లైట్రాప్ (శాస్త్రీయ నామం- డయోనియా మస్సిపులా). అమెరికా సంయుక్త రాష్ట్రాల తూర్పు తీరంలో ఉన్న ఉత్తర, దక్షిణ కరోలినాలోని సమశీతోష్ణ, ఉపఉష్ణమండల తడిభూములలో ఉండే మాంసాహార మొక్క.[2]

2005లో, వీనస్ ఫ్లైట్రాప్‌ను ఉత్తర కరోలినా రాష్ట్ర మాంసాహార మొక్కగా పరిగణించారు.[3]

వర్ణన

[మార్చు]
కర్టిస్ బొటానికల్ మ్యాగజైన్ (1746–1799) నుంచి ఒక ఉదాహరణ

వీనస్ ఫ్లైట్రాప్ ఒక చిన్న మొక్క, దీనికి నాలుగు నుండి ఏడు ఆకులు ఉంటాయి.ఇది బల్బ్ లాంటి చిన్న భూగర్భ కాండం నుండి ఉద్భవిస్తుంది. ప్రతి కాండం సంవత్సరంలో మూడు నుండి పది సెంటీమీటర్ల పరిమాణానికి పెరుగుతుంది. పుష్పించిన తర్వాత బలమైన ఉచ్చులతో కూడిన పొడవైన ఆకులు ఏర్పడతాయి.[4] ఏడు కంటే ఎక్కువ ఆకులు కలిగిన ఫ్లైట్రాప్‌లు భూమి దగ్గర రోసెట్టేల (ఆకుల మధ్య ఖాళీలు విస్తరించక పోవడంవలన అన్ని ఆకులు గట్టిగా కలిసి ఒకే ఎత్తులో సమూహంగా) కాలనీలుగా ఉంటాయి.

ఆకు దళం (బ్లేడ్) రెండు విభాగాలుగా ఉంటుంది. ఒక చదునైన, హృదయ ఆకారపు కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం ఉన్న పెటియోల్ (ఆకును మొక్కకు అతికే కాడ), మధ్యభాగంలో కీలుతో అమర్చబడి ఒక జత టెర్మినల్ లోబ్‌లు, ఉచ్చును ఏర్పరుస్తాయి. ఈ లోబ్‌ల ఉపరితలం పై ఎరుపు ఆంథోసైనిన్ వర్ణద్రవ్యాలు ఉంటాయి, ఇంకా దాని అంచులు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ఆహారం ప్రేరేపించినప్పుడు లోబ్‌లు వేగంగా కదిలి, మూసుకుపోతాయి. ప్రతి లోబ్‌ల పై ఉపరితలంపై కనిపించే మూడు వెంట్రుకల లాంటి ట్రైకోమ్‌లలో ఒకదానిని ఎర తాకినప్పుడు ట్రాపింగ్ మెకానిజం మొదలవుతుంది.[5]

ఎర చాలా చిన్నదిగా ఉండి తప్పించుకుంటే, ఉచ్చు సాధారణంగా 12 గంటల్లో తిరిగి తెరుచుకుంటుంది. ఎర ఉచ్చులో తిరుగుతుంటే, అది బిగుతుగా మారుతుంది, జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. నెపెంథెస్, సెఫలోటస్, చాలావరకు హెలియాంఫోరా, డ్రోసిరా వంటి కొన్ని మాంసాహార మొక్కల వలె వీనస్ ఫ్లైట్రాప్‌లు తేమపై ఆధారపడి ఉండవు.

వీనస్ ఫ్లైట్రాప్ ఆకు, కాడల ఆకారం, పొడవులో వైవిధ్యాల ఆధారంగా నాలుగు ప్రధాన రూపాలు ఉన్నాయి. 'టైపికా', అత్యంత సాధారణమైనది. విశాలమైన డెకంబెంట్ పెటియోల్స్‌ తో 2వ రకం- 'ఎరెక్టా' 45-డిగ్రీల కోణంలో ఆకులు ఉండేది 'లీనియరిస్' రకం; 'ఫిలిఫార్మిస్' లో చాలా ఇరుకైన లేదా సరళ పెటియోల్స్‌తో ఉంటాయి.

