Jump to content

తగడ కుటుంబము

వికీపీడియా నుండి

తగడ చెట్టు కొండ ప్రదేశములలో ఎత్తుగా పెరుగును.

ప్రకాండము: లావుగను పొడుగుగను వంకరలు లేక తిన్నగను, నుండుడును. బెరడు, దట్టము, దోదుమ వర్ణము

ఆకులు
అభిముఖ చేరిక, మిశ్రమ పత్రములు మిషమ పక్ష వైఖరి. చిట్టి ఆకులు 4 జగలు. వీని తొడిమ పొట్టిది. అండాకారము విషమ రేఖ పత్రములేతాకుల కడుగున మెత్తనిరోమములు గలవు. సమాంచలము, కొన్నిటి యందు కొంచెము గొగ్గి గొగ్గులుగ నుండును. కొన సన్నము.
పుష్ప మంజరి
కొమ్మల చివరల నుండి రెమ్మ గెలలు వృంతము మీదను ఉప వృంతము మీదను గోధుమ వర్ణము గల రోమములు గలవు. పుష్పములు పెద్దవి. అసరాళము చేటికలు చిన్నవి గలవు.
పుష్పకోశము
సంయుక్తము 5 దంతములు. నీచము.
దళస్వలయము
.... సంయుక్తము 5 తమ్మెలు అసరాళము పశుపు రంగు మంచి వాసన వేయును.
కింజల్కములు
4 కాడలు పొడుగు మరియొక గొడ్డు కాడ గలదు. దీనికి పుప్పొడి తిత్తి లేదు పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండకోశము
అండాశయము ఉచ్చము రెండు గదులు అండములు చాల గలవు. గింజలకు రెక్కలుండును. కీలమగుండ్రము కీలాగ్రము రెండు చీలికలు.

ముక్కడి చుట్టు కూడ కొండ ప్రదేశములే బాగుగ బెరుగును.

ఆకులు
అభి ముఖ చేరిక, మిశ్రమ పత్రములు పక్ష వైఖరి. చిట్టిఆకులు హృదయాకారము అడుగున నున్న జాత పెద్దవి. విష మ రేఖ పత్రము సమాంచలము కొన సన్నము.
పుష్ప మంజరి
కొమ్మల చివరల నుండి, త్రివృంత మధ్యారంభ మంజరులు, చేతికలు గలవు. పువ్వులు చిన్నవి. తెలుపు రంగు మంచి వాసన వేయును.
పుష్పకోశము
సంయుక్తము గొట్టమువలె నుండును. కొంచెమోష్టాకారము ఒక్కొక్కప్పుడు 4 దంతములుండును. నీచము.
దళ వలయము
సంయుక్తము బిళ్ళ గన్నేరు పువ్వుల వలె అడుగున పొడుగు గొట్టము వలెను, పైన 5 తమ్మెలు వ్యాపించి యు నుండును.
కింజల్కములు
2 పొట్టివి దళవలయము నంటి యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము
అండాశయము ఉచ్చము రెండు గదులు. అండములు చాల యున్నవి. కీలము పొడుగు కీలాగ్రము రెండు చీలికలు.

ఈ కుటుంబములో ఎక్కువగ తీతెలును, చెట్లును గలల్వు. వీని ఆకులు అభిముఖ చేరిక, కొన్నిటివి మాత్రము లఘు పత్రములు. పుష్పములు అసరాళము. కింజల్కములు దళ వలయపు తమ్మెలుకకంటె తక్కువగానుండును. అండాశస్యము రెండు గదులు, చాల గింజలుండును. గింఅలకు సాధారణముగ రెక్కలు గలవు. కాయ యెండి పగులును. ఈ కుటుంబములో ఉపయోగించు మొక్కలంతగా వున్నట్లు గాన వచ్చుట లేదు.

ముక్కడి చెట్టు కలప బూడిఒద వర్ణముగను గట్టిగాను నుండును. అది త్వరగా వంగి పోదు. కావున సాలి వాండ్రు మగ్గములకు దానినుపయోగింతురు. ఈ కలప ఇతర పనులకు కూడ పనికి వచ్చును.

తగడ చెట్టు కలప కూడ గట్టిగానే యుండి చిరకాలము మన్నును.

సంపెన చెట్టు చాల పొడుగుగ పెరుగును. పువ్వులు ఎర్రగా నుండును. దీని కలప గట్టిగా నుండదు.

కలిగొట్టు చెట్తు చిన్న చెట్టు. దీని పువ్వులు మంచి వాసన వేయును.

చిట్టి వడ్డి చెట్టు అడవులలో పెరుగును. పువ్వులు తెలుపు. కాయలు మెలివెట్టి కొని యుండును.