Jump to content

డొంకెన శ్రీశైలం

వికీపీడియా నుండి
డొంకెన శ్రీశైలం

డొంకెన శ్రీశైలం కాళోజీ చేత ‘అమ్మకవి’ అనిపించుకున్న సహజ కవి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అమ్మను మాతృమూరిగానే కాదు, అపర దేవతగా గౌరవించి పూజించిన కరుణామయుడు. తన హాస్యోక్తులతో కడుపుబ్బ నవ్వించిన హాస్య ప్రియుడు. అమ్మ విశ్వరూపం, అమ్మనెనరు, అమ్మ తనం, అనితరసాధ్యమైన అమ్మ గుణాన్ని కవిత్వీకరించిన వాడు డొంకెన. డొంకెనది అహరహం స్త్రీల పట్ల ఆవ్యాజమైన గౌరవ దృక్పథం. ఆమె ఎత్తు ఆకాశమంతటిదన్నడు. ఈలోకంలో అద్భుతమైన అమ్మ నడక ఆగలేదు అని నినదిస్తూ నిలిచాడు. రైతన్న గుండెదడను, నేతన్న పోగుల పేగులు తెగిన సవ్వడిని తన కవిత్వంతో వినిపిస్తూ కష్టాలు, కన్నీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమై కవితలల్లాడు. ఆయన పలుకుల్లో మాండలిక పదాలు, పలుకుబడులకు లోటుండక అవి తొణిసలాడుతూ వస్తాయి. అందుకే ఆతని తొలి కవితా సంపుటి అమ్మను భవనగిరిలోనే ఆవిష్కరించిన ప్రజాకవి కాళోజీ- అతనివి విద్యాలయాల్లో చదివిన చదువులు గాక (బడిపలుకులు గాకుండా) పలుకుబడులను (పామర జనరంజకాలని) శ్లాఘించాడు. [2]

కవితా సంపుటాలు

[మార్చు]

‘అమ్మా’ (2001), ‘అమ్మనడక ఆగలేదు’ (2014) అన్నవి ఆయన కవితా సంపుటాలు.

మరణం

[మార్చు]

ఆయన డిసెంబరు 4 2014 న మరణించారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "'అమ్మకవి' ఇక లేరు - అమ్మంగి వేణుగోపాల్‌ (05-Dec-2014)". Archived from the original on 2016-03-07. Retrieved 2015-07-23.
  2. "అమ్మకవి డొంకెన శ్రీశైలం". Archived from the original on 2015-07-23. Retrieved 2015-07-23.
  3. 'అమ్మకవి' డొంకెనకు అశ్రుతాంజలి...[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]