ఈ మొక్కకు 6 అంగుళాల (15 సెం.మీ.) పొడవున్న కాండం, దాని పైన ఒక పువ్వు కూడా ఉంటుంది. ఈ పువ్వు ద్వారానే తేనెటీగలు (స్వేట్ బీస్), లాంగ్‌హార్న్ బీటిల్స్, చెకర్డ్ బీటిల్స్ వంటి ఎగిరే కీటకాల నుండి పరాగసంపర్కం జరుగుతుంది[6].

యంత్రాంగం

[మార్చు]
ఉచ్చు యంత్రాంగం

డయోనియా దాని ఎరను - ప్రధానంగా కీటకాలు, అరాక్నిడ్‌లను "దవడ" వంటి ఉచ్చు నిర్మాణంతో పట్టుకుంటుంది, ఇది మొక్క ఆకుల చివరి భాగం లో ఏర్పడుతుంది; ఒక కీటకం తెరిచిన ఆకుల దగ్గరకి చేరినప్పుడు వచ్చే కంపనాలు "దవడలు" మూసివేయడానికి ప్రేరేపిస్తాయి. ఒక కీటకం లేదా సాలీడు దీనిలోని వెంట్రుకలలో ఒకదానిని తాకినప్పుడు, ఉచ్చు మూసుకుపోవడానికి సిద్ధమవుతుంది, మొదటి స్పర్శ నుండి (సుమారుగా) ఇరవై సెకన్లలోపు రెండవ వెంట్రుకను తాకినట్లయితే ఎరను పూర్తిగా చుట్టుముడుతుంది. అంటే ప్రారంభ స్పర్శ నుండి సెకనులో 1/10 వంతులో కంపనాలు సంభవించవచ్చు.[7] ఈ యంత్రాంగంలో మొక్క మరో ఐదు ఉద్దీపనలను సక్రియం చేసిన తర్వాత జీర్ణక్రియను ప్రారంభిస్తుంది, ఇది తినడానికి అర్హమైన ప్రత్యక్ష ఎరను పట్టుకుందని నిర్ధారిస్తుంది.

చరిత్ర

[మార్చు]

ఈ మొక్క పేరు (మూలం "వీనస్ ఫ్లైట్రాప్") ప్రేమకు రోమన్ దేవత అయిన వీనస్ ను సూచిస్తుంది. దీని జాతి పేరు డియోనేయా (డియోనే కుమార్తె) గ్రీకు దేవత ఆఫ్రొడైట్. ఈ జాతి పేరు, మస్కిపులా. లాటిన్లో "మౌసెట్రాప్" "ఫ్లైట్రాప్" రెండింటికీ సూచిస్తోంది.[8][9] లాటిన్ పదం musca (fly)|muscamusca (subgenus)" id="mwaA" rel="mw:WikiLink" title="Mus (subgenus)">ముస్ (muscipula) (మౌసెట్రాప్), మస్ (mouse), డెసిపుల (trap) నుండి ఉద్భవించింది. అయితే హోమోనిమ్ పదం మస్కిపులా (flaytrap), ముస్కా (flay), డెసిపులా నుండి ఉద్భవించింది.[10][9]

1759 ఏప్రిల్ 2న, నార్త్ కరోలినా వలస గవర్నర్ ఆర్థర్ డాబ్స్, ఆంగ్ల వృక్షశాస్త్రజ్ఞుడు పీటర్ కాలిన్సన్‌కు ఈ మొక్క గురించి మొదటగా వర్ణిస్తూ లేఖ రాశాడు.[11] ఆ తరువాత జాన్ ఎల్లిస్ 1768 సెప్టెంబరు 1న ది లండన్ మ్యాగజైన్‌కు రాసిన లేఖ లోను, 1768 సెప్టెంబరు 23 న కార్ల్ లిన్నేయస్‌కు రాసిన లేఖలోనూ అతను ఈ మొక్కను వివరించి దానికి ఇంగ్లీషు పేరు 'వీనస్ ఫ్లైట్రాప్' అనీ, శాస్త్రీయ నామం 'డయోనియా మస్సిపులా' అనీ ప్రతిపాదించాడు.[7]

ఉనికి, వ్యాప్తి

[మార్చు]

