డొలొమెడెస్‌ బ్రియాన్‌ గ్రీనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డొలొమెడెస్‌ బ్రియాన్‌ గ్రీనె
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Animalia
విభాగం: Arthropoda
తరగతి: Arachnida
క్రమం: Araneae
ఉప క్రమం: Opisthothelae
కుటుంబం: Pisauridae
జాతి: Dolomedes
ప్రజాతి: D. briangreenei
ద్వినామీకరణం
డొలొమెడెస్‌ బ్రియాన్‌ గ్రీనె
Dolomedes briangreenei

(Raven, 2016)

డొలొమెడెస్‌ బ్రియాన్‌ గ్రీనె ఆస్ట్రేలియా దేశంలో కనుగొనబడిన ఒక రకమైన సాలెపురుగు.[1] ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త బ్రియాన్‌ గ్రీనె గౌరవార్ధం దీనికా పేరు పెట్టారు.[2]

విశేషాలు[మార్చు]

  • అరచేయంత పరిమాణంలో ఉండే ఈ సాలెపురుగు నీటి ఉపరితలంపై, అలలపై స్వారీ చేస్తుంటుంది. తన మధ్య కాళ్ల జతతో ఈదుతూ పరుగులు తీస్తుంది. ఇలా చేస్తూ చేపల్ని, కప్పల్ని, కీటకాల్ని పట్టుకొని ఆహారంగా తీసుకుంటుంది.
  • దీనికి ఎంత తెలివి అంటే... శత్రుజీవులు కనబడే వరకూ నిశ్శబ్దంగా ఉండి ఒక్కసారిగా వాటిపై దాడి చేస్తుంది. ఒకవేళ అది అందకుండా నీటిలోకి పారిపోతే... పట్టు విడవకుండా వెంబడించి పట్టుకుంటుంది. గంటసేపైనా నీటిలోపలే ఉండి వెతుకులాడుతుంది. నీటి ఉపరితలం పైకి తెచ్చేసుకుని తీరిగ్గా భుజిస్తుంది.
  • ఇలా తన శరీరం కన్నా మూడు రెట్లు పెద్దవైన జీవుల్నీ వేటాడగలదిది.
  • ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలోని మంచి నీటి చెరువుల్లో కనిపిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. Molloy, Mark (9 March 2016). "Meet Brian: the 'surfing' spider that rides waves to hunt prey". The Daily Telegraph. Retrieved 12 March 2016.
  2. Howard, Brian Clark (March 11, 2016). "A Spider Named Brian". National Geographic Society. Retrieved 2016-06-13.

బయటి లంకెలు[మార్చు]