Jump to content

డిజిటల్ మార్కెటింగ్

వికీపీడియా నుండి

డిజిటల్ మార్కెటింగ్, అంకాత్మక (డిజిటల్) అంగడింపు/విపణీకరణ (మార్కెటింగ్) అని తెలుగులో పిలవబడే ఈ అంగడింపు చర్య, అంకాత్మక యంత్రాలతో, సాధనాలతో, అంతర్జాలాన్ని ఉపయోగించి చేసేదిగా పేర్కొనవచ్చు. ఆధునిక అంగడింపు పద్ధతులలో అత్యంత ప్రాచుర్యం పొందిన అంగడింపు విధానంగా గుర్తించవచ్చు. 1990 లలో మొదటి సారిగా వాడబడి, కాలక్రమేణా, అంతర్జాల విస్తరణ వల్ల కలిగిన మార్పులతో, నేడు అంగడింపు అంటేనే అంకాత్మక అంగడింపు అనే స్థాయికి చేరుకుంది. మొన్న మొన్నటి వరకూ అంగడింపు పద్ధతులలో సాంప్రదాయిక అంగడింపుకే పెద్దపీట వేసిన ఎన్నో బాహురాష్ట్రీయ సంస్థలు కూడా అంకాత్మక అంగడింపును విస్మరించలేని పరిస్థితి ఈనాడు నెలకొని ఉంది.

గూగుల్ ఎన్ గ్రాం వీక్షకి - డిజిటల్ మార్కెటింగ్ పదం

ఈ ప్రక్కన చేర్చిన చిత్రంలో గూగుల్ బుక్స్ వారి ఎన్ గ్రాం వీక్షకి ని ఉపయోగించగా 1990 నుంచి 2019 వ సంవత్సరం వరకూ ప్రచురితమైన పుస్తకాలూ, దినపత్రికలూ, మాసపత్రికలలో డిజిటల్ మార్కెటింగ్ అనే వాక్యం ఎన్నిసార్లు వాడబడిందో చూపే గ్రాఫు ని మనం చూడవచ్చు. 1990 లలో అతి కొద్ది వాడకం నుంచి 2010 నుంచి అంచెలంచెలు గా ఎదిగిన వాడుక ధోరణిని మనం చూడవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ - నిర్వచనం

[మార్చు]

అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్వీరు అంకాత్మక అంగడింపును ఈ క్రింది విధంగా నిర్వచించారు.

ఏదైనా ఒక రూపులో సంగణకాన్ని (కంప్యూటరును) వాడి నిర్వహించే అంగడింపు చర్యలను అంకాత్మక అంగడింపుగా భావించవచ్చు. అంతర్జాలంలో చేసే అంగడింపును ఇందులో ఒక భాగంగా పరిగణించవచ్చు. అంకాత్మక అంగడింపును నిర్వహించటానికి సంస్థలు, వెబ్సైట్లను, సర్చ్ ఇంజిన్ లను, బ్లాగులను, సామాజిక మాధ్యమాలను (సోషల్ మీడియా), వీడియో లను, ఈమెయిల్ ను, ఇంకా ఇతర వాహకాలను (ఛానెల్స్) వాడుకోవచ్చు.[1]

నీల్ పటేల్ అనే అంకాత్మక అంగడింపు నిపుణుడు డిజిటల్ మార్కెటింగ్ ను ఈ క్రింది విధంగా నిర్వచించారు.

అంకాత్మక వాహకాల ద్వారా, అంటే, సామాజిక మాధ్యమాలు, సర్చ్ ఇంజిన్లు, ఈమెయిల్ లు, మొబైల్ యాప్ ల ద్వారా, వ్యాపార ఉత్పత్తులను, సేవలను వృద్ధి చేసుకోవటానికి చేపట్టే చర్యలను, కార్యకలాపాలనూ అంకాత్మక అంగడింపుగా భావించవచ్చు.[2]

డిజిటల్ మార్కెటింగ్ యొక్క పరిణామక్రమము

[మార్చు]

