డీకే చదువుల బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రముఖ రచయిత డీకే చదువుల బాబుకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం దక్కింది[1]. కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారాలు - 2023 ను జూన్ 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది[2]. తెలుగుకు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారాన్ని డీకే చదువుల బాబు చిరు కథల పుస్తకం ' వజ్రాల వాన ' దక్కించుకుంది[3]. చదువుల బాబు వైయస్సార్ జిల్లా పెద్ద పసుపుల గ్రామంలో 1967 సంవత్సరం జూన్ ఒకటో తేదీన జన్మించారు. ఈయన ప్రస్తుతం కమలాపురం మండలం పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా ఆయన ఎన్నో చిరు కథలు, నవలలు రాశారు. 2003 సంవత్సరంలోనే ' బాలల కథలు' సంపుటిని వెలువరించారు.

మాలలు :

  1. "ఇద్దరికి సాహిత్య అకాడమీ పురస్కారాలు". Prajasakti (in ఇంగ్లీష్). Archived from the original on 2023-09-01. Retrieved 2023-09-02.
  2. telugu, NT News (2023-06-24). "సుధామూర్తికి బాల సాహిత్య పురస్కారం". www.ntnews.com. Retrieved 2023-09-02.
  3. "వైయస్సార్‌ జిల్లాను వరించిన సాహిత్య అకాడమీ అవార్డులు". EENADU. Retrieved 2023-09-02.