Jump to content

డేటింగ్

వికీపీడియా నుండి
బీచ్ వద్ద ఒక జపనీస్ జంట

డేటింగ్ (Dating) అనగా శృంగార సంబంధమును కోరుకుంటూ ఇద్దరు వ్యక్తులు కలిసి బయట తిరిగేందుకు వెళ్ళడం. వివాహం చేసుకోవాలనుకున్న ఇద్దరూ, తాము భాగస్వాములుగా ఉండగలుగుతామ?అనుకూలంగా ఉండగలుగుతామా ?అని తెలుసుకునే లక్ష్యంతో ఈ డేటింగ్ చేస్తారు. కలిసి సినిమాకు వెళ్ళడం. రెస్టారెంటు వెళ్ళడం వంటి వాటి వలన అప్పుడు వారి ప్రవర్తనను బట్టి ఒకరిపై ఒకరికి అవగాహన పెరుగుతుంది. ఒకరికొకరు ఎలా ఉండాలో ఈ సమయంలో వీరు తెలుసుకుంటారు.[1] వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి ఈ డేటింగ్ పద్ధతి సరియైన పద్ధతి కాదని, ఈ పద్ధతి చెడు ఫలితాలను ఇచ్చే విధంగా ఉందని, సాంఘిక సంక్షేమ సంరక్షకులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే వ్యక్తులు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా తమ గురించి ఇతరుల గురించి తమ అవగాహనను విస్తరించుకోవడం ద్వారా డేటింగ్ వ్యక్తిగత వృద్ధికి ఒక రూపంగా కూడా పనిచేస్తుందని మానసిక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.[2]

డేటింగ్ అనేది పాశ్చాత్య దేశాల్లో పురుషుడు, స్త్రీ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రేమ సంబంధాలను కొనసాగించడం. భవిష్యత్తులో జరిగే సన్నిహిత సంబంధంలో భాగస్వామిగా ఒకరి అనుకూలతను మరొకరు అంచనా వేసుకునే ఉద్దేశ్యంతో ఇది తరచుగా జరుగుతుంది. ఇది కోర్ట్‌షిప్ (Courtship) కోవ లోకి వస్తుంది. ఇందులో జంట ఒంటరిగా లేదా ఇతరులతో చేపట్టే సామాజిక కార్యక్రమాలు ఉంటాయి.

అయితే, కోర్ట్‌షిప్ అనేది ఒక జంట వివాహం చేసుకునే ఉద్దేశ్యంతో ప్రేమగా ఉండి. ఒకరినొకరు తెలుసుకునే కాలం. ఇది డేటింగ్‌కు భిన్నమైనది. ఎందుకంటే దీని ప్రధాన లక్ష్యం వివాహం చేసుకోవడం. ఈ కాలంలో భాగస్వాములు తమ దీర్ఘకాలిక లక్ష్యాలు, నమ్మకాలు, విలువలు ఒకేలా ఉన్నాయా? అని అంచనా వేసుకుంటారు.

డేటింగ్ రూపాలు

[మార్చు]

డేటింగ్ అనే పదం అనేక భావనలను సూచిస్తుంది. అలాగే, డేటింగ్ రోజురోజుకు విభిన్న రూపాలను సంతరించుకుంటోంది.[3][4] ట్రడిషనల్ డేటింగ్, ఆన్‌లైన్ డేటింగ్, లాంగ్-డిస్టెన్స్ డేటింగ్, ఇంటెన్షనల్ డేటింగ్.. ఇలా పలురకాలుగా డేటింగ్ ఉంటుంది. వీటిన్నటికి భిన్నంగా మాస్టర్‌ డేటింగ్‌ని చూడవచ్చు. ఈ సోలో డేటింగ్‌ లో భాగస్వామితో పని లేదు. ఒంటరిగా నచ్చిన చోటికి వెళ్లవచ్చు, నచ్చినట్లుగా ఉండవచ్చు, దీనివల్ల స్వీయ ప్రేమ పెరుగుతుంది. శాశ్వత వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముందు ఇలా స్వీయ ప్రేమను పెంచుకోవడంవల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలొచ్చినా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలిగే శక్తి ఉంటుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "'Lao wai' speak out on false image in China". China Daily. 2004-02-06. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2010-12-09.
  2. Sternberg, Robert J.; Sternberg, Karin, eds. (2019). The new psychology of love (2nd ed.). Cambridge, United Kingdom ; New York, NY: Cambridge University Press. ISBN 978-1-108-47568-6.
  3. Cate, R.M.; Lloyd, S.A. (June 22, 1992). Courtship. Newbury Park, CA: Sage. ISBN 978-0803937086.
  4. Error on call to Template:cite paper: Parameter title must be specified
  5. "Master Dating: ఈ ప్రేమ ఎంతో ప్రత్యేకం". EENADU. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-03.
"https://te.wikipedia.org/w/index.php?title=డేటింగ్&oldid=4799083" నుండి వెలికితీశారు