అంకాత్మక అంగడింపు లోని మార్పు చేర్పులు గత మూడు దశాబ్దాలుగా అంకాత్మక యంత్రాలు, అంతర్జాలపు పరిణామక్రమాన్ని అనుసరించి జరుగుతున్నాయి. సంగణకాలు (కంప్యూటర్లు), తత్సంబంధిత సాంకేతిక పరిజ్ఞానము వృద్ధి చెంది, ప్రవర్తనా శక్తి (ప్రాసెసింగ్ పవర్) పెరుగుతూ, ఖర్చులు తగ్గుతూ రావటం మూలాన, అధికమైన ప్రజాదరణా, వాడుకా లభించాయి. 2019 నాటికి ప్రపంచం మొత్తంలో 47.1% గృహాలు సంగణక యంత్రాలను వాడుతున్నారని స్టాటిస్తా సంస్థవారు ప్రచురించిన దత్తాంశాల ద్వారా తెలుస్తోంది.[3]

అంకాత్మక అంగడింపు పరిణామక్రమం
అంకాత్మక అంగడింపు పరిణామక్రమం

మొబైల్ ఫోనుల ఆవిష్కరణానంతరం, అవి స్మార్ట్ ఫోన్లుగా పరివర్తనం చెంది, సంగణక యంత్రాలకు దీటుగా పెరుగుదలను చూపించాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 710 కోట్ల మొబైల్ వినియోగదారులు ఉండగా, 2025 నాటికి ఈ సంఖ్య 749 కోట్లకు పెరగవచ్చని అంచనా.[4]

దీనితోపాటు, 1970 వ దశకం లో ప్రారంభమైన అంతర్జాలం యొక్క అనూహ్యమైన పెరుగుదల కూడా అంకాత్మక అంగడింపు వ్యవహారాలను ఉత్తేజపరుస్తూ వచ్చింది. 2020 నాటికి ప్రపంచంలోని అరవై శాతం జనాభా అంతర్జాలాన్ని వాడుతున్నట్టు వర్ల్డ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి.[5] మొట్టమొదటి సారిగా 1996 లో ఫిన్లాండ్ దేశం లో నోకియా ఫోనులో అంతర్జాలాన్ని వాడుకునే సౌలభ్యం కల్పించారు. తరువాత ఎన్. టి. టి డోకొమొ అనే జపాను సంస్థ ఐ-మోడ్ అనే పేరుతో మొబైల్ ఫోనులో అంతర్జాల వాడుక సేవలను విరివిగా అందించసాగారు.[6]

ఈ పరిణామాలను అనుసరించి, రాను రాను, సెర్చ్ ఇంజిన్లు పుంజుకోసాగాయి. సామాజిక మాధ్యమాల అవతరణతో అంతర్జాలం మరింత శక్తివంతమైన మాధ్యమంగా తయారవసాగింది. 1994 లో అంతర్జాలంలో మొదటి బ్యానర్ ప్రకటన విడుదలై సంచలనం సృష్టించిండి.[7] అప్పటి నుంచి అంతర్జాల విస్తరణ, అంకాత్మక యంత్రాల ఆవిష్కార పరంపరను అనుసరించి అంకాత్మక అంగడింపు మెరుగులు దిద్దుకుంటూనే ఉంది. ఈ పైన ఇచ్చిన చిత్రం ఈ పరిణామక్రమాన్ని తెలుపుతున్నది.

డిజిటల్ మార్కెటింగ్ లోని విభాగాలు

[మార్చు]

సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్

[మార్చు]
సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏమిటి?
[మార్చు]

సర్చ్ ఇంజిన్లు లేదా శోధనా సాధనాలలో తమ దృశ్యతను పెంచి, తద్వారా తమ వినియోజకాలను, ఉత్పత్తులను, సేవలను ఉన్నతీకరించటాన్ని సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ గా పేర్కొనవచ్చు. తమ వినియోజకాల యొక్క సమాచారాన్ని పొందు పరచిన వెబ్ సైటుకు వినియోగదారుల రాకపోకలు (ట్రాఫిక్) పెంచటమే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ యొక్క లక్ష్యం.[8]

సర్చ్ ఇంజిన్ల ఆవిర్భావం, పరిణితి
[మార్చు]

