డీవీడీ ప్లేయర్
స్వరూపం
డీవీడీ ప్లేయర్ అనేది డీవీడీలు లేదా డిజిటల్ వీడియో డిస్కులను ప్లే చేసే ఒక పరికరం. డీవీడీ ప్లేయర్ ప్రజలు స్వంతంగా కలిగి ఉండే అత్యంత సాధారణ వినోదాంశాలలోని ఒకటి. ఇది ప్రజలు ఇంట్లో సినిమాలు చూడటానికి అత్యంత సాధారణ మార్గం. మొట్టమొదటి DVD ప్లేయర్‌ను సోనీ, పసిఫిక్ డిజిటల్ కంపెనీ సృష్టించింది, దీనిని నవంబర్ 1, 1996 న జపాన్‌లో విడుదల చేసారు. DVD ప్లేయర్ తరువాత మార్చి 19, 1997 న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదల చేయబడింది. డీవీడీ ప్లేయర్‌లో వీడియోలు, ఆడియోలు, ఫోటోలు, అనేక ఇతర డిజిటల్ ఫైళ్ళను ప్లే చేయుటకు నేడు ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌ను, సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేయుటకు డీవీడీ ప్లేయర్ ను ఉపయోగిస్తారు.
ప్రస్తుతం 4K క్వాలిటీ వీడియోల్ని ప్రదర్శించగలిగే బ్లూ రే డీవీడీ ప్లేయర్లు అందుబాటులోకి వచ్చాయి.[1]
మూలాలు
[మార్చు]- ↑ "టాప్ 10 బ్లూ-రే డీవీడీ ప్లేయర్లు ఇవే!". andhrajyothy.com/telugunews/top-10-blu-ray-dvds-2020022604225392. Archived from the original on 2023-03-08.