ఢిల్లీ దర్బారు పతకం (1911)
Delhi Durbar Medal, 1911 | |
---|---|
Type | Commemoration medal |
Awarded for | Participation in Durbar or broader service to the Indian Empire |
అందజేసినవారు | United Kingdom and British Raj |
Established | 1911 |
Total | 200 gold and 26,800 silver medals |
ఢిల్లీ దర్బారు పతకం 1911 | |
---|---|
Type | స్మారక పతకం |
Awarded for | దర్బారులో ఉండడం లేదా భారత సామ్రాజ్యానికి విస్తృతమైన సేవ |
అందజేసినవారు | యునైటెడ్ కింగ్‌డమ్, బ్రిటిష్ రాజ్ |
Established | 1911 |
Total | 200 బంగారు, 26,800 వెండి పతకాలు |
భారతదేశానికి కొత్త చక్రవర్తిని ప్రకటించినపుడు ఢిల్లీ దర్బారు జ్ఞాపకార్థం యునైటెడ్ కింగ్‌డమ్ నెలకొల్పిన పతకాలను ఢిల్లీ దర్బారు పతకాలు అంటారు. [1] వీటిని రెండు సందర్భాలలో - 1903 లో ఎడ్వర్డ్ VII రాజైనపుడు ఒకసారి, మళ్ళీ 1911 లో జార్జ్ V రాజైన సందర్భంలో రెండోసారి ఈ పతకాలను ప్రదానం చేసారు. ఇవి ఒకటిన్నర అంగుళాల వ్యాసం కలిగి, బంగారు, వెండి రెండింటి తోనూ ప్రదానం చేసారు. [2] వీటిని ఎడమ ఛాతీపై పట్టాభిషేకం, జూబ్లీ పతకాలతో పాటు తేదీ క్రమంలో ధరిస్తారు. దీన్ని ఒకటిన్నర అంగుళాల వెడల్పు ఉన్న రిబ్బనుకు తగిలిస్తారు. [3] ఈ రాయల్ స్మారక పతకాలు 1918 నవంబరు వరకు ప్రచార పతకాల కంటే ముందు ధరించారు. [4] ఆ తర్వాత ధరించే క్రమాన్ని మార్చి, ప్రచార పతకాల తర్వాత, సుదీర్ఘ సేవా పురస్కారాలకు ముందూ ఈ దర్బారు పతకాలను ధరించారు.
ఢిల్లీ దర్బారు పతకం, 1911
[మార్చు]బొమ్మ వైపు: కిరీటంతో ఉన్న కింగ్ జార్జ్ V, క్వీన్ మేరీ ముఖాలు గులాబీల పూల దండలో ఎడమ వైపున ఉంటాయి.వెనక వైపు: పర్షియన్ భాషలో ఒక లెజెండ్ ఉంటుంది. దీని అర్థం - బ్రిటిష్ సామ్రాజ్య ప్రభువు, భారత చక్రవర్తి అయిన జార్జ్ V దర్బారు. [5]ఈ పతకంపై పేరేమీ లేకుండా ప్రదానం చేయబడింది. [4]
పాలక అధిపతులు, ఉన్నత స్థాయి అధికారులకు బహూకరించేందుకు రెండు వందల బంగారు పతకాలను తయారు చేసారు. 30,000 వెండి పతకాలు ముద్రించగా, [6] వాటిలో 26,800 పౌర ప్రముఖులకు, ప్రభుత్వ అధికారులకు ప్రదానం చేసారు. వీటిలో 10,000 పతకాలను బ్రిటిషు, భారతీయ సైనికాధికారులకు, సైనికులకూ ఇచ్చారు. [7] దర్బారులో ఉన్నవారికి మాత్రమే కాకుండా, భారతదేశానికి రాజ్‌కు సహకరించిన ఇతరులకు కూడా పతకాన్ని ప్రదానం చేసాదు. [8]
కింగ్ జార్జ్ పట్టాభిషేక పతకం కోసం వాడిన రిబ్బన్నే దీనికీ వాడారు. బొమ్మ వైపు డిజైను రెంటికీ ఒకే విధంగా ఉంటుంది. అయితే, పట్టాభిషేక పతకం 1¼ అంగుళాల వ్యాసం ఉండగా, దర్బారు పతకం 1½ అంగుళాల వ్యాసంతో పెద్దదిగా ఉంటుంది. రెండు పతకాలు కలిసి ధరించలేరు. రెండింటినీ పొందినవారు తమ పట్టాభిషేక పతకపు రిబ్బన్‌పై 'ఢిల్లీ' అనే పదం ఉన్న పట్టీని ధరిస్తారు. [9]
పట్టాభిషేక పతకం రిబ్బన్ కోసం దర్బారు పట్టీ
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఢిల్లీ దర్బార్ మెడల్ (1903)
- ఢిల్లీ దర్బార్
- బ్రిటిష్ వలస భారతదేశం
- ఎంప్రెస్ ఆఫ్ ఇండియా మెడల్
మూలాలు
[మార్చు]- ↑ Christopher McCreery (2012). Commemorative Medals of the Queen's Reign in Canada, 1952-2012. Dundurn. pp. 32–. ISBN 978-1-4597-0756-6.
- ↑ Howard N Cole. Coronation and Royal Commemorative Medals. pp. 24 and 37. Published J. B. Hayward & Son, London. 1977.
- ↑ "Order of wear: London Gazette: 22 April 1921, issue: 32300, page:3184".
- ↑ 4.0 4.1 Howard N Cole. Coronation and Royal Commemorative Medals. pp. 3-4. Published J. B. Hayward & Son, London. 1977. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Cole3" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Yves Arden (1976). Military Medals and Decorations: A Price Guide for Collectors. David and Charles. p. 122. ISBN 978-0-7153-7274-6.
- ↑ Howard N Cole. Coronation and Royal Commemorative Medals. p. 25. Published J. B. Hayward & Son, London. 1977.
- ↑ Mussell, John W (ed.). Medal Yearbook 2015. p. 289. Published Token Publishing Limited, Honiton, Devon. 2015.
- ↑ Philip Lecane (15 April 2015). Beneath a Turkish Sky: The Royal Dublin Fusiliers and the Assault on Gallipoli. History Press Limited. pp. 54–. ISBN 978-0-7509-6477-7.
- ↑ Howard N Cole. Coronation and Royal Commemorative Medals. p. 37. Published J. B. Hayward & Son, London. 1977.