డోనా ఫ్లోర్ అండ్ హర్ టూ హస్బెండ్సు
డోనా ఫ్లోర్ అండ్ హర్ టూ హస్బెండ్సు. పునర్ వివాహాలు చేసుకొన్న సిపాయిల భార్యల అనుభవాలు, కొందరు మహిళల అనుభవాలు సైకాలజీ టుడే, 2024, మే 14 పత్రికలో చర్చించ బడినవి. గతించిన భర్త స్మృతులు ఎల్లప్పుడు తమ మనసుల్లో పచ్చగానే ఉంటాయని, భర్త లేకపోయినా వారి అనురాగాన్ని అనుభవిస్తున్నట్లు చాలా మంది అన్నారు. కొద్ది మంది మాత్రం ఆ స్మృతులను గుండెల్లోంచి తొలగించుకొన్నామని అన్నారు. జీవితంలో వితంతువును పెళ్ళాడిన రెండవభర్త క్రియాశీల ప్రవర్తన, భార్యపట్ల చూపేశ్రద్ధ వల్ల ఇది సాధ్యమయినట్లు పరిశోధనల్లో తేలింది.
"తొలిభర్త స్మృతులకు ఎల్లప్పుడూ నా హృదయంలో స్థానం ఉంటుంది" అని ఎక్కువమంది అన్నారు. ఏళ్లు గడిచినా ఈ బంధం ప్రభావాన్ని చూపుతూనే ఉంటుందట! రెండవ భర్తకు ఆ గుర్తులు యిష్టం ఉండవని ప్రయత్నపూర్వకంగా కొందరు చెరిపేసుకొంటారట!
గతాన్ని ఆదర్శీకరించుకొన్న వారిలో ఆ స్మృతులు నిరంతరం వెంటాడుతాయి. ఒక్కోసారి ప్రస్తుత భాగస్వామి పట్ల తనకుగల ప్రేమను ప్రశ్నించేంత అతిగా ఉంటుంది. మానవుల హృదయాలలో అనేకులకు ప్రేమను పంచగలశక్తిని ప్రకృతి ఇచ్చిందేమో!
ARAN BEN-zeev Ph.D "In the name of love" గ్రంథంలో ఈ విషయాలు వివరంగా రాశాడు. ఎక్కువమంది వితంతువులు తమ ఊహాప్రపంచంలో ఆ స్మృతులను భద్రంగా, పదిలంగా దాచుకొంటారు. మానసికమైన ఏకాంతం వితంతువులను వెంటాడుతుంది. పతి గతించాక ఇదే ఎక్కువమంది స్త్రీల అనుభవం. భర్త పోయిన మహిళలు మానసికంగా romantic breakup చేసుకోవాలి, దీనివల్ల భవుతిక ఎడబాటు కలుగుతుంది, కానీ మానసికమయిన బంధాన్ని తెంపుకోరాదట!
వితంతుస్రీలు ప్రేమలో పడవచ్చు, కానీ ఈ బంధం సంక్లిష్టమయినదట! మూడు హృదయాలు ముడిపడిన సమస్య.
jorge Amado 1966 లో రాసిన "Dona flor and her Two Husbands" నవలను ఆ పేరుతోనే 1976 లో బ్రెజిల్ దేశంలో కామెడీ సినిమాగా తీశారు. 1982 లో హాలీవుడ్ లో మళ్ళీ తీశారు. డోనా తొలి భర్త వాడిన్ హో నృత్యం చేస్తూ చనిపోతాడు. అతను మహా గొప్ప ప్రేమికుడు, కానీ రాక్షసుని వంటి మొగుడు. తర్వాత ఆమె మందకొడిగా, ఏమాత్రం హుషారులేని టెడ్ ద్రవను కలుస్తుంది, పెళ్ళాడుతుంది. తొలి భర్త మరణ యానివర్సరీ రోజు, ఆమె తొలి భర్త స్వప్నంలో నగ్నంగా కనిపించి ఆమెతో కలుస్తాడు.("claiming that she has called him to share her bed." She gives in and lives happly with both husbands.)
"I still alwaays love and miss my late husband" అంటుంది ఒక మహిళ. గత స్మృతుల్లో అతణ్ణి తలచుకొంటూ కన్నీళ్ళు పెట్టుకొంటూ, వర్తమానంలోని భర్తను గురించి బావించుకొంటూ సంతోషించడం చాలా ఆశ్చర్యం కలిగించింది అంటాడు రచయిత ARAN BEN. మనిషి యంత్రం కాడు, మనిషి మనిషికీ వేరువేరు స్పందనలుంటాయి అని ARAN BEN పరిశోధనలో తేలినట్లనిపించింది.
మూలాలు:1. సైకాలజీ టుడే, మే 14 పత్రిక,2024,2.Dona flor and her Two Husbands నవల, సినిమాలు.