పరిమిత సంఖ్యలో సంగణకాలను జాలాకార వ్యవస్థలో (నెట్వర్క్) కలిపటంతో మొదలైన అంతర్జాల చరిత్ర, ఎన్నో ప్రమాణాలు (స్టాండర్డ్స్), సాంకేతిక ముందడుగులతో ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, శక్తివంతమైన సమాచార వేదికగా పరిణితి చెందింది. ప్రస్తుతం 1,981,678,665 (నూట తొంభై ఎనిమిది కోట్ల, పదహారు లక్షల, డెబ్భై ఎనిమిది వేల ఆరువందల అరవై ఐదు) కు పైగా వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి.[9] ఈ సంఖ్య ప్రతి క్షణం ఎక్కుతూ ఉంటుంది.

ఈ సమాచారాన్ని శోధించి, వడపోసి, కావలసిన పేజీలను చూపించటానికి శోధనా సాధనాలు లేదా సర్చ్ ఇంజిన్ లు వచ్చాయి. లక్షల కొద్దీ పేజీలను ఆపోశన పట్టి, వాటి సమాచారాన్ని క్రోడీకరించి, వినియోగదారుల సంకేత శబ్దాలను (కీవర్డ్స్) ను అనుసరించి వారికి కావలసిన పేజీలను ఉపయుక్త క్రమానుసారం (ఆర్డర్ ఆఫ్ రిలవెన్స్) అమర్చి చూపగల లక్షణాలను ఈ శోధనా సాధనాలు సమకూర్చుకున్నాయి.

మొట్టమొదట మానవ నిర్మిత సాధారణ జాబితాలుగా మొదలైన సర్చ్ ఇంజిన్లు, యాహూ సంస్థ ఆవిష్కరించిన వెబ్ క్రాలర్ అల్గారిథం సహాయంతో స్వయంచలిత సాధనాలుగా పరిణితి చెందాయి. 1996 లో లారీ పేజ్, సెర్జీ బ్రిన్ లు బ్యాక్ లింకుల సంఖ్య ద్వారా వెబ్ సైట్లలో పొందుపరచిన సమాచారపు ప్రమాణాన్ని (అథారిటీ) శ్రేణీకరించడానికి (ర్యాంకింగ్) ఒక అల్గారిథం ను కనుగొన్నారు.[10] ఇది సర్చ్ ఇంజిన్ల రూపు రేఖలనే మార్చి వేసింది.

తమకు కావలసిన సమాచారం రాబట్టుకోవటానికి అంతర్జాల వినియోగదారులు శోధనా సాధనాల పై ఆధారపడటం మొదలుపెట్టారు. తద్వారా సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కు అంకురార్పణ జరిగింది.

సహజ, చెల్లింపు పద్ధతులు
[మార్చు]

వినియోగదారుల శోధనా ప్రశ్నలను, పదాలను విశ్లేషించి, తత్సంబంధిత సమాచారం వెబ్ సైటు లో పొందుపరచి, సర్చ్ ఇంజిన్లకు తమ ఉపయుక్తాన్ని (రిలవెన్స్) సూచించటం ద్వారా వెబ్ సైటు రాకపోకలను వృద్ధి పరచుకోవటాన్ని సహజ పధ్ధతి అని చెప్పుకోవచ్చు. అలా కాక సర్చ్ ఇంజిన్ సంస్థలకు కొంత పైకం చెల్లించి, ప్రకటనల ద్వారా వెబ్ సైటు రాకపోకలను వృద్ధి పరచుకోవటాన్ని చెల్లింపు పద్ధతి అని గుర్తించవచ్చు.

సహజ పద్ధతులను అనుసరించి వెబ్ సైటు రాకపోకలను వృద్ధి పరచుకోవటాన్ని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని కూడా అంటారు.

