Jump to content

డేనియల్ నొబోవా

వికీపీడియా నుండి
డేనియల్ నొబోవా
2025లో నొబోవా
48వ ఈక్వడార్ అధ్యక్షుడు
Assumed office
2023 నవంబరు 23
Vice President
  • వెరోనికా అబాద్ రోజాస్ (2023–2025)
  • మారియా జోస్ పింటో (2025–ప్రస్తుతం)
అంతకు ముందు వారుగిల్మెర్ లాసో
శాంటా ఎలెనా నుండి నేషనల్ అసెంబ్లీ సభ్యుడు
In office
2021 మే 14 – 2023 మే 17
వ్యక్తిగత వివరాలు
జననం
డేనియల్ రాయ్ గిల్క్రిస్ట్ నోబోవా అజిన్

(1987-11-30) 1987 నవంబరు 30 (వయసు: 38)
మయామి, ఫ్లోరిడా, అమెరికా
పౌరసత్వం
రాజకీయ పార్టీనేషనల్ డెమోక్రాటిక్ యాక్షన్ (2022 నుండి)
ఇతర రాజకీయ
పదవులు
యునైటెడ్ ఇక్వెడారియన్
(2022కి ముందు)
జీవిత భాగస్వామి
  • గాబ్రియేలా గోల్డ్‌బామ్‌
    (m. 2018; div. 2021)
  • లావినియా వాల్బోనేసిని
    (m. 2021)
సంతానం3
తల్లిదండ్రులు
  • అల్వారో నోబోవా
  • అనాబెల్లా అజిన్
నివాసంకారొండెలెట్ ప్యాలెస్
చదువు
  • న్యూయార్క్ విశ్వవిద్యాలయం (బిబిఎ)
  • నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం (ఎంబిఎ)
  • జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం (ఎంఎ)

ఈక్వడార్ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యువ వ్యాపారవేత్త డేనియెల్‌ నొబోవా.[2] మధ్యంతర ఎన్నికల్లో ఆయన, వామపక్ష ప్రత్యర్థి లూయిసా గొంజాలెజ్ మీద విజయం సాధించారు. 2023 అక్టోబరు 16వ తేదీన వెల్లడించిన ఫలితాల్లో డేనియెల్‌ నొబోవాకు 52 శాతం, గోంజాలేజ్ కు 42 శాతం ఓట్లు లభించాయి. 35 సంవత్సరాల డేనియల్ నొబోవా, ఈక్వడార్ దేశ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న అత్యంత పిన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అవినీతి ఆరోపణతో ఇంతకుముందు ఉన్న అధ్యక్షుడు గిలెర్ము లాస్సో పార్లమెంటును అర్ధాంతరంగా రద్దు చేయడంతో ఈ మధ్యంతర ఎన్నికలు జరిగాయి. డేనియల్ తండ్రి 5 సార్లు దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు.

తొలినాళ్ళ జీవితం, చదువు

[మార్చు]

1987 నవంబరు 30న అమెరికాలో ఉన్న ఫ్లోరిడాలోని మయామిలో డేనియల్ రాయ్ గిల్‌క్రిస్ట్ నోబోవా అజిన్ జన్మించాడు. [3] [4] మయామిలో పుట్టిన ఇతడు గుయాక్విల్‌లో పెరిగాడు. [5] [6] ఇతని తల్లిదండ్రులు అల్వారో నోబోవా, అన్నాబెల్లా అజిన్. తండ్రి ఈక్వడార్ వ్యాపారవేత్త, తల్లి ఈక్వడార్ వైద్యురాలు. [7] ఇతడు న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి 2010లో పట్టభద్రుడయ్యాడు [8]. ఆ తరువాత ఇతడు ఇల్లినాయిస్‌లోని ఇవాన్‌స్టన్‌లోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందాడు. [9] 2020లో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. [9] [10] నోబోవా ప్రస్తుత ప్రెస్ సెక్రటరీ అయిన ప్రొఫెసర్ రాబర్టో ఇజురియెటా పర్యవేక్షణలో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ కమ్యూనికేషన్, స్ట్రాటజిక్ గవర్నెన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని 2022లో ఇతడు పొందాడు. [9]

వ్యక్తిగత జీవితం

[మార్చు]
Noboa is standing next to his wife Lavinia Valbonesi during his inauguration.
2023 నవంబరులో జరిగిన ప్రారంభోత్సవంలో నోబోవా తన భార్య లావినియా వాల్బోనేసితో