వీనస్ ఫ్లైట్రాప్ నత్రజని, భాస్వరం లేని వాతావరణంలో, అంటే బురద, తడి నేలలలో కనిపిస్తుంది. ఎత్తులో చిన్నగా నెమ్మదిగా పెరిగే వీనస్ ఫ్లైట్రాప్ మంటలను బాగా తట్టుకుంటుంది[12] ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో దీనిని పెంచినప్పటికీ, ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని ఉత్తర, దక్షిణ కరోలినా తీరప్రాంత చిత్తడి నేలలు వీటికి స్థానికం అని పేర్కొంటారు. ప్రత్యేకంగా ఉత్తర కరోలినాలోని విల్మింగ్టన్ కు 100 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉండే ప్రాంతం దీనికి సహజమైనది. ఉత్తర కరోలినా లోని గ్రీన్ స్వాంప్ అలాంటి ప్రదేశమే.[13]ఉత్తర ఫ్లోరిడాలో, అలాగే పశ్చిమ వాషింగ్టన్‌ లోనూ బాగానే కనిపిస్తాయి.[14] నేల నుండి నత్రజని లభించని కారణాన, ఈ మొక్కలు కీటకాల నుండి నత్రజనిని గ్రహిస్తాయి. ఇవి తేలికపాటి శీతాకాలాలను తట్టుకుంటాయి. ఘనీభవన ఉష్ణోగ్రతలు, వీనస్ ఫ్లైట్రాప్‌లకు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ కాంతి, నీరు, ఆహారం అవసరం కావచ్చు.[13] అవి పూర్తి ఎండలో పెరిగే మొక్కలు. సాధారణంగా 10% కంటే తక్కువ నీడ ఉన్న ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. ఇది గుల్మకాండ మొక్కలు, గడ్డి, స్పాగ్నమ్, అగ్ని-ఆధారిత అరుండినేరియా వెదురులతో పాటు ఉంటాయి.[15]

వీనస్ ఫ్లైట్రాప్ అడవిలో చాలా ప్రత్యేకమైన పరిస్థితులలో మాత్రమే కనిపిస్తుంది. తేమ, ఆమ్ల, పోషకాలు లేని నేల అవసరం. పూర్తి సూర్యరశ్మిలోను, అడవి మంటలలోనూ ఇవి పెరుగుతాయి. వ్యవసాయం, రోడ్డు నిర్మాణం, జీవ వనరుల వినియోగం (వేట, కలప కొట్టే కార్యకలాపాలు), సహజ వ్యవస్థల మార్పులు (పారుదల, కార్చిచ్చుని అణిచివేయడం), కాలుష్యం (ఎరువులు) మొదలైనవాటి వలన వీటి వ్యాప్తి తగ్గుతోంది.[16]

దీనిని అమ్మకానికి విస్తృతంగా సాగు చేస్తున్నప్పటికీ, వీనస్ ఫ్లైట్రాప్ జనాభా వేగంగా తగ్గుతోంది.[17] అమెరికా ఫిష్ & వైల్డ్‌లైఫ్ సర్వీస్ వారు 2017 నాటికి, ఈ జాతిని అంతరించిపోతున్న జాతుల చట్టం సమీక్షలో చేర్చారు.[18]

పెంపకం, ప్రయోజనాలు

[మార్చు]

మొక్కలను విత్తనాల ద్వారా ఉత్పత్తి చేస్తారు, పరిపక్వతకు చేరుకోవడానికి దాదాపు నాలుగు నుండి ఐదు సంవత్సరాలు పడుతుంది. సాధారణంగా, అవి వసంతకాలంలో లేదా వేసవిలో విస్తరిస్తాయి. నర్సరీలు, తోట కేంద్రాలలో ఇంట్లో పెంచే మొక్కలుగా అమ్మకానికి లభిస్తాయి. సరైన పరిస్థితులలో సాగు చేస్తే మొక్కలు 20 నుండి 30 సంవత్సరాలు జీవిస్తాయి.[19]అడవిలో డి.మస్సిపులా మొక్కల జనాభాలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. 1979 లో 93% తగ్గిందని అంచనా. జన్యు ఉత్పరివర్తనాల ద్వారా జరుగుతున్న వివిధ సాగులు, సాగు చేసిన రకాలు వాణిజ్యమొక్కలుగా పెద్ద పరిమాణంలో పెంచుతున్నారు. 'అకై ర్యు' ('Akai Ryu'), 'సౌత్ వెస్ట్ జెయింట్' సాగులు రాయల్ హార్టికల్చరల్ సొసైటీ యొక్క గార్డెన్ మెరిట్ అవార్డును పొందాయి.[20]

