తత్పురుష సమాసము
స్వరూపం
ఉత్తర పదార్ధము ప్రధానముగా గలది తత్పురుష సమాసము. రామ బాణము - ఇందు పూర్వపదము రామ - ఉత్తరపదము బాణము. రామ బాణముతో చంపెను. అనగా ఇందు బాణము ప్రధానము. క్రియతో సంబంధము కలిగియుండును. మొదటి పదము లోపించిన విభక్తి పేరు సమాసమునకు వచ్చును. ఇది వ్యధి కరణ సమాసము. లోపించిన విభక్తిని చేర్చి చెప్పుట విగ్రహ వాక్యము.[1]good k monk his and wish play life very was but get of the you more that of you're but get ok more and he two part..
ఉదాహరణలు
[మార్చు]| సమాసము | విగ్రహవాక్యము | సమాసనామము | తత్పురుష సమాస రకం |
| 1 | అర్ధ రాజ్యము | రాజ్యము యొక్క అర్ధభాగము | ప్రధమా తత్పురుష సమాసము |
| కడతల | తల యొక్క కడ భాగము | ||
| 2 | కృష్ణ శ్రితుడు | కృష్ణుని ఆశ్రయించిన వాడు | ద్వితీయా తత్పురుష సమాసము |
| నెలతాల్పు | నెలను ధరించిన వాడు | ||
| 3 | గుణహీనుడు | గుణము చేత హీనుడు | తృతీయ తత్పురుష సమాసము |
| నెల తక్కువ వాడు | నెలచేత తక్కువ వాడు | ||
| 4 | పూజా | పూజ కొఱకు | చతుర్దీతత్పురుష సమాసము |
| గృహము దేవర మేలు | గృహము దేవర కొఱకు మేలు. | ||
| 5 | ప్రాణాధికుడు | ప్రాణముకంటె అధికుడు | పంచమీతత్పురుష సమాసము |
| దొంగ భయము | దొంగ వలన భయము | ||
| 6 | రాజభటుడు | రాజుయొక్క భటుడు | షష్ఠీ తత్పురుష సమాసము |
| చెట్టు కొమ్మ | చెట్టు యొక్క కొమ్మ | ||
| 7 | గృహకృత్యములు | గృహమందలి కృత్యములు | సప్తమీ తత్పురుష సమాసము |
| మాటనేర్పరి | మాటయందు నేర్పరి | ||
| 8 | అజ్ఞానము | జ్ఞానము లేనిది | నఙ్ఞ్ తత్పురుష సమాసము |
| అసత్యము | సత్యము కానిది |
మూలాలు
[మార్చు]- ↑ ఆలీ, షేక్. "లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/సమాస విభాగము - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2021-05-11.