ఈమెయిల్ మార్కెటింగ్

[మార్చు]
ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?
[మార్చు]

వినియోగదారులకు మన సంస్థ యొక్క ఉత్పత్తులనూ, సేవలనూ ఈమెయిల్ ద్వారా పరిచయం చేసి, వాటి ప్రాచుర్యాన్ని పెంపొందించడం ద్వారా ఉత్పత్తుల, సేవల కొనుగోళ్లను వృద్ధి చేసుకునే ప్రయత్నాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అని పేర్కొనవచ్చు.[11]

ఈమెయిల్ మార్కెటింగ్ ఆవిర్భావం
[మార్చు]

1972 లో రే టామ్లిన్సన్ మొట్టమొదట ఈమెయిల్ కనిపెట్టినప్పుడు, సంగణకాల ద్వారా ఉభయకుశలోపరికి శ్రీకారం చుట్టారు. అదే సంవత్సరంలో ఈమెయిళ్లను సక్రమంగా వాడుకోవటానికి కావలసిన వ్యవస్థ ఏర్పాటైంది. 1978 లో మొట్టమొదటి ఈమెయిల్ బ్లాస్ట్ (టోకున ఎంతోమండికి ఈమెయిల్ పంపించడం) పంపించడం జరిగింది.[12] అప్పటినుంచి ఈమెయిల్ ద్వారా అంగడింపు చర్యలకు పునాది పడింది.

ఈమెయిల్ లో పదాలు, వాక్యాలతో పాటు చిత్రాలు, లంకెలు, దృశ్యకాలు (వీడియోలు) కూడా జోడించటానికి నేడు వీలున్నది. కాబట్టి ఇదొక శక్తివంతమైన అంకాత్మక అంగడింపు సాధనంగా తయారైంది.

ఈమైల్ యాంత్రికీకరణం (ఆటోమేషన్)
[మార్చు]

వినియోగదారుల ఈమెయిల్ జాబితాలను తయారు చేసుకుని, వారికి పంపిన ఈమెయిళ్ళ దత్తాంశాల ఆధారంగా వారికి వేర్వేరు ఈమెయిళ్లను పంపుతూ ఉత్పత్తుల, సేవల కొనుగోళ్ల దిశగా వారిని ప్రేరేపించడానికి ఈమెయిల్ యాంత్రికీకరణను వాడుకోవచ్చు.

ఈ యాంత్రికీకారణ ద్వారా ఎవరు ఈమెయిల్ ను తెరిచారో, ఎవరు లంకెలను ఒత్తారో తెలుసుకుంటూ, ఈ చర్యల ఆధారంగా, వ్యక్తీకరింపబడిన ఈమెయిళ్లను పంపుతూ, అత్యంత లాఘవమైన అంగడింపు చర్యలను చేపట్టవచ్చు.

సోషల్ మీడియా మార్కెటింగ్

[మార్చు]

సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏమిటి?

సామాజిక మాధ్యమాలను, ఉదాహరణకు, ఫేస్ బుక్, లింక్డ్ఇన్, ట్విటర్, పిన్టరస్ట్, ఇన్స్టాగ్రాం, లాంటి వేదికలను ఉపయోగించుకుని మన సంస్థ యొక్క ఉత్పత్తులను, సేవలను వృద్ధి పరచుకోవటాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అని పేర్కొనవచ్చు.

సోషల్ మీడియా యొక్క ప్రాబల్యం

కంటెంట్ మార్కెటింగ్

[మార్చు]

డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేస్తారు

[మార్చు]

అధిక స్థాయిలో, డిజిటల్ మార్కెటింగ్ అనేది సెర్చ్ ఇంజన్లు, ఇమెయిల్, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, మొబైల్ అనువర్తనాలు వంటి డిజిటల్ ఛానెల్‌ల ద్వారా అందించే ప్రకటనలను సూచిస్తుంది. ఈ ఆన్‌లైన్ మీడియా ఛానెల్‌లను ఉపయోగించి , సేవలు, కంపెనీలు వస్తువులుమరియు బ్రాండ్‌లను కంపెనీలు ఆమోదించే పద్ధతి డిజిటల్ మార్కెటింగ్. ఉత్పత్తులను పరిశోధించడానికి వినియోగదారులు డిజిటల్ మార్గాలపై ఎక్కువగా ఆధారపడతారు.[13]

