Jump to content

డి.ఎల్.నారాయణ

వికీపీడియా నుండి

డిఎల్ నారాయణ (1914-1975) గా సుపరిచితుడైన ద్రోణావజుల లక్ష్మీనారాయణ తెలుగు సినిమా నిర్మాత.[1] తన 35 సంవత్సరాల సినీ జీవితంలో ఆయన 11 చిత్రాలను నిర్మించాడు. దేవదాసు, కన్యాశుల్కం, ఏకవీర సినిమాలు అతను నిర్మించిన అత్యుత్తమ క్లాసిక్ సినిమాలుగా పరిగణించబడతాయి. చిరంజీవిలు, దొంగల్లో దొర, దొరికితే దొంగలు ఆయన నిర్మించిన మరికొన్ని సినిమాలు.[2]

అతను కన్యాశుల్కం,ఏకవీర లాంటి చిత్రాల నిర్మాత. కడారు నాగభూషణం ,కన్నాంబల ఆదరణ పొందాడు. భరణి సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు. వేదాంతం రాఘవయ్య, సుబ్బరామన్, సముద్రాల సీనియర్ లతో కలిసి వినోదా సంస్థను ప్రారంబించి దేవదాసు సినిమా తీశాడు. జమున గారి పెళ్లి పెద్దగా వ్యవహరించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అతని భార్య నాంచారమ్మ. అతను బందరు కు చెందినవాడు. అతను 1975లో మరణిస్తే- అంత్యక్రియలు జరపడానికి దగ్గరవారు రావడానికి ఆలస్యం కాగా, రమణరావుగారు (జమున భర్త) ఆ కర్మకాండ నిర్వహించారు.

సినిమాలు

[మార్చు]
  • స్త్రీ సాహసం (1951).తొలి చిత్రం
  • శాంతి (1952),
  • దేవదాసు (1953),[3]
  • కన్యాశుల్కం (1954) చిత్రాలు తీశారు. తర్వాత, తానుగా చందమామ పేరుతో కంపెనీ పెట్టి
  • చిరంజీవులు (1956),
  • దొంగల్లో దొర (1957),
  • సిపాయి కూతురు (1959) చిత్రాలు నిర్మించారు డి.ఎల్‌.

మూలాలు

[మార్చు]
  1. "" Devadasu" (old)Producer blessings for Superstar Krishna!". Cinemacinemacinema (in ఇంగ్లీష్). 2016-06-09. Retrieved 2025-04-14.
  2. Development, PodBean. "Classic films producer DL Narayana - అభిరుచి గల నిర్మాత డి.ఎల్.నారాయణ | KiranPrabha Telugu Talk Shows". kiranprabha.podbean.com (in ఇంగ్లీష్). Retrieved 2025-04-14.
  3. "Devadasu (1953)". The Hindu (in Indian English). 2013-12-14. ISSN 0971-751X. Retrieved 2025-04-14.

బాహ్య లంకెలు

[మార్చు]