డ్రెస్డెన్ సాంకేతిక విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(డ్రెస్దెన్ యూనివర్సిటి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జర్మనీలోని టెక్నిష్ యూనివర్సిటీ డ్రెస్డెన్ (డ్రెస్డెన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ) దృశ్యచిత్రం

డ్రెస్డిన్ టియుడి లేదా సాంకేతిక విశ్వవిద్యాలయం (టియు డ్రెస్డిన్ - టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డ్రెస్డెన్) జర్మనీ, డ్రెస్డెన్ నగరంలో ఉన్న ప్రభుత్వ పరిశోధనా విశ్వవిద్యాలయం. డ్రెస్డెన్ నగరంలోని ఉన్నత విద్యా సంస్థల్లోకెల్లా అతిపెద్దది.సాక్సనీ రాష్ట్రం లోని అతిపెద్ద విశ్వవిద్యాలయం ఇది. జర్మనీ లోని అతిపెద్ద 10 విశ్వవిద్యాలయాల్లో ఒకటి. 2018 నాటికి ఈ విశ్వవిద్యాలయంలో 32,389 మంది విద్యార్థులు చదువుతున్నారు.[1]

టెక్నిష్ యూనివర్సిటీ డ్రెస్డెన్ అనే పేరు 1961 నుండి మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ, విశ్వవిద్యాలయ చరిత్ర మాత్రం దాదాపు 200 సంవత్సరాల నాటిది. క్రితమే 1828 వరకు ఉంది. ఇది జర్మనీలోని పురాతన సాంకేతిక కళాశాలలలో ఒకటిగా, దేశం లోని పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటి. 2012 లో జరిగిన ఎక్సలెన్స్ ఇనిషియేటివ్‌లో విజయం సాధించిన పదకొండు జర్మన్ విశ్వవిద్యాలయాలలో ఇదీ ఒకటి. తద్వారా "యూనివర్శిటీ ఆఫ్ ఎక్సలెన్స్" అనే బిరుదు లభించింది. ఈ ఇనిషియేటివ్ లోని ఫ్యూచర్ కాన్సెప్ట్, గ్రాడ్యుయేట్ స్కూల్స్, క్లస్టర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే మూడు రౌండ్లలోనూ డ్రెస్డెన్ సాం.వి.వి విజయం సాధించింది.

నిర్మాణం[మార్చు]

టియు డ్రెస్డెన్ 14 బోధనా విభాగాలున్నాయి. రెండు మినహాయించి మిగతా విభాగాలన్నీ నగర కేంద్రం నుండి దక్షిణంగా ఉన్న ప్రధాన ప్రాంగణం లోనే ఉన్నాయి. మెడిసిన్ ఫ్యాకల్టీ నగర కేంద్రానికి తూర్పున ఉన్న ఎల్బే రివర్ వద్ద, అటవీ శాఖ థరాంట్ లోనూ ఉన్నాయి.

విజ్ఞాన శాస్త్రాలు[మార్చు]

4,390 మంది విద్యార్థులతో గణిత, విజ్ఞాన శాస్త్ర విభాగం విశ్వవిద్యాలయం లోని అతిపెద్ద విభాగం. ఇందులో బయాలజీ, కెమిస్ట్రీ, గణితం, ఫిజిక్స్, సైకాలజీ అనే 5 విభాగా లుంటాయి. ఈ విభాగాలన్నీ ప్రధాన ప్రాంగణం ‌లోనే ఉన్నాయి. 2006 లో, జీవశాస్త్ర విభాగం కోసం కొత్త పరిశోధన భవనాన్ని ప్రారంభించారు. 2006 అక్టోబరులో, డ్యూయిష్ ఫోర్స్‌చంగ్స్గెమిన్‌చాఫ్ట్ సంస్థ డ్రెస్డెన్ ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఫర్ బయోమెడిసిన్ అండ్ బయో ఇంజనీరింగ్ అనే కొత్త గ్రాడ్యుయేట్ పాఠశాల స్థాపనకు నిధులు సమకూర్చాలని నిర్ణయించుకుంది.

మూలాలు[మార్చు]

  1. "Facts and figures of TU Dresden".

వెలుపలి లంకెలు[మార్చు]