ఆధునిక డిజిటల్ మార్కెటింగ్ అనేది చానెల్స్ యొక్క అపారమైన వ్యవస్థ అయితే, విక్రయదారులు తమ బ్రాండ్‌లను ఆన్‌బోర్డ్ చేయాలి, ఆన్‌లైన్‌లో ప్రకటనలు కేవలం ఛానెల్‌ల కంటే చాలా క్లిష్టంగా ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ యొక్క నిజమైన సామర్థ్యాన్ని సాధించడానికి, ఎంగేజ్‌మెంట్ మార్కెటింగ్ ద్వారా ప్రభావం చూపే వ్యూహాలను కనుగొనడానికి విక్రయదారులు నేటి విస్తారమైన, క్లిష్టమైన క్రాస్-ఛానల్ ప్రపంచాన్ని లోతుగా తీయాలి. ఎంగేజ్‌మెంట్ మార్కెటింగ్ అనేది కాలక్రమేణా మీరు సేకరించిన డేటా ఆధారంగా సంభావ్య, తిరిగి వచ్చే కస్టమర్‌లతో అర్ధవంతమైన పరస్పర చర్యలను రూపొందించే పద్ధతి. కస్టమర్లను డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో నిమగ్నం చేయడం ద్వారా, మీరు బ్రాండ్ అవగాహనను పెంచుకుంటారు.


ఓమ్నిచానెల్ డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా, కస్టమర్ నిశ్చితార్థం యొక్క కొత్త పద్ధతులకు తలుపులు తెరిచేటప్పుడు విక్రయదారులు లక్ష్య ప్రేక్షకుల ప్రవర్తనలపై విలువైన అవగాహనలను సేకరించవచ్చు. అదనంగా, కంపెనీలు నిలుపుదల పెరుగుదలను చూడవచ్చు.


డిజిటల్ మార్కెటింగ్ యొక్క భవిష్యత్తు విషయానికొస్తే, వినియోగదారులకు అందుబాటులో ఉన్న వివిధ రకాల ధరించగలిగే పరికరాల పెరుగుదలను మనం చూడవచ్చు. సోషల్ మీడియా బి 2 బి ప్రదేశంలో సంభాషణాత్మకంగా మారుతుందని.

“ఈ రోజు మార్కెటింగ్‌లో ప్రతిదానికీ డిజిటల్ ప్రధానమైనది - ఇది‘ మార్కెటింగ్ చేసే పనుల్లో ఒకటి ’నుండి‘ మార్కెటింగ్ చేసే పనికి ’చేరుకుంది.”

మూలాలు

[మార్చు]
  1. Young, Megan. "What is Digital Marketing?". American Marketing Association (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-09-07.
  2. "What Is Digital Marketing?". Neil Patel (in ఇంగ్లీష్). Retrieved 2022-09-07.
  3. "Share of households with a computer worldwide 2005-2019". Statista (in ఇంగ్లీష్). Retrieved 2022-09-07.
  4. "Forecast number of mobile users worldwide 2020-2025". Statista (in ఇంగ్లీష్). Retrieved 2022-09-07.
  5. "Individuals using the Internet (% of population) | Data". data.worldbank.org. Retrieved 2022-09-07.
  6. "15 fantastic firsts on the Internet - Pingdom". pingdom.com (in ఇంగ్లీష్). Retrieved 2022-09-07.
  7. LaFrance, Adrienne (2017-04-21). "The First-Ever Banner Ad on the Web". The Atlantic (in ఇంగ్లీష్). Retrieved 2022-09-07.
  8. Widmer, Bill (2022-04-13). "What Is Search Engine Marketing? Beginner's Guide". SEO Blog by Ahrefs (in ఇంగ్లీష్). Retrieved 2022-09-08.
  9. "Total number of Websites - Internet Live Stats". www.internetlivestats.com (in ఇంగ్లీష్). Retrieved 2022-09-08.
  10. Rose, Charlie (2018-04-09). "The Complete History of Search Engines". SEO Mechanic (in ఇంగ్లీష్). Retrieved 2022-09-08.
  11. "What is Email Marketing? Definition and Advantages". Mailchimp (in ఇంగ్లీష్). Retrieved 2022-09-13.
  12. "The history of email marketing (infographic)". Brafton (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-09. Retrieved 2022-09-13.
  13. "Digital Marketing Definition from Financial Times Lexicon". web.archive.org. 2017-11-29. Archived from the original on 2017-11-29. Retrieved 2021-08-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)