2018లో నోబోవా, గాబ్రియేలా గోల్డ్‌బామ్‌ను వివాహం చేసుకున్నాడు. [11] వీరికి ఒక కుమార్తె ఉంది. ఆ తరువాత ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. [12] 2021 జూన్ లో నోబోవా భీమా సంస్థ అయిన మ్యాప్‌ఫ్రేపై దాఖలు చేసిన ఫిర్యాదును స్పానిష్ న్యాయస్థానం దర్యాప్తు చేయడానికి అంగీకరించింది. విడాకుల ప్రక్రియ జరుగుతూండగా, గోల్డ్‌బామ్‌కు సంబంధించిన గోపనీయ డేటాను వెల్లడించినందుకు అతను ఈ కేసు పెట్టాడు.[13]

2019లో గోల్డ్‌బామ్‌తో కాపురం చేస్తూన్న సమయం లోనే నోబోవాకు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లావినియా వాల్బోనేసినితో పరిచయమైంది. ఆమెను తన వ్యక్తిగత పోషకాహార నిపుణురాలిగా నియమించుకున్నాడు. 2021 లో నోబోవా, లావినియా వాల్బోనేసిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
    • "Daniel Noboa sí puede ser candidato presidencial pese a haber nacido en el exterior: estos son los requisitos que están en la Constitución". 11 September 2023. Archived from the original on 14 September 2023. Retrieved 3 November 2023.
    • "Who is Daniel Noboa and what can he accomplish in a 17-month presidential term?". 17 October 2023.
    • "Estados Unidos es el país natal de Daniel Noboa". 2 July 2024. Archived from the original on 11 April 2025. Retrieved 12 January 2025.
    • "Sobre la nacionalidad de Noboa Azín". Diario Expreso. Archived from the original on 19 January 2025. Retrieved 12 January 2025.
  1. "Ecuador New president: ఈక్వెడార్‌ అధ్యక్షుడిగా డేనియెల్‌ నొబోవా". Sakshi Education. Retrieved 2024-01-03.
  2. "Who is Daniel Noboa, Ecuador's youngest president-elect?". The Times of India. 16 October 2023. ISSN 0971-8257. Archived from the original on 3 November 2023. Retrieved 1 November 2023.
  3. "El empresario bananero Daniel Noboa gana las elecciones de Ecuador". La Vanguardia (in స్పానిష్). 16 October 2023. Archived from the original on 1 November 2023. Retrieved 1 November 2023.
  4. "Daniel Noboa sí puede ser candidato presidencial pese a haber nacido en el exterior: estos son los requisitos que están en la Constitución". El Universo. 11 September 2023. Archived from the original on 14 September 2023. Retrieved 3 November 2023.
  5. "Controversy: Did Daniel Noboa Really Born in Ecuador? | Clash among the "Good People" at CNE | Buenas Buenas". Eightify. Archived from the original on 3 November 2023. Retrieved 3 November 2023.
  6. "Daniel Noboa anuncia su candidatura a la presidencia: "Soy un hombre de proyectos que no se rinde"" [Daniel Noboa announces his presidential candidacy: "I am a man of projects who doesn't give up."]. Vistazo (in స్పానిష్). Archived from the original on 27 May 2023. Retrieved 31 May 2023.
  7. "Elecciones Ecuador 2023: Daniel Noboa Azín buscará por primera vez la Presidencia de Ecuador, que su padre Álvaro Noboa no logró en cinco intentos". Ecuavisa (in స్పానిష్). 24 May 2023. Archived from the original on 6 June 2023. Retrieved 31 May 2023.
  8. 9.0 9.1 9.2 "¿Quién es Daniel Noboa?". El Comercio. 25 May 2023. Archived from the original on 29 June 2023. Retrieved 31 May 2023.
  9. "¿Quién es Daniel Noboa, presidente electo de Ecuador?". GK (in స్పానిష్). 15 June 2023. Archived from the original on 19 October 2023. Retrieved 3 November 2023.
  10. "Daniel Noboa Azín y Gabriela Goldbaum se casan en Salinas". La República EC (in స్పానిష్). 15 January 2018. Archived from the original on 3 October 2023. Retrieved 31 May 2023.
  11. Telégrafo, El (18 October 2020). "Si no podemos confiar en la justicia, no es justicia". El Telégrafo (in యూరోపియన్ స్పానిష్). Archived from the original on 31 August 2023. Retrieved 31 May 2023.
  12. "Juez español investiga a Mapfre por revelar secretos de empresario ecuatoriano" [Spanish judge investigates Mapfre for revealing secrets of Ecuadorian businessman.]. Ecuavisa. 19 July 2021. Archived from the original on 31 May 2023. Retrieved 18 October 2023.