Jump to content

డేవిడ్ ఫ్రాలే

వికీపీడియా నుండి
(డేవిడ్ ఫ్రావ్లే నుండి దారిమార్పు చెందింది)
డేవిడ్ ఫ్రావ్లే (వామదేవ శాస్త్రి)
2007లో డేవిడ్ ఫ్రావ్లే
జననం (1950-09-21) 1950 సెప్టెంబరు 21 (వయసు 74)
విస్కాన్సిన్, యునైటెడ్ స్టేట్స్
జాతీయతఅమెరికన్
వృత్తివేదాచార్య, ఆయుర్వేద గురువు, వేద జ్యోతిష్కుడు, రచయిత
జీవిత భాగస్వామియోగి శాంభవి చోప్రా
పురస్కారాలుపద్మ భూషణ్

వామదేవ శాస్త్రిగా పిలవబడే డేవిడ్ ఫ్రావ్లే ఒక అమెరికన్ రచయిత, జ్యోతిష్కుడు, ఉపాధ్యాయుడు (ఆఈడు), హిందు ఇజం ప్రతిపాదకుడు.[1]

అతను వేదాలు, హిందూ ధర్మం, యోగ, ఆయుర్వేదం, జ్యోతిష్యం వంటి అంశాలపై అనేక పుస్తకాలు రాశాడు. అతని రచనలు సామాన్య ప్రజలలో ఆదరణ పొందాయి. 2015లో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది.[2]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

డేవిడ్ ఫ్రావ్లే విస్కాన్సిన్‌లోని ఒక కాథలిక్ కుటుంబంలో జన్మించాడు. అతనికి తొమ్మిది మంది తోబుట్టువులు ఉన్నారు. అతను ముంబయికి చెందిన డా. బి.ఎల్. వష్టా వద్ద సుమారు ఒక దశాబ్దం పాటు ఆయుర్వేదాన్ని అభ్యసించాడు. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైనీస్ మెడిసిన్, శాంటా ఫే, న్యూ మెక్సికో నుండి కరస్పాండెన్స్ కోర్సు ద్వారా "డాక్టర్ ఆఫ్ ఓరియంటల్ మెడిసిన్" డిగ్రీని పొందాడు.[3][4]

హిందుత్వ సిద్ధాంతకర్త

[మార్చు]

అతను హిందుత్వ ఉద్యమం వ్యక్తిగా వర్ణించబడ్డాడు. అనేకమంది పండితులు అతన్ని హిందుత్వ సిద్ధాంతకర్త అని వర్నించారు. అతను హిస్టారికల్ రివిజనిజంను అభ్యసిస్తున్నాడని విస్తృతంగా ఆరోపించబడ్డాడు. మార్తా నస్బామ్, ఇతరులు అతన్ని ఇండో-ఆర్యన్ వలసల సిద్ధాంతానికి అత్యంత దృఢమైన ప్రత్యర్థిగా భావిస్తారు. [5][6][7]

ప్రముఖ ప్రచురణలు

[మార్చు]

హిందుత్వం, ఇండాలజీ

[మార్చు]
  1. స్వర్ణయుగం నుండి శ్లోకాలు: యోగిక వివరణతో ఋగ్వేదం నుండి ఎంచుకున్న శ్లోకాలు. మోతీలాల్ బనార్సిదాస్ పబ్లికేషన్స్, 1986. ISBN 8120800729.
  2. ప్రాచీన దర్శనీయుల జ్ఞానం: ఋగ్వేద మంత్రాలు. మోతీలాల్ బనార్సిదాస్ పబ్లిషర్స్ (ప్రై. లిమిటెడ్), 1999. ISBN 8120811593.
  3. ఎరైజ్ అర్జునా: హిందూయిజం రిసర్జెంట్ ఇన్ ఎ న్యూ సెంచరీ. బ్లూమ్స్‌బరీ పబ్లిషింగ్, 2018. ISBN 9388134982.
  4. మేల్కొలుపు భరత్: భారతదేశ పునర్జన్మ కొరకు పిలుపు. బ్లూమ్స్‌బరీ ఇండియా, 2018. ISBN 9388271009.
  5. హిందూత్వం అంటే ఏమిటి?. బ్లూమ్స్‌బరీ ఇండియా, 2018. ISBN 9789388038638.

యోగా, వేదాంతం, ఆయుర్వేదం

[మార్చు]
  1. ఆయుర్వేద వైద్యం. పాసేజ్ ప్రెస్, 1989. ISBN 1878423002.
  2. ఆయుర్వేదం, మనస్సు: ది హీలింగ్ ఆఫ్ కాన్షియస్‌నెస్. మోతీలాల్ బనార్సిదాస్ పబ్లికేషన్స్, 2005. ISBN 812082010X.

సహ రచయిత

[మార్చు]
  1. ది యోగా ఆఫ్ హెర్బ్స్: యాన్ ఆయుర్వేదిక్ గైడ్ టు హెర్బల్ మెడిసిన్. మోతీలాల్ బనార్సిదాస్ పబ్లికేషన్స్, 2004. ISBN 8120820347.

మూలాలు

[మార్చు]
  1. Brown, Garrett W.; McLean, Iain; McMillan, Alistair (2018-01-06). The Concise Oxford Dictionary of Politics and International Relations. Oxford University Press. p. 381. ISBN 9780192545848.
  2. Chetan Bhatt (2000). "Hindu Nationalism and Indigenous 'Neo-racism'". In Back, Les; Solomos, John (eds.). Theories of Race and Racism: A Reader. Psychology Press. pp. 590–591. ISBN 9780415156714. Retrieved 22 March 2019.
  3. Wujastyk, Dagmar; Smith, Frederick M. (2013-09-09). "Introduction". Modern and Global Ayurveda: Pluralism and Paradigms (in ఇంగ్లీష్). SUNY Press. pp. 18–20. ISBN 978-0-7914-7816-5.
  4. Acupuncture Today – October, 2003, Vol. 04, Issue 10, International Institute of Chinese Medicine Closes
  5. Gilmartin, David; Lawrence, Bruce B (2002). Beyond Turk and Hindu: rethinking religious identities in Islamicate South Asia (in ఇంగ్లీష్). New Delhi: India Research Press. ISBN 9788187943341. OCLC 52254519.
  6. Lal, Vinay (1999). "The Politics of History on the Internet: Cyber-Diasporic Hinduism and the North American Hindu Diaspora". Diaspora: A Journal of Transnational Studies. 8 (2): 137–172. doi:10.1353/dsp.1999.0000. ISSN 1911-1568. S2CID 144343833.
  7. Tripathi, Salil (October 2002). "The End of Secularism". Index on Censorship. 31 (4): 160–166. doi:10.1080/03064220208537150. ISSN 0306-4220. S2CID 146826096.