Jump to content

డోలియా

వికీపీడియా నుండి

డోలియా అనేమాట ఇప్పటికీ ఉభయ గోదావరి జిల్లాలలో వాడుకలో ఉంది. దాదాపు ఏడు దశాబ్దాల క్రిందటివరకు మండువా ఇళ్ళు ఈ జిల్లాలలో సాధారణం. ఇంటిలో నాలుగు వయిపుల పంచ, మధ్య నలచదరంగా ఖాళీప్రదేశం, దానివల్ల యింట్లో అన్ని గదులలోకి సూర్యకాంతి చక్కగా వచ్చేది. వర్షాకాలం వానలు కురిసినపుడు వాననీరు కూడా పెంకుల ఇంటి కప్పుల మీదినుంచి మండువలోకి పడేది. గోదావరి మీది ఆనకట్ట, పంటకాలువలు రాకముందు రోజుల్లో ఈ జిల్లాలలోనూ నీటి ఎద్దడి ఉండేది. వానాకాలం కురిసిన వర్షపునీరు వృధాకాకుండా మండువా యిళ్లలో డోలియా అనే ఏర్పాటు ద్వార ఆ నీటిని,పెద్ద తోట్లలోకి పంపి నిలువచేసుకొనేవారు.పెంకుటింటి కప్పుమీద పడిన వాననీటిని విశాలమయిన రేకు పళ్ళెంలో సేకరించి, అనీటిని లోహపు గొట్టంద్వారా తోట్లలోకి నింపె ఏర్పాటు ఇది. ఈ లోహపుపళ్ళెం, దానిలో చేరిన నీరు తోట్లలోకి, భూమిలోకి పంపి నిలువచేసేవారు. ఈ మొత్తం విధానాన్ని డోలియా అని పిలిచేవారు. ఆంగ్లంలో డోలియం ఏకవచనం, డోలియా బహువచనం. dolium అంటే పెద్ద బాన ఆకారంలో ఉండీ నీరు,లేదా ఏదయినా ద్రవపదార్థం నిలువచేసుకొనను వాడే పాత్ర. రోమనులు, యూరోపియన్లు dolium ను నీటి నిలువకు, రవాణాకూ కూడా వాడేవారు. బహుశా ఇంగ్లీషు పాలకుల ద్వారా ఈ విధానం తెలుగువారికి వచ్చిందో, లేక అంతకు ముందునుంచి తెలుగు వారికి తెలుసో స్పష్టంగా తెలియదు. తెలుగువాళ్ళు మాత్రం డోలియా అనే బహువచన రూపాన్నే వాడుక చేశారు. ఇప్పుడు, 21వ శతాబ్దిలో కూడా ఇంకా ఉభయ గోదావరి జిల్లాలలో డోలియా అమర్చిన పాతకాలపు మండువా ఇళ్ళు అరుదుగా నయినా కనపడతాయి.

మూలాలు: 1.WIKIPEDIA: Dolium Explanation and its history. తెలుగువారిలో కొందరికి డోలియా అని ఇంటిపేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2.ముఖ పుస్తకంలో "స్నేహ హస్తం సొసైటి పడమట భువనేశ్వరి" డోలియా ఫోటో, వివరాలు పోస్ట్ చేశారు.

"https://te.wikipedia.org/w/index.php?title=డోలియా&oldid=4364063" నుండి వెలికితీశారు