వీనస్ ఫ్లైట్రాప్ సారం (extract) మార్కెట్లో మూలికా ఔషధంగా లభిస్తుంది. "కార్నివోరా" అనే పేటెంట్ పొందిన ఔషధంలో ఇది ప్రధాన పదార్ధం. అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలు మద్దతు ఇవ్వనప్పటికీ,అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఈ ఉత్పత్తులను ప్రత్యామ్నాయ వైద్యంలో HIV, క్రోన్'స్ వ్యాధి చర్మ క్యాన్సర్‌తో సహా వివిధ రకాల మానవ వ్యాధులకు చికిత్సగా పేర్కొంటోంది.[21]

మూలాలు

[మార్చు]
  1. Schnell, D., Catling, P., Folkerts, G., Frost, C., Gardner, R., et al. (2000). Dionaea muscipula. 2006. IUCN Red List of Threatened Species. IUCN 2006. www.iucnredlist.org. Retrieved on 11 May 2006. Listed as Vulnerable (VU A1acd, B1+2c v2.3)
  2. "Dionaea muscipula J.Ellis". Plants of the World Online. Royal Botanic Gardens, Kew. 2023. Retrieved 30 October 2023.
  3. Darwin, Charles (2004-05-01). Insectivorous Plants.
  4. "Venus flytraps". The Carnivorous Plant FAQ. Retrieved 13 June 2005.
  5. Raven, Peter H.; Evert, Ray Franklin; Eichhorn, Susan E. (2005). Biology of Plants (7th ed.). W.H. Freeman and Company. ISBN 978-0-7167-1007-3.
  6. Guarino, Ben (7 February 2018). "Venus flytraps give insects that pollinate their flowers a break. They don't eat them". Washington Post (in ఇంగ్లీష్). Retrieved 2 August 2020.
  7. 7.0 7.1 Donaldson, John William (1852). Varronianus: A Critical and Historical Introduction to the Ethnography of Ancient Italy and to the Philological Study of the Latin Language (in ఇంగ్లీష్). J. W. Parker & Son. pp. 431. cipula.
  8. "Background Information on Venus Fly Traps – Venus Fly Trap naming and history". FlyTrapCare.com. 4 April 2008. Archived from the original on 17 December 2008.
  9. 9.0 9.1 Ellis, John (1768). The London Magazine, Or, Gentleman's Monthly Intelligencer (in ఇంగ్లీష్). Vol. October 1768. R. Baldwin. p. 523.
  10. Wase, Christopher (1662). Dictionarium Minus: A Compendious Dictionary English-Latin and Latin-English (in ఇంగ్లీష్). Maxwell.
  11. Ellis, John (1768). The London Magazine, Or, Gentleman's Monthly Intelligencer (in ఇంగ్లీష్). Vol. October 1768. R. Baldwin. p. 523.
  12. W. Schulze; E.D. Schulze; I. Schulze & R. Oren (2001). "Quantification of insect nitrogen utilization by the Venus flytrap Dionaea muscipula catching prey with highly variable isotope signatures". Journal of Experimental Botany. 52 (358): 1041–1049. doi:10.1093/jexbot/52.358.1041. PMID 11432920.
  13. 13.0 13.1 Darwin, Charles (2004-05-01). Insectivorous Plants.
  14. Schnell, D. E. (2002). Carnivorous Plants of the United States and Canada (2nd ed.). Timber Press. ISBN 978-0-88192-540-1.
  15. Waller, Donald (21 October 2016). "Petition to list the Venus flytrap (Dionaea muscipula Ellis) as Endangered under the 1973 Endangered Species Act". USFWS. Retrieved 14 December 2019.
  16. Darwin, Charles (2004-05-01). Insectivorous Plants.
  17. Waller, Donald (21 October 2016). "Petition to list the Venus flytrap (Dionaea muscipula Ellis) as Endangered under the 1973 Endangered Species Act". USFWS. Retrieved 14 December 2019.
  18. "Venus Flytrap: Under Endangered Species Act review" (PDF). U.S. Fish & Wildlife Service. June 2017. Archived from the original (PDF) on 6 October 2019. Retrieved 15 December 2019.
  19. D'Amato, Peter (1998). The Savage Garden: Cultivating Carnivorous Plants. Berkeley, California: Ten Speed Press. ISBN 978-0-89815-915-8.
  20. Darwin, Charles (2004-05-01). Insectivorous Plants.
  21. Darwin, Charles (2004-05-01). Insectivorous Plants.
"https://te.wikipedia.org/w/index.php?title=డయోనియా&oldid=4711617" నుండి వెలికితీశారు